ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు.. వైసీపీకి మరణశాసమేనా?

Publish Date:Sep 28, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏ రాజకీయ ప్రయోజనం ఆశించి, ఏ సామాజిక వర్గాన్ని జనానికి దూరం చేసి లబ్ధి పొందుదామని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు నిర్ణయం తీసుకున్నారో ఆ ప్రయోజనం చేకూరలేదు, ఆ లబ్ధి ఒనగూరలేదు సరి కదా.. మూడేళ్ల జగన్ పాలనలో మూటగట్టకున్న అపఖ్యాతి అంతా ఒకెత్తు అయితే.. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు నిర్ణయంతో ఆయన మూటగట్టుకున్న అపఖ్యాతి మరొక ఎత్తు అన్నట్లుగా మారింది.

పరిశీలకుల విశ్లేషణల మేరకు జగన్ సర్కార్ ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని అన్ని వర్గాల మనోభావాలనూ దెబ్బతీశారు. ముఖ్యమంత్రి కనుక ఆయన నిర్ణయాన్ని సమర్థిస్తూ ఒకరిద్దరు మంత్రులూ, నలుగురైదుగురు ఎమ్మెల్యేలూ, మరి కొంత మంది వైసీపీ నేతలూ ట్వీట్ల ద్వారానో, మీడియా మందు మాట్లాడారేమో కానీ.. వైసీపీలో అత్యధికులు జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. యార్లగడ్డ రాజీనామా, వల్లభనేని వంశీ బహిరంగంగా వ్యతిరేకిస్తూ నిర్ణయంపై పునరాలోచించాలని  జగన్ కు సూచించడం, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలను ధిక్కరించి మరీ హెల్త్ వర్సిటీ పేరు మార్పు నిర్ణయాన్ని సమర్థిస్తూ ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడకపోవడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు.

ఎవరు ఔనన్నా కాదన్నా ఎన్టీఆర్  ఒక సామాజిక వర్గానికి పరిమితమైన వ్యక్తి కాదు. ఆయనో మహానుభావుడు, యుగపురుషుడు. తెలుగు వాడిని, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటిన వ్యక్తి. రాజకీయ నాయకుడిగా ఆయన సమాజిక వైద్యం చేశారు. ఆయన రాజకీయ ప్రవేశం వరకూ వెనుకబడి ఉన్న బీసీ వర్గాలు రాజకీయంగా ఉన్నత పదవులు అందుకోవడానికి సోపానమయ్యారు. మధ్య తరగతి జీవులకు బతుకు భరోసా అయ్యారు. పేదవారికి నోటికాడ అన్నం ముద్దగా మారారు. అందుకే రాజకీయాలతో సంబంధం లేకుండా ఎన్టీఆర్ కు అన్ని వర్గాలలోనూ అభిమానులున్నారు. దైవాంశ సంభూతుడిగా ఆరాధించే వారు కోకొల్లలుగా ఉన్నారు.

ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మారుస్తూ జగన్ తీసుకున్న నిర్ణయం వైసీపీకి మరణశాసనం రాసేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పరిశీలకుల మాట పక్కన పెడితే ప్రభుత్వ నిఘా వర్గాలు కూడా అదే చెబుతున్నాయి. ఎన్టీఆర్ పేరు మార్పు నిర్ణయం తరువాత జగన్ గ్రాఫ్, వైసీపీ గ్రాఫ్ గతంలో ఎన్నడూ లేనంతగా దిగజారిపోయిందంటున్నారు. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాలలోనూ కూడా ఎన్టీఆర్ హెల్త్ వర్సటీ పేరు మార్పు అధికార పార్టీపై ప్రతికూల ప్రభావం చూపుతోందంటున్నారు. జగన్ ఆశించినట్లుగా సామాజిక వర్గాల వారీగా మద్దతు, వ్యతిరేకతగా విడిపోలేదనీ, జనం ముక్త కంఠంతో ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారనీ నిఘావర్గాలు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందించారని తెలుస్తోంది. ప్రధానంగా గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలలో ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు పై తీవ్ర వ్యతిరేకత, ఆగ్రహం వ్యక్తం అవుతున్నదని అంటున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికలలో జగన్ పార్టీ విజయం వెనుక ఈ జిల్లాలలో వీచిన అనుకూల పవనాలు ఉన్నాయనీ, ఇప్పుడవి వ్యతిరేక పవనాలుగా కాక వ్యతిరేక ప్రభంజనంలా మారే అవకాశం ఉందనీ నిఘావర్గాలు చెబుతున్నాయి. బీసీలను ఒక సామాజిక వర్గానికి దూరం చేయాలన్న దురాలోచనతో తీసుకున్న హెల్త్ వర్సిటీ మార్పు బూమరాంగ్ అయ్యిందని పార్టీ వర్గాలు కూడా చెబుతున్నాయి. బీసీలలోనే ఎక్కువగా ఎన్టీఆర్ పేరు మార్పు నిర్ణయం పట్ల ఆగ్రహం, వ్యతిరేకతా వ్యక్త మౌతోందంటున్నారు. ఇప్పుడు నష్ట నివారణ కోసం ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టామంటూ వివరణ ఇచ్చుకోవడానికి ప్రయత్నించినా అది చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్న చందమే అవుతోందని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. 

By
en-us Political News

  
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.