మున్సిపల్ ఎన్నికల నిర్వహణ సాద్యమేనా?
Publish Date:Aug 16, 2012
Advertisement
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై సర్వత్రా ఉత్కంఠతో ఉంది. ఇప్పటివరకు 2011 జనాభాలెక్కల ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తామని సుప్రీంకోర్టుకు తెలిపిన ప్రభుత్వం, లెక్కల వివరాలందటానికి ఇంకా సమయం పడుతుందన్న విషయాన్ని తెలుసుకొని ఎన్నికల నిర్వహణం పై మల్లగుల్లాలు పడుతుంది. 2013 మార్చివరకు జనాభా లెక్కల వివరాలు ఇవ్వలేమని కేంద్ర జనగణన మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పటంతో ప్రభుత్వానికి ఏమి చెయ్యాలో పాలుపోవడం లేదు. ఎన్నికలు నిర్వహించకపోతే రాష్ట్రానికి కేంద్ర ఆర్దిక సంఘంనుండి నిథులు రావని, నిర్వహిస్తే పార్టీ పరిస్థితేమిటని ప్రభుత్వం మధన పడుతుంది. అయితే త్వరలో 2001 జనాభా ప్రాతిపధికన ఎన్నికలు జరుపుతామని అందుకు చర్యలు తీసుకోవాలని, అధికారలను ఆదేశించడంతో మున్సిపల్ శాఖ అధికారులు అడ్వకేట్ జనరల్‌తో సమావేశమయ్యి పరిస్థితిని వివరించినట్లు తెలిసింది.అందుకు సంబంధించి హైకోర్టులో అఫిడవిట్ వేసేందుకు సమాయత్తమైంది. పాలకమండళ్లు ముగిసి సంవత్సరం గడచినా ఎన్నికలు నిర్వహించడంలో జాగు చేయడంతో ప్రణాళికా సంఘం నిథులు నిలుపు చేసింది.గత ఆర్ధిక సంవత్సరం చివరివిడతతో పాటు ఈ ఆర్దిక సంవత్సరం కూడా చిల్లి గవ్వ విదల్చలేదు. అయితే కోర్టు తీర్పుమేరకే ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి మహీధర్‌రెడ్డి తెలిపారు.
http://www.teluguone.com/news/content/is-it-possible-for-government-to-conduct-muncipal-elections-24-16583.html





