Publish Date:Oct 14, 2022
రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా నడుస్తోంది. అయితే ఎప్పడికప్పుడు సీబీఐ హడావుడి పెరిగిన ప్రతి సందర్భంలోనూ సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి.
తాజాగా వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి తనకు ప్రాణ భయం ఉందంటూ మీడియా ముందుకు రావడమే కాకుండా, తన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకపోవడమే కాకుండా తాను చెప్పిన విషయాలన్నీ అవాస్తవాలని ప్రకటిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అంతే కాకుండా దస్తగిరి తనకు ప్రాణ హాని జరిగితే సిఎం జగన్ దే బాధ్యత అని చెప్పాడాన్ని బట్టి ఈ కేసులో సిఎం పాత్ర ఉందని అనుమానించాల్సి వస్తున్నదని పరిశీలకులు అంటున్నారు.
అయితే వివేకా హత్య కేసులో ఎంపి అవినాష్ రెడ్డి, ఇతర ముఖ్య నేతల పై కేసు నమోదు చేయడంలో దస్తగిరి వాగ్మూలం కీలకం కావడంతో అతనికి రక్షణ కల్పించాలని తెలుగుదేశం డిమాండ్ చేస్తోంది. సుప్రీం కోర్టు లో వివేకా హత్య కేసు నిందితుల బెయిల్ పిటిషన్ల విషయంలో వెలువడుతున్న తీర్పులు చాలా స్పష్టంగా ఉన్నాయి.
వివేకా కేసులో జైల్లో ఉన్న నిందితులకు బైయిల్ ఇచ్చే విషయంలో కోర్టులు సుముఖంగా లేవు. వివేకా హత్య కేసులో సీబీఐ కి ఇటీవల షర్మిల వాంగ్మూలం . దస్తగిరి వాంగ్మూలంలో పేర్కొన్న నేతల ప్రమేయాన్ని షర్మిల సీబీ ఐ కి స్టేట్ మెంట్ ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే త్వరలో ఈ కేసులో అవినాష్ రెడ్డి అరెస్టు అనివార్యమని భావించాల్సి వస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/is-avinash-arrest-un-avoidable-in-viveka-murder-case-39-145396.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!