Publish Date:Sep 30, 2024
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడులు, ఉద్యొగాల కల్పనే లక్ష్యంగా సమీకృత ఇంధన విధానాన్ని రూపొందించింది. ఈ విధానం ద్వారా పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, 7.75 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకుంది. సౌర, పవన, బ్యాటరీ స్టోరేజ్, ఎలక్ట్రోలైజర్స్, బయో ఫ్యూయెల్, పీఎస్పీ, హైబ్రిడ్ ఎనర్జీ ప్రాజెక్టులన్నిటీకీ కలిపి ఒకే విధానంగా ఈ సమీకృత ఇంధన విధానం రూపొందించింది.
గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ దేశాల నుంచి పెట్టు బడులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే రాష్ట్రంలో వద్యుత్ ప్లాంట్ లను నెలకొల్పడానికి ముందుకు వచ్చే కంపెనీలకు బ్యాంకింగ్ సర్వీసులను అందజేయనుంది. అలాగే విద్యుత్ పునర్వినియోగానికి వీలుగా నిబంధనలను సులభతరం చేసింది. తద్వారా విద్యుత్ రుంగంలో పెట్టుబడులను వెల్లువెత్తడమే కాకుండా ఉద్యోగ అవకాశాలు కూడా గణనీయంగా పెరుగుతాయని భావిస్తున్నది.
రాష్ట్రంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని గణనీయంగా పెంచాలన్న లక్ష్యంతో ఉన్న ప్రభుత్వం అందుకు చర్యలలో భాగంగా రానున్న ఐదేళ్లలో 500 విద్యుత్ వాహనాల రీచార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో 150 విద్యుత వాహనాల చార్జీంగ్ యూనిట్లను నగరాలు, పట్టణాలు, జిల్లా హెడ్ క్వార్టర్లలోనూ 150 ఈవీ చార్జింగ్ కేంద్రాలను జాతీయ రహదారులపై ఏర్పాటు చేయనుండగా, మిగిలిన వాటిని ప్రైవేట్ భవనాలలో ఏర్పాటు చేయనుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/integrated-energy-policy-25-185889.html
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది దీపావళి వేడుకలను అత్యంత ప్రత్యేమైన ప్రాంతంలో జరుపుకున్నారు.
రెక్కల కష్టంతో బతుకులు.. రోడ్డు ప్రమాదంతో ఆవిరైన ప్రాణాలు.!
హైదరాబాద్లోని గచ్చిబౌలిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.