Publish Date:Apr 10, 2025
వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. తమ విధులకు ఆటంకం కలిగించిన కారణంగా పోలీసులు గోరంట్ల మాధవ్ ను గురువారం (ఏప్రిల్ 10) సాయంత్రం అదుపులోనికి తీసుకున్నారు.
Publish Date:Apr 10, 2025
ఎక్కడ పోగొట్టుకున్నామో, అక్కడే వెతుక్కోవాలి అంటారు పెద్దలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే చేస్తోందా అంటే.. అవుననే సమాధానమే వస్తోంది. కాంగ్రెస్ పార్టీ సుదీర్గ చరిత్రలో చాలా ఎత్తుపల్లాలు చూసింది. కానీ, 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర ఓటమి చరిత్రలో ఎరగని ఘోరాతి ఘోరమైన ఓటమి.
Publish Date:Apr 10, 2025
పవన్ మాజీ సతీమణి రేణూదేశాయ్ బీజేపీ గూటికి చేరనున్నారా? తాను మోడీ భక్తురాలినని చెప్పిన రేణూదేశాయ్ తన జాతకంలోనే రాజకీయ నాయకురాలినని ఉందని చెప్పడం వెనుక ఉద్దేశం బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించడమేనా?
Publish Date:Apr 10, 2025
బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ రోడ్డు ప్రమాద కేసు నుంచి తన కుమారుడిని తప్పించే ప్రయత్నం చేసినందుకు షకీల్ పై పోలీసులు గతంలోనే అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.
Publish Date:Apr 10, 2025
బీఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్‌కి వచ్చారు. జనరల్ చెకప్‌లో భాగంగా కేసీఆర్ ఆస్పత్రికి వచ్చినట్లు తెలుస్తోంది. వరంగల్ లో జరగబోయే బీఆర్‌ఎస్ పార్టీ రజత్సోవాల్లొ పార్టీ నాయకులతో కేసీఆర్ వరుస సమావేశలతో బీజీగా ఉండటంతో అనారోగ్యం పాలైనట్లు తెలుస్తోంది.
Publish Date:Apr 10, 2025
వివాదాస్పద దర్శకుడు రామగోపాల వర్మపై రాజమహేంద్రవరంలో ఒక ఫిర్యాదు నమోదైంది. ఆయన హిందువుల మనోభావాలను రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది మేడా శ్రీనివాస్ రాజమహేంద్రవరం మూడో టౌన్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
Publish Date:Apr 10, 2025
చత్తీస్ గడ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు చెలరేగిపోయారు. ప్రెషర్ బాంబు పేలిన వెంటన కూంబింగ్ చేస్తున్న పోలీసులు అలర్ట్ అయ్యారు. అయితే ప్రెషర్ బాంబు దాడికి ఒక జవానుకు తీవ్రగాయాలయ్యాయి.
Publish Date:Apr 10, 2025
విశ్వ క్రీడా సంబరం ఒలింపిక్స్ లో మళ్లీ క్రికెట్ సందడి చేయనుంది. దాదాపు 128 ఏళ్ల తరువాత క్రికెట్ కు మళ్లీ ఒలింపిక్స్ లో స్థానం లభించనుంది. ఒలింపిక్స్ లో చివరి సారిగా 1900లో క్రికెట్ ఆడారు.
Publish Date:Apr 10, 2025
2008 ముంబై ఉగ్రదాడి సూత్రదారి తహవూర్ రాణాను అమెరికా అప్పగించింది. ప్రత్యేక విమానంలో రాణా ఇండియాకు బయలు దేరారు. మరికొద్ది సేపట్లో రాణా భారత్ కు చేరుకునే అవకాశం ఉంది.
Publish Date:Apr 10, 2025
తెలుగుదేశం నుంచి చేబ్రోలు కిరణ్ సస్పెన్షన్
ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ పై తెలుగుదేశం పార్టీ వేటు వేసింది. అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
Publish Date:Apr 10, 2025
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధర్ నెడ్డిపై పొలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. తనపై నమోదైన కేసుల విచారణపై స్టే విధించాలని దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది.
Publish Date:Apr 10, 2025
అధికారంలోకి వస్తే పేద ప్రజలందరికీ ఇళ్లు కట్టిస్తాం.. ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు చేసే ప్రధాన వాగ్దానాలలో ఇదొకటి. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు అన్ని ఎన్నికల్లోనూ అన్ని రాజకీయ పార్టీలు ఇచ్చే హామీల్లో ఇంటి’ హామీ గ్యారెంటీ’గా ఉంటుంది. అయితే, పేర్లు మారుతూ ఉంటాయి. ఒకరు ఇందిరమ్మ ఇళ్లు, అంటే ఇంకొకరు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అంటారు.
Publish Date:Apr 10, 2025
ఎవరు చేసిన ఖర్మ వారనుభవింపకా తప్పదన్నా అన్నట్లు జగన్ హయాంలో అధికారం అండ చూసుకుని ఇష్టారీతిగా చెలరేగిన వైసీపీ నాయకులు ఇప్పుడు ఫలితం అనుభవించక తప్పడం లేదు. జగన్ అధికారంలో ఉన్నంత కాలం ఇష్టారీతిగా చెలరేగి.. ఎదురేలేదన్నట్లుగా రెచ్చిపోయిన మాజీ మంత్రి జోగి రమేష్ ఇప్పుడు వాటి ఫలితాన్ని అనుభవించక తప్పని పరిస్థితుల్లో పడ్డారు.