అఘోరీ ఆత్మార్పణం కథ సుఖాంతం అయినప్పటికీ ఆంధ్ర ప్రదేశ్ లో మళ్లీ అలజడి ప్రారంభమైంది. కేదార్ నాథ్ నుంచి తెలంగాణలో ఎంటర్ అయిన అఘోరీని గత నెల సిద్దిపేటలో పోలీసులు అదుపులోకి తీసుకుని అఘోరీస్వగృహమైన మంచిర్యాలకు తరలించారు. అక్కడ పోలీసులు కౌన్సిలింగ్ చేసి మహారాష్ట్ర సరిహద్దుల్లోని వాంకిడిలో వదిలేశారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి వద్ద ఈ నెల ఒకటోతేదీన ఆత్మార్పణం చేసుకుంటానని అఘోరీ ప్రకటించడంతో తెలంగాణ పోలీసులు అలెర్ట్ అయ్యారు. అఘోరీ గత కొన్ని రోజులుగా మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడంతో శాంతి భధ్రతల సమస్య వస్తుందని పోలీసులు ఊహించారు. ఇందులో భాగంగా హైద్రాబాద్ లో 144 సెక్షన్ తీసుకువచ్చినట్టు సీనియర్ పోలీసు ఉన్నతాధికారి తెలుగు వన్ తో అన్నారు. కెటీఆర్ అరెస్ట్ వార్తలు రావడంతో 144 సెక్షన్ అనివార్యమైందని ఆయన అన్నారు. దీపావళి తర్వాత పొలిటికల్ బాంబులు పేలతాయని మంత్రి శ్రీనివాసరెడ్డి సియోల్ పర్యటనలో ప్రకటన చేశారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం కుంభకోణం దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చిన నేపథ్యంలో కెసీఆర్, హరీష్ రావులు అరెస్ట్ అవుతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. బిఆర్ఎస్ నేతల అరెస్ట్ వల్ల హైద్రాబాద్ లో అల్లర్లు చెలరేగే అవకాశముందని ఇంటెలిజెన్స్, ఎస్ బి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో అఘోరీ ప్రస్తావనకూడా వచ్చింది. తెలంగాణలో గత కొంతకాలంగా మతకలహాలు జరగడం లేదు. అఘోరీ విద్వేష ప్రసంగాలపై కూడా రేవంత్ సర్కార్ మిన్నకుండిపోయింది. మళ్లీ మతకలహాల ముప్పు పొంచి ఉందని ప్రభుత్వానికి నివేదికలు అందాయి. హైద్రాబాద్ లో కేవలం మత కలహాల సమయంలో మాత్రమే విధించే 144 సెక్షన్ రేవంత్ సర్కార్ హాయంలో విధించడం చర్చనీయాంశమైంది. మరో వైపు ఈటెల నేతృత్వంలో బిజెపి నేతలు గవర్నర్ ను కల్సి హైద్రాబాద్ లో శాంతి భధ్రతల సమస్య తలెత్తే ప్రమాదముందని ఫిర్యాదు చేశారు. మతోన్మాదులు ముత్యాలమ్మ గుడిలోని అమ్మవారిని ధ్వంసం చేసినప్పటికీ పోలీసులు ఇంతవరకు ఏ ఒక్కరిని అరెస్ట్ చేయకపోవడం శోచనీయమన్నారు. ముత్యాలమ్మ గుడి వద్ద ఆందోళన చేస్తున్న హిందుత్వ వాదులపై పోలీసులు లాఠీ చార్జి చేయడాన్ని బిజెపి నేతలు తప్పు పట్టారు. ఈ నేపథ్యంలో వివాదాస్పద అఘోరీ ముత్యాలమ్మ గుడి ప్రాంగణంలో సుసైడ్ చేసుకుంటానని ప్రకటన చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సడెన్ గా అఘోరీ కేదార్ నాథ్ లో ప్రత్యక్షం కావడంతో అఘోరీ పారిపోయినట్లు వదంతులు వచ్చాయి. ఈ వదంతులను స్వయంగా అఘెరీ కొట్టివేశారు. తాను ముత్యాలమ్మ గుడి వద్ద ఆత్మార్పణం చేసుకుంటానని పెట్రోల్ బాటిళ్లతో సిద్దిపేటలో ప్రత్యక్ష కావడం పోలీసులకు చెమటలు పట్టాయి. అఘోరీపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేశారు. నగ్నంగా అఘోరీ తిరగడం, నెంబర్ ప్లేట్ లేకుండా అఘోరీ కారులో ప్రయాణించడాన్ని కూడా వారు తప్పు పట్టారు. అఘోరీకి మానసిక చికిత్స అవసరమని ఆ వర్గాలు పేర్కొన్నాయి. తనను తాను నియంత్రించుకోలేని అఘోరీ సనాతన ధర్మం పరిరక్షిస్తానని కొన్ని రోజులుగా ప్రకటనలు చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకోవడం మహాపాపం అని సనాతన ధర్మం చెబుతుంది. తనపై సోషల్ మీడియా దుష్ప్రచారం చేస్తుందని అఘోరీ పోలీసులకు ఫిర్యాదు చేయడాన్ని సంప్రదాయవాదులు తప్పు పడుతున్నారు. అఘోరీ జనారణ్యంలోకి రారని వారు అంటున్నారు. భారతీయ చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని అఘోరీ రోడ్డుకెక్కడం చర్చనీయాంశమైంది. యూట్యూబ్ చానెళ్లకు అఘోరీ వందల ఇంటర్వ్యూలు ఇవ్వడం వెనక మతలబు ఏమిటని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆపరేషన్ అఘోరీ చేపట్టిన పోలీసులు మహారాష్ట్ర సరిహద్దుల్లో వదిలేశారు. ఇప్పుడు ఎపి పోలీసులకు కూడా అఘోరీ తలనొప్పిగా మారారు. కర్నూలు జిల్లా ఆత్మకూరు టోల్ గేట్ సిబ్బంది అఘోరీని అడ్డుకోవడం వివాదాస్పదమైంది. తన శరీరాన్ని తాకే ప్రయత్నం జరిగిందని అఘోరీ అంటున్నారు. తెలంగాణ పోలీసులు అఘోరీని వదిలించుకున్నప్పటికీ ఆంధ్ర పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/in-telangana-39-187898.html
జీవన్ రెడ్డి, కేటీఆర్ లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ సూచన మేరకే సహచరులతో కలిసి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిం చేందుకు ఆయన నివాసానికి వచ్చినట్లు చెప్పారు. 2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేరాలని ఆహ్వానించారన్నారు.
ల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిపై ఎన్నికల అక్రమాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మిరాకిల్ సాఫ్ట్ వేర్ సంస్థ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేసి.. ఆ నగదును ఎన్నికల ఖర్చులకు మళ్లించారనే ఫిర్యాదు ఈసీకి చేరింది. దీనిపై సమగ్ర విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వేళ ఆ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఆమె పదవికి ముప్పు ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కడప జిల్లా నేతలలైన పుట్టా సుధాకర్, వరదరాజులు రెడ్డి, మాధవి రెడ్డిపై లోకేష్ ఫైరయ్యారు. ఈ నెల మొదటి వారంలో జరిగిన సమీక్షలో, నారా లోకేష్ కడప జిల్లా నేతలపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా ఫిర్యాదుల విన్నపం కార్యక్రమాలకు ఈ నేతలు హాజరుకాకపోవడంపై నిలదీసినట్లు చెబుతున్నారు.
రాజకీయాల్లో నిరంతరం ఉండే సవాళ్లు, మానసిక ఒత్తిడి కారణంగానే తాను దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డానన్న రోజా.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తనకు బ్లడ్ ప్రషర్ సమస్య వచ్చిందనీ, ఇక రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిని అయిన తరువాత డయాబెటిస్ అటాక్ అయ్యిందనీ వివరించారు.
కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
మావిగన్ ప్రతిపాదనతో జగన్ నెటిజనులకు ఒక ట్రోల్ మెటీరియల్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనపై లెక్కలేనన్న మీమ్స్, సెటైర్లు నెట్టింట వెల్లువెత్తాయి. అయినా కూడా జగన్ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా మావిగన్ ను మించిన రాజధాని ఉండనే ఉండదన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇదే మావిగన్ ను ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎందుకు ముందుకు తీసుకురాలేదన్న ప్రశ్నకు మాత్రం జగన్ సమాధానం ఇవ్వడం లేదు.
కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు, పుదుచ్చేరిలోని 30 స్థానాలకు రేపు ఒకేసారి ఓటింగ్ నిర్వహించనున్నారు. అలాగే అస్సాంలో 126 స్థానాలకూ కూడా ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. గతంలో బహుళ విడతల్లో ఎన్నికలు జరిగినప్పటికీ, ఈసారి మాత్రం ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు నేపథ్యంలో విజయవాడలోని లోకో పైలట్ల గాలా(సికింద్రాబాద్) డిపోను తరలించకుండా విజయవాడలోనే కొనసాగించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆ డిపో సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. విజయవాడ బోర్డును కొండపల్లి నుంచి మోటమర్రికి పెంచడం వల్ల గత 17 ఏళ్లుగా విజయవాడలో ఉన్న సికింద్రాబాద్(గాలా) డిపో ఉనికి సందిగ్ధంలో పడిందని, డిపోను మోటమర్రికి లేదా డోర్నకల్ కు తరలిస్తారనే ప్రచారంతో సుమారు 500 కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంది.
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కిద్వాయ్, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలిగా గుర్తింపు పొందారు. మోహ్సినా కిద్వాయ్ అంత్యక్రియలు ఢిల్లీలోని నిజాముద్దీన్ స్మశాన వాటికలో బుధవారం (ఏప్రిల్ 8) సాయంత్రం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
జగన్ చుట్టపుచూపుగా రాష్ట్రానికి వస్తున్నారు. అడపాదడపా పరామర్శలంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వినా మిగిలిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉనికి మాత్రంగానే మారింది. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలిచిన స్థానాలలో కూడా వెసీపీ స్తబ్దుగానే ఉంది. అయితే మచిలీపట్నంలో మాత్రం వైసీపీ హడావుడి ఒకింత ఎక్కువగా ఉంది.
ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలు ద్వారంపూడిపై చర్యల తీసుకోవాల్సిందే అని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి బండారాన్ని బట్టబయలు ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తున్నదని అంటున్నారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌లో ద్వారంపూడికి ఉన్న పట్టును సడలించడం ద్వారా ఆయన ప్రాభవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అంబటి రాంబాబును కొద్ది రోజుల కిందట గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే.. ఆ సమయంలో పోలీసు స్టేషన్‌లో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ అంబటి రాంబాబు తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.