వైఎస్ కు ఉండవల్లి సపోర్ట్
Publish Date:Jan 20, 2012
Advertisement
హైదరాబాద్: దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఏతప్పు చేయలేదని ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ స్పష్టం చేశారు. వైయస్ జగన్ ఏదైనా చేస్తే బాధ్యత తమది కాదని, జగన్ వేరే పార్టీలో ఉన్నారు కాబట్టి తాము బాధ్యత తీసుకోలేమని ఆయన అన్నారు. వైయస్ జగన్‌ను తాము రక్షిస్తున్నామని సందేహమా అని ఆయన మీడియా ప్రతినిధులను అడిగారు. జగన్‌ను రక్షించాల్సిన అవసరం తమకు లేదని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణించే వరకు తమ పార్టీలోనే ఉన్నారు కాబట్టి వైయస్ గురించి ఏమైనా వస్తే తాము మాట్లాడుతామని ఆయన అన్నారు. వైఎస్ నిజాయితీపై చర్చించడానికి తాను సిద్ధమని ఉండవల్లి సవాల్ విసిరారు. పరిటాల హత్య కేసులో జగన్ పాత్ర ఉందని చంద్రబాబు విమర్శిస్తే జగన్‌కు సంబంధం లేదని కిరణ్ కుమార్ రెడ్డి అప్పట్లో శాసనసభలో వాదించారని, ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే చంద్రబాబుకు జగన్ మద్దతిచ్చారని ఆయన అన్నారు. ఈ విషయాన్ని తమ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ స్పష్టంగా చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు.
http://www.teluguone.com/news/content/hyderabad-24-11072.html





