సైకో పోవాలి.. సైకిల్ రావాలి.. చంద్రబాబుకు మద్దతుగా కుప్పంలో జనం నినాదం

Publish Date:Jan 6, 2023

Advertisement

చంద్రబాబునాయుడు.. ఇప్పుడు ఆ పేరంటేనే అధికార వైసీపీలో వణుకు మొదలైంది. అయన ఎక్కడకు వెళితే అక్కడ జనం ప్రభంజనంలా పోటెత్తుతున్నారు. ప్రభుత్వంపై, జగన్ పై ఆయన చేసే విమర్శలకు హర్ష ధ్వానాలతో ఆమోదం తెలుపుతున్నారు. ఇదే అధికార వైసీపీ కాళ్ల కింద భూమి కదిలిపోయేలా చేస్తోంది. దీంతో ఆయనను అడ్డుకోవడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. ఆయన సభలు, సమావేశాలు నిర్వహించడానికీ, రోడ్ షోలు చేయడానికీ వీల్లేకుండా చీకటి జీవోలతో ఆంక్షలు విధించింది.

అయితే కుప్పం పర్యటన చంద్రబాబులోని పోరాట యోధుడిని మరో సారి లోకానికి చూపింది. సొంత నియోజకవర్గంలో అడుగడుగునా పోలీసులు అవరోధాలు కల్పిస్తుంటే.. తనను కలవడానికి వచ్చిన వాళ్లపై లాఠీచార్జి చేసి గాయపరుస్తుంటే.. చంద్రబాబు చండ్ర నిప్పులు చెరిగారు. పోలీసుల తీరును ఎండగట్టారు. సైకో పాలనలో బానిసలుగా మారారని పోలీసులపై జాలీ చూపారు. అయితే ఎక్కడా వెనక్కు తగ్గలేదు. ఏడు పదువ వయస్సులో గ్రామాలలో పాదయాత్ర చేశారు. ప్రచార వాహనాన్ని పోలీసులు దొంగిలించారని ఆరోపిస్తూ.. రోడ్డుపై పక్కన నిలిపి ఉన్న వాహనం టాప్ పైకి ఎక్కారు. వాన్ పక్కన నిట్ట నిలువుగా ఉన్ననిచ్చెనను అవలీలగా ఎక్కేసిన చంద్రబాబును చూస్తుంటే ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ అన్న మాట ఆయన విషయంలో అక్షర సత్యం అనిపించక మానదు.

వ్యాన్ పై నుంచే ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మొత్తం కుప్పం అంతా సైకో పోవాలి సైకిల్ రావాలి అన్న నినాదాలతో మార్మోగిపోయింది. కుప్పం పర్యటన మూడో రోజు చంద్రబాబు గుడిపల్లిలోని తెలుగుదేశం కార్యాలయంలోకి వెళుతుంటే పోలీసులు  అడ్డుకున్నారు. దీంతో ఆయన రోడ్డుపైనే బైఠాయించిన నిరసనకు దిగారు. ఎక్కడ మాట్లాడాలో చెప్పండంటూ పోలీసులను నిలదీశారు. దొంగల్లా తన ప్రచార రథాన్ని ఎత్తుకు పోయిన వారు పోలీసులు ఎలా ఔతారన్నారు.  ఓటమి భయంతోనే జగన్ నల్ల జీవోలతో విపక్షాలను అణచివేయాలని   యత్నిస్తున్నారని చంద్రబాబు  విమర్శించారు.

 ప్రజలు గమనిస్తున్నారని...  వాళ్లు తలచుకుంటే గుడ్డలు ఊడదీసి నిలబెడతారని హెచ్చరించారు. వైఎస్ వివేకా హత్య కేసులో జగన్ కు శిక్షపడటం ఖాయమని అన్నారు.  గొడ్డలి పోటుతో లేపేసి గుండెపోటు అని చెప్పింది ఎవరో అందరికీ తెలుసని చెప్పారు. తన ప్రచార రథాన్ని పోలీసులు దొంగిలించారనీ, అందుకే ఇక్కడ ఉన్న వ్యాన్ ఎక్కి ప్రసంగిస్తున్నానన్నారు.  

By
en-us Political News

  
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా  కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
 పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ  అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ  దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు.    ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.