నెగిటివ్  ఆలోచనలు ఇబ్బంది పెడుతున్నాయా? ఇలా బయటపడవచ్చు..!

Publish Date:Oct 18, 2025

Advertisement

 

నేటి బిజీ జీవితాల కారణంగా  చాలా మంది తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. చుట్టూ పరిస్థితులు,  ప్రపంచంలో జరుగుతున్న మార్పులు, కొత్త పుంతలు తొక్కుతున్న సంస్కృతి మొదలైనవన్నీ నేటి తరం  మనస్సుల్లో  నెగిటివ్ ఆలోచనలకు  కారణం అవుతున్నాయి. వీటి కారణాల వల్ల చాలా మంది మనసులు మరింత అపవిత్రంగా మారుతున్నాయి. ఈ ఆలోచనలు మనస్సులో బాగా పాతుకుపోయిన కొద్దీ జీవితంలో ప్రశాంతత, ఆనందం మాయమవుతాయి. ఈ ప్రతికూల ఆలోచనల నుండి తమను తాము  ఎలా బయటపడేసుకోవాలో తెలుసుకుంటే..

ప్రతికూల ఆలోచనలు వదిలించుకునే మార్గాలు..

ప్రతికూల ఆలోచనలు పోవడానికి దైవ సహాయం చాలా బాగా సహాయపడుతుంది. ప్రతికూల ఆలోచనలను వదిలించుకోవడానికి దైవ ప్రార్థనలు,  జపం, భజనలు మొదలైనవాటిని  అనుసరించవచ్చు. ఇది మనస్సును చాలా వరకు క్లియర్ చేయడంలో  సహాయపడుతుంది.  రోజూ ఇలా చేస్తే నెగిటివ్  ఆలోచనలు వాటికవే క్రమంగా  మాయమవుతాయి.

మనిషిని స్నేహం చాలా ప్రభావితం చేస్తుంది. చెడు సహవాసం  వ్యక్తి ఆలోచనలను,  మనస్సును ప్రభావితం చేస్తుంది. చెడు వ్యక్తుల స్నేహంలో, సాహచర్యంలో ఉంటే.. వారితో ఉండే వారి ఆలోచనలు కూడా చెడుగా మారతాయి.  నెగిటివ్ ఆలోచనలు సులభంగా పుట్టుకొస్తాయి.  అందుకే  మంచి వ్యక్తులతో సమయాన్ని గడపాలి. అది  మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది.

పుస్తక పఠనం  వల్ల  ఆలోచనలను సమతుల్యంగా ఉంచుకోవచ్చు.  మనస్సును పాజిటివ్ శక్తితో నింపుకోవడానికి, ఎల్లప్పుడూ గ్రంథాలను అధ్యయనం చేయాలి. ముఖ్యంగా ఆధ్యాత్మిక గ్రంథాలు, నైతిక విలువలు కలిగిన గ్రంథాలు,  గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు మొదలైనవి  చాలా సహాయపడతాయి.

ఆలోచనలను శుభ్రంగా ఉంచుకోవాలన్నా,  చెడు తలపుల   నుండి దూరంగా ఉండాలన్నా ప్రకృతితో సమయం గడపడం చాలా సహాయపడుతుంది. ఇది  మనస్సును ఎల్లప్పుడూ స్వచ్చంగా  ఉంచడంలో సహాయపడుతుంది.   మనస్సులో వచ్చే చెడు ఆలోచనలను కూడా వదిలించుకోవచ్చు.

దేవుని నామాన్ని జపించడం వల్ల నెగిటివ్  ఆలోచనలకు దూరంగా ఉండవచ్చు. దైవ నామ స్మరణ వల్ల సానుకూల ఆలోచనలు పెరుగుతూ,  నెగిటివ్ ఆలోచనలు మెల్లిగా తగ్గుతాయి.

                               *రూపశ్రీ.

By
en-us Political News

  
వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాలు , రెండు విభిన్న మనస్తత్వాల కలయిక కూడా.  పెళ్లి తర్వాత ప్రతి జంట తమ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది..
నేటి కాలంలో ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా జిమ్ వెళ్లేవారు తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు...
మీ జుట్టు మీ అందానికి ఒక కిరీటం వంటిది. కానీ నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, కాలుష్యం మరియు రసాయనాల వాడకం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటోంది. మీ జుట్టును ఒత్తుగా, పొడవుగా మరియు ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం...
ప్రేమించిన వారిని వదిలి వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నారా? మీ జీవితం మరియు మీ భాగస్వామి భవిష్యత్తు కోసం ఈ విషయాలు తప్పక తెలుసుకోండి...
ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆరోగ్య సమస్య హార్మోన్ల అసమతుల్యత (Hormonal Imbalance). మనం ఎంత ప్రయత్నించినా బరువు తగ్గకపోవడం, ఎప్పుడూ అలసటగా అనిపించడం, మానసిక ఒత్తిడి.. ఇవన్నీ మీ హార్మోన్లు పంపే సంకేతాలు కావచ్చు...
పుట్టిన తర్వాత పిల్లలు పెద్దగా అయినా.. వారు చదువులు పూర్తయ్యి,  పెళ్ళి చేసుకుని, వారు కూడా పిల్లలను కన్నా సరే.. తల్లిదండ్రులకు మాత్రం తమ పిల్లలు ఎంతవాళ్లైనా ఇంకా చిన్న పిల్లలు గానే అనిపిస్తూ ఉంటుంది...
జీవితంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ విజయం కొందరే సాధిస్తారు. దీనికి కారణాలు చాలా ఉంటాయి...
భారతీయుల ఇళ్లలో చాలా వరకు కరివేపాకు మొక్క పెంచుతూ ఉంటారు. ఇంటి బయట ఏ మాత్రం కాస్త స్థలం ఉన్నా సరే.. మొదటగా కరివేపాకు మొక్కనే పెంచుతూ ఉంటారు. కరివేపాకు మొక్క ఎదుగుదలకు కూడా భారతీయ...
వేసవి కాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో కూలర్ల దుమ్ము దులిపి వాడటానికి సిద్దం చేస్తుంటారు.  అయితే చాలా మంది ఇబ్బంది పడే సమస్య కూలర్ నుండి దుర్వాసన రావడం.  కూలర్ ను శుభ్రం చేసి వాడటానికి సిద్దం చేసినా సరే..
భారతీయుల ఆహారంలో బెల్లం ప్రధాన పదార్థం. తీపి పదార్థాల తయారీ నుండి కూరలలో కూడా రుచి కోసం బెల్లం వాడుతూ ఉంటారు.  అయితే వేసవి కాలంలో బెల్లం విషయంలో పెద్ద సమస్య ఎదురవుతుంది....
ఒక్కసారి ఆలోచించండి.. ఉదయం నిద్రలేవగానే మీరు చూసే మొదటి ముఖం ఎవరిది? మీ భాగస్వామిదా లేక మీ మొబైల్ ఫోన్ స్క్రీనా? ఒకప్పుడు పక్కపక్కనే కూర్చుని మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళం..
నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యలలో ‘ఫ్రోజెన్ షోల్డర్’ (Frozen Shoulder) ఒకటి. వైద్య పరిభాషలో ‘అడెసివ్ క్యాప్సులైటిస్’ అని పిలిచే ఈ సమస్య వల్ల భుజం కీలు బిగుసుకుపోయి
ప్రేమ ఒక అందమైన భావన, కానీ చాలా మందికి ఇది పదే పదే బాధ కలిగిస్తూ ఉంటుంది. ప్రేమ మొదట్లో అద్బుతంగా ఉంటుంది..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.