చిన్నతనంలోనే పిల్లలు సంస్కారవంతులు కావాలంటే. ఈ 5 అలవాట్లు నేర్పాలి..!
Publish Date:Dec 23, 2024
Advertisement
మీ పిల్లలను కృతజ్ఞత కలిగి ఉండేలా పెంచాలి. ఇది ఇతరుల మనసులలో పిల్లల పట్ల, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, గౌరవం రెండింటినీ పెంచే అలవాటు. కృతజ్ఞతలు తెలియజేయడం ద్వారా అవతలి వ్యక్తులు చాలా సాటిసిఫై అవుతారు. దీనివల్ల సంబంధాలు బాగుంటాయి. నలుగురు పిల్లల నడవడికను మెచ్చుకుంటారు. పిల్లలకు ఎవరైనా మంచి చేస్తే, చాక్లెట్, బొమ్మలు లేదా బహుమతి ఇచ్చినా, పిల్లలకు ఏదైనా సహాయం చేసినా వారు వెంటనే సహాయం చేసిన వ్యక్తికి థ్యాంక్యూ చెప్పేలా అలవాటు చేయాలి. దయ.. పిల్లలు చాలా అమాయక హృదయులు. పిల్లలలో ఉన్న ఈ అమాయకత్వాన్ని కాపాడుకోవాలి. దీనికోసం వారికి దయా గుణాన్ని అలవాటు చేయాలి. ఇది పిల్లలను చాలా సరళంగా ఉండేలా చేస్తుంది. పిల్లలకు దయతో కూడిన చిన్న పాఠాలు, నీతి కథలు, సంఘటనలు చెబుతూ ఉండాలి. జంతువులు, పక్షులపై దయ చూపడం వంటివి చేయాలి. చిన్న మొక్క నుండి పెద్ద జంతువులు, మనుషుల వరకు ప్రతి దాని పట్ల దయ కలిగి ఉండేలా అలవాటు చెయ్యాలి. ఈ ప్రపంచంలో చాలా వరకు ఏ విషయం పట్ల బుద్దిగా ఉండటం అనేది కనబడటం లేదు. మనస్ఫూర్తిగా ఉండటం, ప్రతి క్షణం అవగాహనతో ఉండటం చాలా మందికి తెలియదు. నిజానికి ఇలా అటెన్షన్ గా ఉండటం అనేది ఒక కళ అని అంటారు. ఈ కళ అందరికీ తెలియదు. పిల్లలు బుద్ధిపూర్వకంగా ఉండటానికి చాలా మార్గాలను నేర్పించవచ్చు. లోతైన శ్వాస తీసుకోవడం, ఎవరైనా మాట్లాడేటప్పుడు శ్రద్ధగా వినడం, కళ్ళు మూసుకుని కాసేపు చుట్టూ ఉన్న వాతావరణాన్ని అనుభూతి చెందడం వంటివి ఇందులో ఉన్నాయి. క్షమాపణ.. ప్రతి బిడ్డ మనసులో ప్రపంచం గురించి ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలను ఆధ్యాత్మికతతో అనుసంధానించాలి. ఉదాహరణకు, ఈ ప్రపంచం చాలా అందంగా ఉందని మీరు ఎందుకు అనుకుంటున్నారు అని పిల్లలను అడగండి? ప్రజలు ఒకరికొకరు సహాయం చేసుకుంటారని మీరు ఎందుకు అనుకుంటున్నారని పిల్లలను అడగండి? పిల్లలకు ఆధ్యాత్మికతకు సంబంధించిన కొత్త విషయాలను కూడా చెప్పాలి. తద్వారా వారు మరింత తెలుసుకునే అవకాశం లభిస్తుంది. *రూపశ్రీ.
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నవయస్సులోనే మంచి విలువలను అందించాలని, తమ పిల్లలు సంస్కార వంతులుగా ఉండాలని అనుకుంటారు. దీనికి తగినట్టుగానే తమ పిల్లలను బాగా పెంచి, ఎన్నో విషయాలు నేర్పాలని.. నలుగురు తమ పిల్లల ప్రవర్తన గురించి గొప్పగా చెప్పుకునేలా తమ పిల్లలను తీర్చిదిద్దాలనేది లక్ష్యంగా పెట్టుకుంటారు. ఇలా ఉండటం కోసం కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలకు మొదటి నుండి ధార్మిక విద్యను అందిస్తారు. తద్వారా వారి పిల్లలు తమ పెద్దలను గౌరవిస్తారు. నాగరిక జీవితం గడుపుతారు. కానీ ఇప్పటి కాలంలో పిల్లలకు విలువలు నేర్పడం సవాల్ తో కూడుకున్నది. చిన్న పిల్లలు కూడా పెద్ద మాటలు మాట్లాడతారు, ప్రశ్నిస్తారు, వ్యతిరేకిస్తారు. ముఖ్యంగా ఏదైనా ఒక మంచి విషయా్న్ని పిల్లలకు చెప్పాలని అనుకున్నప్పుడు ఎగతాళి చేయడం, చాదస్తంగా చూడటం ఇప్పటి తరం పిల్లల అలవాటు. అయితే చిన్నతనంలోనే సంస్కారవంతులు కావాలంటే కింద చెప్పుకునే 5 అలవాట్లు పిల్లలకు నేర్పాలి.
కృతజ్ఞత..
బుద్దిగా..
ఎనపైనా ఒర వ్యక్తి తప్పు చేశాడని తెలిసినా క్షమించడం అంత సులభం కాదు. కానీ మనస్సును ఒకసారి నియంత్రించుకుంటే, క్షమించడం అనేది చాలా సులభం. క్షమాపణ కళను పిల్లలకు నేర్పాలి. ప్రతీకారం తీర్చుకునే వ్యక్తి కంటే క్షమించేవాడు గొప్పవాడు. దయగల వ్యక్తులు మాత్రమే క్షమించగలరని పిల్లలకు చెప్పాలి.
ఆధ్యాత్మికత..
http://www.teluguone.com/news/content/how-do-i-make-children-cultured-since-childhood-35-190195.html





