పెగాసన్ పై సభా సంఘం మధ్యంతర నివేదిక.. పెగాసన్ ప్రస్తావన ఏదీ?

Publish Date:Sep 20, 2022

Advertisement

పెగాసన్ పై గత అసెబ్లీ సమావేశాలలో నియమించిన సభా సంఘం.. గత ప్రభుత్వం డేటా చోరీ చేసిందని  ప్రాథమికంగా నిర్ధారించింది. అయితే ఇది ప్రాథమిక నివేదికే అన్న భూమన నేతృత్వంలోని కమిటీ ఇంకా సేకరించాల్సిన సమాచారం ఎంతో ఉందని చెప్పింది.  ఇప్పుడు సభ ముందుంచినది మధ్యంతర నివేదిక మాతరమేనని భూమన కరుణాకరరెడ్డి సభకు తెలిపారు. ఇంతకీ పెగాసన్ సాఫ్ట్ వేర్ దుర్వినయోగంపై ఏర్పాటు చేసిన సభా సంఘం తన మధ్యంతర నివేదికలో ఆసలా విషయాన్నే ప్రస్తావించలేదు. గత   తెలుగుదేశం ప్రభుత్వం డేటా చెరీ చేసిందంటూ పాత పాటనే సభా సంఘం తన నివేదికలో వల్లె వేసింది. డేటా చోరీ పేరుతో  గతంలో వైసీపీ సర్కార్ పేట్టిన కేసులోని వివరాలనే ఇప్పుడు భూమన నేతృత్వంలోని సభా సంఘం మరోసారి వల్లె వేసింది. అయితే ఆ కేసు ఎప్పుడో వీగిపోయింది.  

పెగాసస్ సాఫ్ట్ వేర్ ఉపయోగించి వ్యక్తులపై నిఘా పెట్టారా లేదా అన్న అంశంపై తేల్చేందుకు నియమించిన హౌస్ కమిటీ  తన మధ్యంతర నివేదికలో పెగాసస్ అంశాన్ని కనీసం ప్రస్తావనగా కూడా తీసుకు రాలేదు.  స్టేట్ డేటా సెంటర్లో  ఉండాల్సిన సమాచారాన్ని తెలుగు దేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులకు నేరుగా ఆ సమాచారాన్ని చేరవేశారనీ,  తద్వారా వారికి  ప్రత్యేక లబ్ధి చేకూరిందనీ పాత పాటనే మరోసారి వినిపించింది.  ఓటర్ల జాబితా నుంచి 30 లక్షల మంది ఓట్లు తొలగించే ప్రయత్నం జరిగిందని పేర్కొంంది. గత ప్రభుత్వం సేవామిత్ర యాప్ ను ఇందు కోసం దుర్వినియోగం చేసిందని విమర్శించారు. ఈ డేటా తస్కరణకు పాల్పడిన వారిని పట్టుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే ఓట్ల తొలగింపు ఆరోపణలపై అప్పట్లోనే ఈసీ స్పందించింది.

ఎవరు పడితే వారు యాప్‌ల ద్వారా ఓట్లను తొలగిం సాధ్యం కాదని తేల్చేసింది.   అలాగే ఆధార్ నంబర్ తెలిసినంత మాత్రాన వ్యక్తిగత డేటా చోరీకి అవకాశం లేదని అప్పట్లో ఆధార్ స్పష్టం చేసింది. ఇప్పుడు భూమన నేతృత్వంలోని సభా సంఘం తన మధ్యంతర నివేదికలో.. పాచిపోయిన ఆ విషయాలనే కొత్తగా కనుగొన్నట్లు పొందుపరిచింది.  

రాష్ట్రంలో ఎన్నికల హీట్ ఆరంభమైన నేపథ్యంలో భూమన నేతృత్వంలోని సభా సంఘం మధ్యంతర నివేదిక అంటూ అరకొర సమాచారం అసెంబ్లీ ముందు ఉంచడం   ఆధారాలు బయట పెట్టకుండా   ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి చేకూర్చుకునేందుకేనని తెలుగుదేశం అంటోంది.  

By
en-us Political News

  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.