ఐటీ సిటీలో హర్రర్: బెంగళూరులో ఒకే రోజు ముగ్గురి హత్య!
Publish Date:Jun 30, 2026
Advertisement
ఇండియన్ సిలికాన్ వ్యాలీ , గ్లోబల్ ఐటీ హబ్, కర్ణాటక రాజధాని బెంగళూరులో ఒకే రోజు రాత్రి మూడు దారుణ హత్యలు జరగడం కలకలం రేపింది. లా అండ్ ఆర్డర్ కు సంబంధించి ఎటువంటి సమస్యా లేని, శాంతిభద్రతలకు నిలయంగా భావించే బెంగళూరు నగరంలో గంటల వ్యవధిలో మూడు వేర్వేరు చోట్ల ముగ్గురు హత్యకు గురి కావడం ఒక్కసారిగా ఐటీ నగరాన్ని వణికించేసింది. ఒకే రాత్రి ఇద్దరు మహిళలు, ఒక రౌడీషీటర్ దారుణ హత్యకు గురి కావడంతో బెంగళూరులో భద్రతపై టెక్కీలలోనే కాకుండా స్థానికులలో కూడా ఆందోళన వ్యక్తం అవుతోంది. వివరాలు ఇలా ఉన్నాయి.. బెంగళూరులో మోస్ట్ వాంటెడ్ రౌడీ షీటర్‌గా పేరుమోసిన హల్మక్ రాజా ను ప్రత్యర్థి ముఠా నడిరోడ్డుపై నడిరోడ్డుపై నరికి చంపారు. అదే రాత్రి రెండు వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. ఇరువురూ వేర్వేరు ప్రదేశాలలో వేర్వేరు ఇళ్లళ్లో ఒంటరిగా ఉన్న మహిళలే కావడం గమనార్హం. ఒకే రాత్రి ఇలా వేర్వేరు ప్రాంతాలలో ఇద్దరు మహిళలు అమానుషంగా హత్యకు గురికావడం నగరంలోని మహిళల రక్షణను ప్రశ్నార్థకంగా మార్చింది. ఈ మహిళల హత్యల వెనుక ఉన్నది ఎవరు, అసలు హంతకులకు వీరితో ఉన్న విరోధం ఏంటి, లేదా ఇది దోపిడీ దొంగల పనా అనే కోణంలో పోలీసులకు ఇంకా ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లభించలేదు. నిందితులు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టబోమని, త్వరలోనే ముగ్గురు హంతక ముఠాలను కటకటాల్లోకి నెడతామని పోలీసులు తెలిపారు.
http://www.teluguone.com/news/content/horror-in-the-it-city-36-224575.html





