Publish Date:Jun 25, 2022
పూర్వ కాలంలో శత్రు రాజ్యాల రహస్యాలు తెలుసుకునేందుకు వేగులు..(మనం గూఢ చారులు అని ఇప్పుడు అంటున్నాం) శత్రు రాజ్యాల్లోకి ప్రవేశించి అక్కడ ఎవరినో ఒకరిని మచ్చిక చేసుకునే వారట. వారి ద్వారా రాజ్యంలో సమస్యలు, లోతుపాతులు, లోగుట్టు తెలుసుకుని దానికి తమ రాజుకు చేరవేశేవారని చెబుతుంటారు. ఆ తరువాతి కాలంలో శత్రు దేశాల రహస్యాలను తెలుసుకునేందుకు గూఢ చారులను వినియోగించేవారు.
జేమ్స్ బాండ్, గూఢచారి 116 వంటి సినిమాలు కూడా ఈ గూఢచర్యం కథాంశంతో కూడిన సినిమాలే. ఇప్పుడు వేగులు ఇటువంటి వేగులు, గూఢచారులతో పని లేకుండా కొన్ని దేశాలు ఇతర దేశాల నుంచి తమకు కావలసిన రహస్యాలు చులాగ్గా సంపాదించేస్తున్నారు. అందుకు వారు ఉపయోగిస్తున్నది ‘హనీ ట్రాప్’ ఇప్పుడు దేశ రక్షణ రహస్యాలకు ‘హనీ’ ట్రాప్ ముంపు పొంచి ఉందని పరిశీలకులు అంటున్నారు. ఇంతకీ ఈ హనీ ట్రాప్ అంటే ఏమిటంటే.. అత్యంత కీలకమైన రహస్యాలను రాబట్టేందుకు అమ్మాయిల వలపు వలను ప్రయోగించడం. దేశ క్షిపణి అభివృద్ధి రహస్యాలను తెలుసుకునేందుకు ఒక ఇంజనీర్ పై పాక్ హనీట్రాప్ ను ప్రయోగించింది. దీంతో ఆ ఇంజనీర్ రెండేళ్ల పాటు అంటే 2019 నుంచి 2011 వరకూ క్షిపణులకు సంబంధించి కీలక సమాచారాన్ని శత్రుదేశానికి చేరవేసినట్లు తేలింది. ఆ ఇంజనీర్ ను హనీట్రాప్ లో చిక్కుకునే టట్లు చేయడానికి సామాజిక మాధ్యమాన్నే శత్రుదేశం మాధ్యమంగా ఎన్నుకుంది. సామాజిక మాధ్యమంద్వారా పరిచయమైన యువతి వలపు వలలో పడిన ఇంజినీర్ అత్యంక కీలకమైన రహస్యాలను, కొన్ని చిత్రాలను, పత్రాలను కూడా ఆమెకు అందజేశాడు. డీఆర్ డీఏలో పని చేసే ఇతరులెవరూ ఇతడి చౌర్యాన్ని గుర్తించలేకపోవడమే ఆశ్చర్యమని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. పాక్ రహస్య గూఢచార సంస్థ (ఐఎస్‌ఐ) తరఫున మన దేశంలో చాలా మంది ఏజెంట్లుగా, స్లీపర్ సెల్స్‌గా పని చేస్తున్నారు. బయటపడిన కేసులు కొన్ని మాత్రమే. వెలుగులోనికి రాని ఇటువంటి వి చాలా ఉన్నాయన్నది నిఘావర్గాల అనుమానం.
గత సంవత్సరం జూలైలో బికనీర్ కి చెందిన హబీబూర్ రెహమాన్ అనే పాక్ గూఢచారిని అరెస్టు చేశారు. పోఖ్రాన్‌లోని ఆర్మీ బేస్ క్యాంపు నుంచి అతడు రహస్య సమాచారాన్ని పాకిస్తాన్‌కి చేరవేసినట్టు పోలీసులు గుర్తించారు. పాక్ గూఢచారులకు అతడు కొన్ని మ్యాపులను, కోడ్ సమాచారాన్నికూడా అందిం చినట్టు దర్యాప్తులోతేలింది.అతడికి పంకజ్ కౌర్ అనే కానిస్టేబుల్ ఈ సమాచారాన్ని అందజేసినట్టు తెలియ వచ్చింది.
ఆగ్రా కంటోన్మెంట్‌లో పని చేస్తున్న కౌర్‌నికూడా అరెస్టు చేశారు.రెహమాన్ బంధువులు పాక్‌లోని సింధ్‌లో నివసిస్తున్నారనీ, వారిని కలుసు కోవడానికి అతడు తరచూ వెళ్తుంటాడనీ,ఆర్మీ బేస్ క్యాం ప్‌కి కూరగాయలు సరఫరా చేసే హబీబూర్ రెహమాన్ కౌర్ ద్వారా సమాచారాన్ని సేకరించి సింధ్ వెళ్ళినప్పుడు ఐఎస్‌ఐ అధికారులకు అందజేసేవాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/honey-trap-threat-to-defence-secreats-39-138425.html
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.