Publish Date:Apr 29, 2025
మెట్రోస్టేషన్లు, రైళ్లలో బెట్టింగ్ యాప్‌ల ప్రకటనపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. నిషేధిత బెట్టింగ్ యాప్‌లపై మెట్రో రైళ్లలో ప్రకటనపై పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ విచారణకు హైదరాబాద్ మెట్రో రైలు తరుపున ఏజీ సుదర్శన్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్ యాప్‌ల ప్రకటనలు ఇప్పుడు వేయడంలేదన్న ఏజీ పేర్కొన్నారు. మెమో దాఖలు చేసినట్లు తెలిపిన ఏజీ సుదర్శన్ రెడ్డి తెలిపారు. తదుపరి విచారణ హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది. మెట్రో ట్రైన్లలో నిషేధిత బెట్టింగ్ యాప్ ప్రకటనలపై హైకోర్టులో పిల్ దాఖలైంది.
న్యాయవాది నాగూర్ బాబు ఈ పిల్‌ను వేశారు. అనంతరం న్యాయస్థానంలో ఆయన తన వాదనలు వినిపించారు. ‘బెట్టింగ్ యాప్‌లను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించినప్పటికీ మెట్రో రైళ్లలో మాత్రం ప్రకటనలు ఇస్తున్నారు. కొన్ని బెట్టింగ్ యాప్‌లపై ఇప్పటికే ఈడీ విచారణ కొనసాగుతోంది. మెట్రో రైళ్లలో ఈ అడ్వర్టైజ్‌మెంట్స్‌పై దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది' అని పేర్కొన్నారు. మెట్రో రైళ్లలో 2022 తర్వాత బెట్టింగ్ యాప్‌లకు సంబంధించిన ప్రకటనలను ప్రదర్శించలేదని హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ తరఫు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/hmrl-25-197177.html
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం రవాణా కాంట్రాక్టుల కుంభకోణం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
20 వార్డుల్లో 17 స్థానాలు గెలుపు.!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో పెను తుపాను ముప్పును ఎదుర్కొంటోంది.
కడప పులివెందుల మున్సిపాలిటీ ఛైర్పర్సన్ ఎన్నికల కౌంటింగ్‌లో తెలుగుదేశం పార్టీ విజయపథంలో దూసుకుపోతోంది
ఆ పసివాడికి చట్టాలు తెలియవు.. నిబంధనలు అసలే తెలియవు. తెలిసిందల్లా అమ్మానాన్నల ప్రేమ మాత్రమే!
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.