హిండెన్‌బర్గ్ క‌థేంటి... అసలు ఏం జ‌రిగింది?

Publish Date:Jan 16, 2025

Advertisement

ఏ సంస్థ అయినా ఇక చాలు కావలసినంత సంపాదించేశాం అనుకుంటుందా? ఇంత సంపాదించేశాను, ఇక కంపెనీని మూసేస్థానని ఏ వ్యాపారవేత్తైనా చెబుతారా? అన్న ప్రశ్నకు అమెరికాకు చెందిన ఇన్వెస్ట్ మెంట్ రీసెర్చ్ కంపెనీ హిండెన్‌బర్గ్ వ్యవస్థాపకుడు నాథన్ అండర్సన్  తాను అలాగే చెబుతాను, అదే చేస్తాను అంటున్నారు. ఆ కారణంగానే తాను హిండెన్‌బర్గ్ ను మూసేయాలని నిర్ణయించానని చెబుతున్నారు. అయితే హిండెన్‌బర్గ్ మూత ప్రకటన మార్కెట్ వర్గాల్లో సంచలనం సృష్టించింది. నాథన్ అండర్సన్  మూసివేత ప్రకటనపై పరిశ్రమ వర్గాల స్పందన మిశ్రమంగా ఉంది. హిండెన్‌బర్గ్ మూతపడకపోతే మునిగిపోతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 

అమెరికాకు చెందిన ఇన్వెస్ట్ మెంట్ రీసెర్చ్ కంపెనీహిండెన్‌బర్గ్ పేరు వినగానే ఎవరికైనా ఠక్కున గుర్తొచ్చే పేరు అదానీ. హిండెన్‌బర్గ్ నివేదికల కారణంగా అదానీ సంస్థ భారీగా నష్టపోయింది.  అదానీ గ్రూప్  మనీలాండరింగ్, సెక్యూరిటీ ఫోర్జరీ వంటి నేరాలకు పాల్పడిందంటూ 2023లో హిండెన్‌బర్గ్ నివేదిక వెలువరించింది. ఆ దెబ్బకు అదానీ మార్కెట్ విలువ భారీగా పతనమైంది. ఆ ఏడాది అదానీ సంపద దాదాపు లక్ష కోట్లు ఆవిరైంది. ఆ తరువాత మళ్లీ కోలుకుందనుకోండి అది వేరే సంగతి. ఇక్కడ చెప్పుకోవలసిందేమిటంటే హిండెన్‌బర్గ్ ఫేమస్ అయ్యింది మాత్రం అదానీ గ్రూపు అవకతవకలపై విడుదల చేసిన నివేదిక ద్వారానే. 

అప్పట్లోనే హిండెన్‌బర్గ్ అదానీ గ్రూపు లక్ష్యంగా వెలువరించిన నివేదిక వెనుక ఏదో మతలబు ఉందన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి.  ఇప్పుడు ఉరుములేని పిడుగులా హిండెన్‌బర్గ్ మూసివేత ప్రకటన ఆ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. హిండెన్‌బర్గ్ షార్ట్ సెల్లింగ్ వ్యూహాలతో లాభాలను ఆర్జిస్తుంది. అందులో బాగంగానే ఇప్పటి వరకూ అదానీ సహా 36 కంపెనీలపై తన రీసెర్చ్ డాక్యుమెంట్లను విడుదల చేసింది. ఆ గ్రూప్ ప్రతికూల నివేదికలే విడుదల చేసింది. ఆ నివేదికల కారణంగా ఆయా కంపెనీల మార్కెట్ విలువ భారీగా పతనమయ్యాయి.  సందట్లో సమేమియా అన్నట్లుగా హిండెన్‌బర్గ్ సంపాదన పెంచుకుంది.

అయితే షార్ట్ సెల్లర్లు  ఎన్నడూ స్థిరమైన లాభాలను ఆర్జించలేరు. దీర్ఘ కాలంలో వాటికి రాబడి ఉండదు. అన్నిటికీ మించి ఇలాంటి షార్ట్ సెల్లింగ్ సంస్థలు గ్రే జోన్ లో పని చేస్తుంటాయి. ఒక కంపెనీని టార్గెట్ చేసుకుని పని చేస్తుంటాయి. అన్నిటికీ మించి వాటిపై నిఘా నియంత్రణ సంస్థల గురి ఉంటుంది. విచారణలు ఎదుర్కొనాల్సి ఉంటుంది. తప్పుడు మార్గాల ద్వారా అసంబద్ధ నివేదికలు వెలువరించినట్లు రుజువైతే భారీ జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లోనే హిండెన్‌బర్గ్ మధ్యే మార్గంగా మూసివేత ఒప్పందానికి వచ్చి ఉంటుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

ఇక అన్నిటికంటే ప్రధానంగా  ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టనుండటమే హిండెన్‌బర్గ్ మూతకు కారణం. ఎందుకంటే అదానీ గ్రూప్ సంస్థలపై హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలు, అభియోగాలకు సంబంధించి పూర్తి వివరాలు, డాక్యుమెంట్లు సిద్ధం చేయాలని అధ్యక్ష పగ్గాలు చేపట్టకముందే ట్రంప్ ఆదేశాలు ఇచ్చారు. ఆయన ఆదేశాల మేరకు ఇప్పటికే న్యాయశాఖ పని ప్రారంభించింది. దీంతో హిండెన్‌బర్గ్ తన నివేదికల హేతుబద్ధతను నిరూపించుకోవాల్సి ఉంటుంది. లేదా బోనులో నిలబడాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో నాథన్ అండర్సన్  సంస్థ మూసివేత ప్రకటన   పలు అనుమానాలకు తావిస్తోంది.  షార్ట్ సెల్లింగ్ వ్యాపారంలో లాభార్జన కోసమే ఉద్దేశపూర్వకంగా కంపెనీల అవకతవకలపై నివేదికలు వెలువరిస్తుంటుందన్న ఆరోపణలు హిండెన్‌బర్గ్ పై ఉన్నాయి. ఒక్క అదానీ గ్రూపే కాకుండా హిండెన్‌బర్గ్ ఇప్పటి వరకూ దాదాపు 36 కంపెనీల్లో జ‌రుగుతున్న మోసాల‌ను బ‌య‌ట పెట్టింది. ఆ నివేదికల కారణంగా అయా కంపెనీల మార్కెట్ విలువలు భారీగా పతనమయ్యాయి.  

ఇక మరో కథనం ఏమిటంటే హిండెన్‌బర్గ్ ఒక పావు మాత్రమేనని  అదానీపై నివేదిక తరువాత భారత పార్లమెంటు వేదికగా  అధికార ప్రతిపక్ష పార్టీలు ఆదానీకి మద్దతుగా, వ్యతిరేకంగా మోహరించడమే ఇందుకు తార్కానమని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. హిండెన్‌బర్గ్ వెనుక ఒక కమ్యూనిస్ట్ నాయకుడి సతీమణి, జర్నలిస్ట్, నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఇండియా పేరున నడిచే ఒక స్వస్చంద సంస్థ, వామపక్ష భావజాలాన్ని ప్రచారం చేసే ఒక వెబ్‌సైట్ ఉన్నాయనీ, వీటన్నింటికీ అజీమ్ ప్రేమ్‌జీ నడిపే స్వచ్చంద సంస్థ ఐపీఎస్ఎంఎఫ్ నిధులు సమకూరుస్తుందని  ఆర్ఎస్ఎస్ అధికార పత్రికఆర్గనైజర్‌ కథనం  పేర్కొంది. ఇన్ని రకాలుగా హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికలపై అనుమానాలు ముప్పిరిగొన్న వేళ ఆ సంస్థ మూసివేత ప్రకటన సంచలనం సృష్టించింది.  హిండెన్‌బర్గ్ మూసివేత ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే   అదానీ పవర్ షేర్లు 9 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ టోటల్ గ్యాస్ షేర్లు 7శాతం మేర పెరగడం కొసమెరుపు.

By
en-us Political News

  
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అంబటి రాంబాబును కొద్ది రోజుల కిందట గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే.. ఆ సమయంలో పోలీసు స్టేషన్‌లో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ అంబటి రాంబాబు తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్ రెడ్డి, నరేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ వంటి నేతలను అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆవేదనను వినాల్సింది పోయి, వారికి మద్దతుగా వస్తున్న విపక్ష నేతలపై ఆంక్షలు విధించడం దారుణమన్నారు.
రిలే దీక్షకు మద్దతుగా గ్రామానికి చేరుకోవాలని ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలు, కార్య కర్తలను పోలీసులు మార్గ మధ్యలోనే నిలిపివేస్తూ వెనక్కి పంపించేశారు. దీంతో పరిగి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చారిత్రాత్మక విజయం సిద్ధించిన రోజిదని పేర్కొన్నారు. అమరావతి రైతుల త్యాగాలకు దక్కిన న్యాయమన్నారు. అమరావతి ఇప్పుడు కేవలం నగరం కాదు, మన ఆత్మగౌరవానికి ప్రతీక అని బాలకృష్ణ పేర్కొన్నారు.
జములమడుగులో ఊహించిన దానికంటే అత్యధికంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని వివరించారు. వైసిపి అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి వైఖరిని తూర్పారబట్టారు.. ప్రజలను కన్ఫ్యూజ్ చేసి మేలు పొందాలని ప్రయత్నిస్తున్నారంటూ జగన్ పై విమర్శలు కురిపించారు. పకృతిలో పంచభూతాల కూడా తన అధీనంలోనే ఉన్నాయని చెప్పుకునే పెను భూతంగా ఆయన జగన్ రెడ్డిని అబివర్ణించారు.
ఈ కీలక పరిణామం నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ఐదు కోట్ల ఆంధ్రుల చిరకాల కోరిక నేడు నెరవేరిందని పేర్కొన్నారు. అమరావతి చట్టానికి ఆమోదం తెలిపి రాష్ట్ర భవిష్యత్తుకు భరోసానిచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రజల తరఫున ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ చట్ట సవరణకు ఆమోదముద్ర వేయడంతో, కేంద్ర న్యాయశాఖ తుది నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ పరిణామంతో అమరావతికి పూర్తిస్థాయిలో చట్టబద్ధత లభించినట్లయింది.
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.
రాజకీయం అంటే కేవలం అధికారంలో ఉండటం మాత్రమే కాదని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని వైసీపీకి హితవు పలుకుతున్నట్లుగా మాట్లాడుతూనే.. ఆ పార్టీకి కర్తవ్యబోధ చేశారు.
బిజెపికి 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్‌తో పునాదులు పడ్డాయి. అక్క‌డి నుంచి ఈ పార్టీ అంచ‌లంచ‌లుగా ఎదిగి నేడీ స్థితికి చేరుకుంది. గ‌తంలో వాజ్ పేయి ఈ పార్టీకి అధికార వాస‌న రుచి చూప‌డంతో.. ఇప్పుడు వ‌రుస‌గా మూడు ప‌ర్యాయాల పాటు అధికారం చేజిక్కించుకుని.. ప్ర‌స్తుతం అప్ర‌తిహాత జైత్ర యాత్ర చేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.