Publish Date:Apr 28, 2025
రాజస్థాన్ రాయల్స్ అద్భుతం చేసింది. 209 పరుగులను ఇంకా 4.1 ఓవర్లు ఉండగానే ఛేదించింది. వరుస పరాజయాలతో కునారిల్లి ఉన్న జట్టు ఇంత వరకూ ఛేదనలో తడబడుతూ వచ్చింది. అయితే సోమవారం గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం కొండంత లక్ష్యాన్ని ఉఫ్ మని ఊదేశింది.
Publish Date:Apr 28, 2025
విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి కూటమి అభ్యర్థిగా బీజేపీకి చెందిన సీనియర్ నేత పాక వెంకటసత్యనారాయణ ఖరారయ్యారు. ఈ విషయాన్ని బీజేపీ సోమవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించింది.
Publish Date:Apr 28, 2025
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిమ్ వర్కౌట్ చేస్తుండగా గాయపడ్డారు. దీంతో ఆయన కొద్ది రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సలహా ఇచ్చారు. ఈ విషయాన్ని కేటీఆర్ స్వయంగా ఎక్స్ వేదికగా అభిమానులకు, బీఆర్‌ఎస్ శ్రేయోభిలాషులకు తెలియజేశారు. అంతేగాక త్వరలోనే తన పాదాలపై తాను నడుచుకుంటూ వస్తానని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ ట్విట్టర్ లో.. జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా వెన్నుపూసలో సమస్య తలెత్తిందని తెలిపారు
Publish Date:Apr 28, 2025
నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకున్న సందర్బంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.‘‘గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకున్న ప్రముఖ సినీనటులు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు నా అభినందనలు. కళా, సేవా, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్న బాలయ్య మరిన్ని నూతన శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
Publish Date:Apr 28, 2025
ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి అభ్యర్థి ఖరారయ్యారు. భీమవరం బీజెపి క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ పాక వెంకట సత్యనారాయణ పేరును కమలం పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. రేపు ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. పాక గతంలో భీమవరం కౌన్సిలర్ గా పని చేశారు. ప్రస్తుతం పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ గా ఉన్నారు. ఈ స్థానం నుంచి అన్నామలై, స్మృతి ఇరానీ, మందకృష్ణ మాదిగ పోటీ చేస్తారని ప్రచారం జరిగినా అనూహ్యంగా పాక పేరును ప్రకటించారు.
Publish Date:Apr 28, 2025
టాలీవుడ్ ప్రముఖ హీరో హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన పౌర పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ సంప్రదాయ తెలుగు వస్త్రధారణ అయిన పంచెకట్టులో హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమానికి బాలయ్య పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. భారతీయ సినిమా రంగానికి, సమాజానికి బాలకృష్ణ అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఈ పద్మ భూషణ్ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే.
Publish Date:Apr 28, 2025
ఏపీలోని 10 జిల్లాల సహకార బ్యాంకు సంఘాల చైర్మన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియమించారు. జిల్లా సహకార మార్కెటింగ్ సంఘాల (డీసీఎంఎస్) ఛైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాకుళం డీసీసీబీ ఛైర్మన్‌గా శివ్వల సూర్యనారాయణ (టీడీపీ), విశాఖ డీసీసీబీ ఛైర్మన్‌గా కోన తాతారావు (జనసేన) నియమితులయ్యారు. విజయనగరం డీసీసీబీ చైర్మన్‌గా టీడీపీ నేత కమిడి నాగార్జునను నియమించారు. గుంటూరు డీసీసీబీ చైర్మన్‌గా మాకినేని మల్లికార్జునరావు(టీడీపీ), కృష్ణా డీసీసీబీ చైర్మన్‌గా టీడీపీ నేత నెట్టెం రఘురామ్, నెల్లూరు డీసీసీబీ చైర్మన్‌గా ధనుంజయరెడ్డి (టీడీపీ), చిత్తూరు డీసీసీబీ చైర్మన్‌గా తెలుగుదేశం పార్టీ నేత అమాస రాజశేఖర్ రెడ్డిని నియమించారు.
Publish Date:Apr 28, 2025
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై పాకాల మండలం తోటపల్లి వద్ద కంటైనర్ కిందకు కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Publish Date:Apr 28, 2025
దేశంలో పేదరికం ఏ స్థాయిలో వుందో, ఆకలి స్థాయి ఏమిటో, కటిక దారిద్ర్యంలో మగ్గుతున్న పేదలకు తెలిసినంతగా మరొకరికి తెలియదు. కానీ ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక మాత్రం భారత దేశంలో పేదరికం రోజురోజుకూ తగ్గిపోతోందని అంటోంది. ఆర్థిక పేదరికం మాత్రమే కాకుండా, విద్య, ఆరోగ్యం జీవన ప్రమాణాలతో ముడిపడి ఉన్న వివిధ కోణాల పేదరికంలో కుడా కూడా భారత దేశం మంచి మెరుగుదల సాధించిందని నివేదిక పేర్కొంది.
Publish Date:Apr 28, 2025
తెలంగాణ గ్రూప్-1 నియామకాలపై ఇటీవల హైకోర్టు సింగిల్ ఇచ్చిన మధ్యంతరం ఉత్తర్వులను సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ అప్పీల్ పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు సీజే ధర్మాసనం రేపు విచారణ చేపట్టనుంది. గ్రూపు-1 పరీక్షలో అక్రమాలు జరిగాయని హైకోర్టుపలు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. మెయిన్స్ ఎగ్జామ్ మూల్యాంకనం సరిగ్గా జరుగలేదని, పరీక్షల కేంద్రాల కేటాయింపుల్లోనూ నిబంధనలు పాటించలేదని పిటిషనర్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
Publish Date:Apr 28, 2025
తెలంగాణ ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆమెను డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ) వైస్ ఛైర్‌పర్సన్‌గా నియమిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా, ఆమెకు ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్ జనరల్ (డీజీ)గా అదనపు బాధ్యతలు కూడా అప్పగించింది.
Publish Date:Apr 28, 2025
పహల్గాం ఉగ్ర దాడి నేపధ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలను పక్కన పెట్టి ఒక్కటయ్యాయి. ఐక్యతను ప్రదర్శించాయి. ఉగ్రదాడిని ముక్త కంఠంతో ఖండించాయి. మాలో మాకు సవాలక్ష విబేధాలు ఉండవచ్చును కానీ.. మా దేశం పై మరో దేశం ఏ రూపంలో దాడి చేసినా, రాజకీయాలను పక్కన పెట్టి ఒక్కటై నిలుస్తామని శతృ మూకకు స్పష్టమైన హెచ్చరిక చేశాయి. దేశం గర్వించేలా అధికార, ప్రతిపక్ష నాయకులు, చేతులు కలిపి సయోధ్య ప్రదర్శించారు.
Publish Date:Apr 28, 2025
హైదరాబాద్‌లో కేవలం 14 నెలల్లోనే హైటెక్ సిటీని నిర్మించానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అమరావతిలోని విట్ విశ్వవిద్యాలయంలో నేడు జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు తమ ప్రతిభతో ఉన్నత స్థానాల్లో ఉంటున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా విట్ ఏపీ క్యాంపస్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం, నూతన స్టార్టప్ ఆలోచనలకు ఊతమిచ్చేందుకు ఏర్పాటు చేసిన విలాంచ్ ప్యాడ్ 2025 ఇంక్యుబేషన్ సెంటర్‌ను లాంఛనంగా ఆవిష్కరించారు.