తెలుగు రాష్ట్రాలకు తొలగని వరుణ గండం

Publish Date:Jul 22, 2023

Advertisement

తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. పలు గ్రామాల్లో లో లెవల్‌ వంతెనలపై వరదనీరు పొంగి పోర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నదులన్నీ ఉప్పొంగుతున్నాయి. ముఖ్యంగా ప్రాజెక్టుల్లోకి ఎగువ నుంచి పెద్దమొత్తంలో వరద పొటెత్తుతున్న కారణంగా ఆ ప్రాజెక్టుల పరిస్థితి టెన్షన్‌గా మారుతోంది. అయితే గోదావరి నది మాత్రం కాస్త తగ్గుముఖం పట్టింది. ఇంతలోనే మళ్లీ వర్ష సూచన. కాగా.. ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు కారణం క్యుములోనింబస్ మేఘాలు. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో పాటు చాలా ఫాస్ట్‌గా కదులుతూ ఉంటాయి. వీటి వల్ల ఇంకో ఇబ్బంది ఏంటంటే.. ఉరుములు, మెరుపులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. పిడుగు పాటుకు అవకాశం ఎక్కువ. దీంతో అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.

ఇప్పటికే తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ క్రమంలోనే భారత వాతావరణ విభాగం  మరో పిడుగులాంటి వార్తను అందించింది. తెలుగు రాష్ట్రాలకు హై అలెర్ట్ ప్రకటించింది. నేడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. ఈ నెల 24న మరో అల్ప పీడనం పొంచి ఉందని తెలిపింది. రాబోయే ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

వర్షాలకు సంబంధించి వాతావరణ శాఖ జారీ చేసిన అలెర్ట్ లకు సంబంధించి అవగాహనా చాలామందికి ఉండదు. 
ప్రస్తుతానికి ఆరెంజ్, రెడ్, యెల్లో, గ్రీన్ అలర్ట్ లను వాతావరణ శాఖ జారీ చేస్తోంది. ఈ అలర్ట్ లను 1875వ సంవత్సరంలో బ్రిటీష్ పాలకులు తొలుత  జారీ చేశారు.ఇలాంటి  సూచనలు బట్టే ప్రజలు అప్రమత్తమవుతారు. 


 ఎల్లో అలర్ట్ అంటే...
ఈ రంగు వాతావరణాన్ని 'చూడండి' అని చెబుతుంది మరియు నిర్వాహకులను 'అప్‌డేట్ అవ్వండి' అని పిలుస్తుంది. ఇది వాతావరణ మార్పులతో ముడిపడి ఉంది, ఇది ప్రస్తుతం తక్కువ హానిని కలిగిస్తుంది కానీ ప్రభావం కలిగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఉరుములు, భారీ వర్షాలు, బలమైన గాలులు, వేడి లేదా శీతల అలలు, మరియు సముద్రపు  విపత్కర పరిస్థితులు వంటి అంశాలు హెచ్చరికకు దారితీస్తాయి.

ఆరెంజ్ అలెర్ట్ 
ఇది చాలా భారీ వర్షపాతం, తీవ్రమైన వేడి లేదా చలిగాలులు లేదా ప్రభావవంతమైన తుఫాను వచ్చినప్పుడు ఇటువంటి హెచ్చరికలు జారీ చేయబడతాయి. ప్రజలు తమను తాము రక్షించుకోవడానికి సిద్ధంగా ఉండాలి.  వారి ప్రాంతం ఈ హెచ్చరిక కేటగిరీ కిందకు వస్తే బయటకు వెళ్లే ముందు బాగా ప్లాన్ చేసుకోవాలి. 

రెడ్ అలర్ట్ అంటే...
రెడ్ అలెర్ట్ అనగానే జాగ్రత్తగా ఉండండి అని అర్థం. లేదా సంసిద్దంగా ఉండండి అని అర్థం. 

గ్రీన్ అలెర్ట్ అంటే..
ఇది 'హెచ్చరిక లేదు'ని సూచిస్తుంది ఎటువంటి 'చర్య అవసరం లేదు' అని అర్థం. రోజులు  ఆహ్లాదకరంగా గడుస్తాయి.  ఈ ప్రాంతంలోన రోజువారీ జీవితంలో వాతావరణ ప్రభావం చాలా తక్కువ ఉంటుంది. 

హైదరాబాద్ లో మరో ఇరవై నాలుగు గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ  హెచ్చరించింది. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోనూ వర్షానికి అవకాశముందని, ఈ మూడు జిల్లాల ప్రజలు ఎవరూ కూడా అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఏవైనా సమస్యలు ఉంటే హెల్ప్ లైన్ నెంబర్ 040-21111111, 9000113667 నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.

మూడు నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. జలమండలి తాగునీటి సరఫరా, నాణ్యతపై దృష్టి సారించింది. నగరంలో దాదాపు 16 ఈఆర్టీ బృందాలను జలమండలి ఏర్పాటు చేసింది. నీరు నిలిచిన ప్రాంతంలో వాటిని తొలగించేందుకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశారు. ఈ వాహనాల్లో జనరేటర్ తో కూడిన డీ వాటర్ మోటార్ ఉంటుంది.
 మరో రెండు రోజుల్లో అల్పపీడనం పొంచి ఉండటంతో తెలంగాణా సర్కార్ అప్రమత్తమైంది. అధికారులకు మంత్రి తలసాని ఆదేశాలు జారీ చేశారు. నాలుగు రోజుల వర్షాలకే ఉభయ రాష్ట్రాలు అతలాకుతలం కావడంతో పాలకులు మరింత అప్రమత్తమయ్యారు. 

హుస్సేన్ సాగర్ కు భారీ వరద నీరు వస్తోందని, ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. నీటిని దిగువకు విడుదల చేస్తున్నందున లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేయాలన్నారు. ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించాలన్నారు.
భారీ వర్షాల కారణంగా హుస్సేన్ సాగర్ నిండు కుండలా మారింది. నీటి మట్టం ఫుల్ ట్యాంక్ లెవల్ ను దాటింది. ఫుల్ ట్యాంక్ లెవ‌ల్ సామ‌ర్థ్యం 513.45 మీట‌ర్లు కాగా, 514.75 మీట‌ర్లను దాటింది. దీంతో దిగువ‌కు నీరు విడుద‌ల చేస్తున్నారు.

By
en-us Political News

  
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో   నైతికత, విలువలు పలుచన అయిపోతున్నాయి.   ఏ పార్టీ నుంచి గెలిచామనే అంశంతో సంబంధం లేకుండా, వ్యక్తిగత ప్రయోజనాలు, అధికార కాంక్ష,  రాజకీయ లబ్ధికి మాత్రమే పెద్ద పీట వేస్తున్న నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు
గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఒకింత జోరు తగ్గించిన వంగవీటి రాధా.. ఉన్నట్టుండి జనసేనానిని తో భేటీ అవ్వడం, అదీ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వేడి రగిలిన సమయంలో కలవడం వెనుక పక్కా వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.