గుప్పెడంత గుండెకు కొండంత భరోసా ఇలా సాధ్యం!

Publish Date:Feb 23, 2023

Advertisement

చలి పంజాకు ఈ సంవత్సరం చాలా గట్టిగానే దెబ్బ తిన్నారు ప్రజలు. ఈ చలి ప్రభావం వల్ల ఎంతో మంది శ్వాశ సంబంధ సమస్యలతో ఇబ్బంది పడ్డారు. మరికొందరు మరణించారు కూడా. చలి ముఖ్యంగా శ్వాస నాళం మీద ప్రభావం చూపినప్పటికీ శరీరంలో కీలకమైన ఊపిరితిత్తులు, గుండె ఈ చలి ప్రభావానికి ఎక్కువగా గురవుతాయి. ప్రస్తుతం శివరాత్రి గడిచిపోయిన తరువాత చలి ప్రభావం క్రమంగా తగ్గుతూ వస్తోంది. వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చలి తగ్గిపోయి మెల్లగా వేసవి వైపు అడుగులు పడుతున్నాయి. చాలామందికి ఈ సమయం ఎంతో విలువైనది. ముఖ్యంగా బరువు తగ్గాలని అనుకునేవారికి, వ్యాయామం చక్కగా చేసి ఫ్యాట్ బర్న్ చెయ్యాలని అనుకునేవారికి ఇది బెస్ట్ సీజన్. అయితే ఈ మూమెంట్ లో గుండె ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త వహించాలండోయ్..


జిమ్ లలోనూ.. ఆరు బయట, రోడ్ల మీద నడక నుండి విభిన్న రకాల వ్యాయామాలు చేస్తూ చేస్తూనే గుండె ఆగిపోయి ప్రాణాలు వదిలేస్తున్న వారు ఉన్నారు ఇప్పట్లో. అందుకే ఈ సీజన్ లో గుండె ఆరోగ్యం ఇలా.. పదిలం చేసుకోండి.


గుండె పర్ఫెక్ట్ ఉండాలంటే.. అందరూ గుర్తుంచుకోవలసిన అయిదు విషయాలు..

హైడ్రేటెడ్ గా ఉండాలి


గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తగిన మోతాదులో నీరు తాగడం చాలా అవసరం.  నీరు శరీరం నుండి టాక్సిన్స్ బయటకు పంపుతుంది. గుండెను సరైన రీతిలో పని చేయడానికి సహకరిస్తుంది.  రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు త్రాగాలని గుర్తుపెట్టుకోవాలి. 


వ్యాయామం ఇలా.. 


 రెగ్యులర్ గా చేసే వ్యాయామం గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.  ఇది  హృదయాన్ని బలంగా ఉంచడంలో సహాయపడుతుంది మరియు మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.  మీరు ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేస్తే ఎంతో గణనీయమైన మార్పు కనిపిస్తుంది.


 గుడ్ ఫుడ్..


శరీర ఆరోగ్యానికి ఆహారమే గొప్ప ఔషధం. అలాగే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా అవసరం.  యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవాలి.  ప్రాసెస్ చేసిన ఆహారాలలో షుగర్, కార్బోహైడ్రేట్లు చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. అలాగే గుండెకు చేటు చేసే కొవ్వులు వాటిలో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చెయ్యడం మంచిది. 


ఒత్తిడి మీద మంత్రం..


ఒత్తిడి  గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.  ఈ ఒత్తిడి కారణంగానే చాలా వరకు అనారోగ్య సమస్యలు, హైపర్ టెన్షన్ వంటి పరిస్థితులు ఏర్పడతాయి. యోగా లేదా ధ్యానం వంటి  విశ్రాంతినిచ్చే మార్గాలను ఎంచుకోవడం, వాటిలో పాల్గొనడం ద్వారా  ఒత్తిడి స్థాయిలను తగ్గించుకోవడానికి ప్రయత్నించవచ్చు.


 బ్యాడ్ హాబిట్స్ కు బై బై..


 గుండె జబ్బులకు ప్రధాన కారణాలలో ధూమపానం ఒకటి. అలాగే ఊపిరితిత్తుల వినాశనానికి కూడా ఇదే కారణం.   ధూమపానం మానేయడం వల్ల మీ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ప్రత్యక్ష పరోక్ష ధూమపానం వల్ల అందరి ఆరోగ్యాలు పాడవుతాయి. అదే ధూమపానం మానేస్తే మీ ఆరోగ్యంతో పాటు అందరి ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి గుండె పదిలంగా, ఆరోగ్యం అద్భుతంగా ఉండాలంటే ఈరోజే ఈ చెడు అలవాటుకు చెక్ పెట్టేయండి. 


పైన చెప్పుకున్న అయిదు విషయాలు చాలా సింపుల్ గా పాటించేవి. కానీ వాటి వల్ల కలిగే బెనిఫిట్ మాత్రం మీ జీవిత కాలాన్ని పొడిగిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం గుప్పెడంత గుండెకు కొండంత భరోసా ఇచ్చేయండి.


                                  ◆నిశ్శబ్ద.

By
en-us Political News

  
స్కూల్‌కి వెళ్లే పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి... వారి శారీరక, మానసిక ఎదుగుదలకు అవసరమైన పోషకాహారం ఏమిటి.. జంక్ ఫుడ్ వల్ల కలిగే నష్టాలు, బ్రేక్‌ఫాస్ట్ ప్రాముఖ్యత, టిఫిన్‌లో పెట్టాల్సిన ఆరోగ్యకరమైన ఆహారాల గురించి ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డా. పి. జానకి శ్రీనాథ్ వివరించిన ముఖ్యమైన సూచనలు ఈ వీడియోలో తెలుసుకోండి...
కాలక్రమేణా అంటువ్యాధులు సర్వసాధారణం అవుతున్నాయి. ఒకవైపు  రోగనిరోధక శక్తి బలహీనం కావడం, మరొకవైపు వైరస్‌లు , బ్యాక్టీరియాల కొత్త రకాలు కూడా తీవ్ర ముప్పును కలిగిస్తున్నాయి. గత నెలరోజులుగా..
తలనొప్పి, మైగ్రేన్, అసిడిటీ, అజీర్ణ సమస్యలకు గట్ హెల్త్ కూడా ఒక కారణం కావచ్చు. నీళ్లు సరైన విధంగా తాగడం ద్వారా ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో ఈ వీడియోలో తెలుసుకోండి.
భారతీయుల ఆహారంలో  నెయ్యి ప్రధానంగా ఉంటుంది.  ఒకప్పుడు నెయ్యిని చాలా విరివిగా తినేవారు. పైగా నెయ్యిని పోసుకుని తినాలి అని చెప్పేవారు. అయితే ఆ తరువాత నెయ్యి వాడకం తగ్గినా, ఇప్పటికీ నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వుల కారణంగా..
పిల్లలు ఫోన్ వాడితే కళ్ళు పాడవుతాయా? కంటి అలసట, స్క్రీన్ టైమ్ ప్రభావం, ఐ ఎక్సర్‌సైజులు మరియు కంటి ఆరోగ్యంపై డా. కాసు ప్రసాద్ రెడ్డి ఇచ్చిన ముఖ్యమైన సూచనలు తెలుసుకోండి.
కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఆహారంలో రకరకాల కూరగాయలు ఉండేలా చూసుకుంటే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం అని వైద్యులు చెబుతారు...
ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు లేదా  ఖాళీ సమయంలో..  చాలామంది  చిప్స్, నామ్కీన్, బిస్కెట్లు , ఇతర జంక్ ఫుడ్‌ను తింటుంటారు...
భారతీయుల ప్రధాన ఆహారం అన్నం.  మరీ ముఖ్యంగా దక్షిణ భారతీయులకు రోజులో కనీసం రెండు పూటల అయినా అన్నం ఉండాల్సిందే.. ఒకవేళ మధ్యాహ్న  భోజనంలో అయినా,  రాత్రి భోజనంలో అయినా చపాతీ లాంటివి తిన్నా....
వినికిడి లోపం అంటే ఒక వ్యక్తి అకస్మాత్తుగా శబ్దాలను వినలేకపోవడం అని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. చాలా సందర్భాలలో వినికిడి సమస్యలు మెల్లిగా  మొదలవుతాయి. మొదట్లో దీని లక్షణాలు  చాలా సాధారణంగా అనిపిస్తాయి...
ఈ రోజుల్లో వయసుతో నిమిత్తం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య నరాల బలహీనత మరియు విపరీతమైన నీరసం. షుగర్, బీపీ, అధిక బరువు, పోషకాహార లోపం లేదా దీర్ఘకాలికంగా వాడే కొన్ని మందుల....
ఎసిడిటీ నేటి కాలంలో చాలా మందిలో కామన్ గా మారిన సమస్య.  చిన్న వయసు వారి నుండి పెద్దల వరకు అందరికీ గ్యాస్, ఎసిడిటీ పెద్ద సమస్యగా మారుతోంది. మసాలా పదార్థాలు ఎక్కువగా తినడం,  రాత్రి  ఆలస్యంగా..
ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవడానికి చాలా మంది ఎన్నెన్నో చిట్కాలు పాటిస్తుంటారు. చర్మాన్ని ప్రకాశవంతం చేసుకోవడానికి..
ఇంట్లో కాఫీ, టీలు సాధారణంగా స్టీల్ లేదా పింగాణీ కప్పులలో తాగుతారు. కానీ బయటకు వెళ్లినప్పుడు చాలామంది  దుకాణాల దగ్గర కాఫీ..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.