పొడపత్రి ఆకులతో  డయాబెటిస్ కి  చెక్!

Publish Date:Jul 2, 2025

Advertisement

 

డయాబెటిస్ అనేది ఒక తీవ్రమైన వ్యాధి. నేటికాలంలో  దీని ప్రమాదం అన్ని వయసుల వారిలో కనిపిస్తోంది. జీవనశైలి,  ఆహారపు సరిగా తీసుకోకపోవడం, మొదలైన తప్పుల వ్లల   20 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో కూడా డయాబెటిస్ రావడం జరుగుతోంది. ఈ సమస్యను సకాలంలో పరిష్కరించకపోతే లేదా సరిగ్గా చికిత్స చేయకపోతే, కాలక్రమేణా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.   కుటుంబంలో ఎవరికైనా ఇప్పటికే డయాబెటిస్ ఉంటే, ప్రతి ఒక్కరూ దాని గురించి జాగ్రత్తలు తీసుకోవాలి.  మెరుగైన ఆహారపు అలవాట్లు, కొన్ని రకాల ఇంటి నివారణలు,  మందుల సహాయంతో, డయాబెటిస్‌ను నివారించడమే కాకుండా, దాని వల్ల కలిగే నష్టాలను కూడా తగ్గించవచ్చు. అలాగే డయాబెటిస్ రాకుండా జాగ్రత్త పడవచ్చు. దీని కోసం డయాబెటిస్ కిల్లర్ ఆకు చాలా చక్కగా పనిచేస్తుంది. ఇంతకీ ఈ డయాబెటిస్ కిల్లర్ ఆకులు ఏంటి? ఇవెలా పని చేస్తాయి?  తెలుసుకుంటే..

పొడపత్రి..

డయాబెటిస్ ఉన్నవారికి వేప, తులసి,  కరివేపాకు, మునగ వంటివి బాగా పనిచేస్తాయి. ఇవి రక్తంలో చక్కెర సమస్య తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటాయి.  కానీ పొడపత్రి ఆకులు మాత్రం చాలా ప్రత్యేకం.  ఇవి టైప్-2 డయాబెటిస్ ను మాత్రమే కాకుండా టైప్ -1 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుందట.  పొడపత్రికి ఆయుర్వేదంలో చాలా ఆదరణ ఉంది.  

ఆయుర్వేదంలో పొడపత్రిని 2000 సంవత్సరాలకు పైగా ఉపయోగిస్తున్నట్టు ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఈ ఆకు పొడి, సారం రెండూ  డయాబెటిస్ చికిత్సలో ప్రయోజనకరంగా ఉంటుంది.

జిమ్నెమిక్ ఆమ్లం..

పొడపత్రి  మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎలా మేలు చేస్తుందో తెలుసుకోవాలి అంటే.. ఆ ఆకులో ఉన్న ప్రత్యేకత తెలుసుకోవాలి. ఈ మొక్కలో ఉండే ప్రధాన క్రియాశీల సమ్మేళనాలలో  జిమ్నెమిక్ ఆమ్లం ఒకటి. ఇది  మధుమేహ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుందని పరిశోధనలో తేలింది. తీపి పదార్థాలను తినే ముందు దీనిని తీసుకుంటే.. జిమ్నెమిక్ ఆమ్లం  రుచి మొగ్గలపై చక్కెర గ్రాహకాలను అడ్డుకుంటుంది. ఇది తీపిని రుచి చూసే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.  తీపి ఆహారాన్ని రుచిపరంగా తక్కువ ఆకర్షణీయంగా చేస్తుందట.

జిమ్నెమిక్ ఆమ్లం ప్రేగులలో ఈ గ్రాహకాలను కూడా నిరోధించగలదని, ఇది శరీరంలో చక్కెర శోషణను తగ్గిస్తుందని కనుగొంది. దీని కారణంగా, భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు.

అయితే గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే స్త్రీలు లేదా పిల్లలు దీనిని ఉపయోగించకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది డయాబెటిస్ మందులకు ప్రత్యామ్నాయం కాదు.  వైద్యుడిని సంప్రదించకుండా దీనిని ఉపయోగించడం సరైనది కాదని అంటున్నారు. ఇప్పటికే డయాబెటిస్ మందులు తీసుకుంటున్న వ్యక్తులు ఇలాంటి  నివారణలు ఉపయోగించే ముందు ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. దీన్ని మీరే ఉపయోగించడం వల్ల కొన్నిసార్లు మందులతో రియాక్షన్ ఏర్పడే ప్రమాదం ఉంటుంది.  

                           *రూపశ్రీ.

గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

By
en-us Political News

  
ఎండల ప్రభావం వల్ల లేదా మనం తినే ఆహారపు అలవాట్ల వల్ల చాలామందిలో శరీర ఉష్ణోగ్రత (Body Heat) అకస్మాత్తుగా పెరిగిపోతూ ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం..
అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన విభాగంగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఇది శరీరానికి రోజంతా అవసరమైన శక్తిని అందించడంలో సహాయపడుతుంది. అయితే సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల, చాలా మంది..
ఆయుర్వేదం భారతీయులకు ఋషులు అందించిన గొప్ప వైద్య విధానం. ఈ ఆయుర్వేద వైద్యంలో వ్యాధిని మూలాల నుండి నిర్మూలించడం జరుగుతుంది.  సైన్స్ కనుగొనలేని ఎన్నో రకాల జబ్బులకు ఆయుర్వేదంలో వైద్యం దొరుకుతుంది...
ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య గుండె జబ్బులు (Heart Diseases). మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం మరియు చెడు ఆహారపు అలవాట్ల వల్ల గుండె పనితీరు మందగిస్తోంది...
ప్రస్తుత ఆధునిక కాలంలో శారీరక ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో, మానసిక ఆరోగ్యానికి (Mental Health) కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో అవసరం. కానీ, నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, వ్యక్తిగత సమస్యల వల్ల చాలా మంది...
ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మలబద్ధకం. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే పైల్స్, గ్యాస్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఎలాంటి మందులు వాడకుండా, ఇంట్లోనే సహజంగా మలబద్ధకాన్ని ఎలా తగ్గించుకోవచ్చో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు..
మానవ శరీరంలో ప్రేగుల పాత్ర చాలా ఉంది.,  తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో,  శరీరానికి అవసరమైన పోషకాలను గ్రహించడంలో, వ్యర్థాలను బయటకు పంపడంలో ప్రేగులు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. తిన్న ఆహారం..
మన శరీరంలో పొటాషియం స్థాయిలు హెచ్చుతగ్గులు కావడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, వాటి కారణాలు మరియు నివారణ మార్గాల గురించి ప్రముఖ వైద్యులు డాక్టర్ పాపారావు గారు ఈ వీడియోలో క్లుప్తంగా వివరించారు...
మూత్రపిండాలు శరీరం నుండి విషపదార్థాలను తొలగించడం, రక్తపోటును నియంత్రించడం,  శరీరంలో నీరు, ఖనిజాలను బాలెన్స్డ్ గా ఉంచడం వంటి   ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తాయి. అయితే, కొన్ని అనారోగ్యకరమైన..
చాలా మందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘తల తిరగడం’ (Vertigo/Dizziness) ఒకటి. హఠాత్తుగా కళ్ళు తిరగడం వల్ల భయం, అసౌకర్యం కలగడమే కాకుండా రోజువారీ పనులు చేసుకోవడం కష్టమవుతుంది.
చాలా మందికి రాత్రిపూట వేడివేడి అన్నం తింటే గాని నిద్ర పట్టదు. కానీ, బరువు తగ్గాలని లేదా ఫిట్‌గా ఉండాలని ప్రయత్నించే వారికి..
మనలో చాలా మందికి అద్దంలో చూసుకున్నప్పుడు కొన్ని శరీర భాగాలు నచ్చవు. ముఖ్యంగా ఎంత వ్యాయామం చేసినా, ఎంత కఠినమైన డైట్ పాటించినా తగ్గని మొండి కొవ్వు మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది...
ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది మహిళలను వేధిస్తున్న అతిపెద్ద సమస్య పి.సి.ఓ.డి (PCOD). అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.