రోజూ ఒక గుప్పెడు శనగలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..?

Publish Date:Sep 26, 2025

Advertisement

 

ఆరోగ్యకరమైన ఆహారం శరీరానికి చాలా అవసరం. అలాంటి ఆరోగ్యకరమైన ఆహారాలలో పప్పు ధాన్యాలు, తృణధాన్యాలు ఎప్పుడూ ఉంటాయి.  వీటిలో ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు..ఇలా అన్నీ ఉంటాయి.  చాలామంది ప్రోటీన్ కోసం రికమెండ్ చేసే ఆహారాలలో శనగలు మొదటి స్థానంలో ఉంటాయి.  శనగలను నానబెట్టి తిన్నా, లేక శనగలు వేయించినవి తిన్నా, లేదా మొలకెత్తిన శనగలు తిన్నా.. కూరల్లో వాడినా, ఆఖరుకు శనగపిండిని ఆహారంలో చేర్చుకున్నా చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెబుతారు. అయితే ఉడికించిన శనగలు కానీ శనగపప్పు కానీ రోజూ ఓ గుప్పెడు తింటే కలిగే లాభాల గురించి తెలిస్తే మాత్రం చాలామంది షాకవుతారు. ఇకమీదట రోజూ ఒక గుప్పెడు  శనగలను తమ ఆహారంలో తప్పనిసరిగా భాగం చేసుకుంటారని చెప్పడంలో  ఎలాంటి సందేహం లేదు. ఇంతకీ.. రోజూ గుప్పెడు శనగలు తింటే ఏమవుతుందో తెలుసుకుంటే..

పవర్ హౌస్..

శనగలు ప్రోటీన్ కు పవర్ హౌస్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.  శనగపప్పులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కండరాల పెరుగుదలకు, కండరాల మరమ్మత్తుకు సహాయపడుతుంది. శాకాహారులు చాలావరకు ప్రోటీన్ లోపంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు ప్రతి రోజూ గుప్పెడు శనగలు తింటే ప్రోటీన్ లోపం తొందరలోనే తగ్గిపోతుంది.

మలబద్దకం..

శనగలలో  ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.  ఫలితంగా మలబద్దకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.  శనగలలోని పైబర్ ప్రేగు కదలికలను సాఫీగా ఉండేలా చేస్తుంది. మలబద్దకంతో ఇబ్బంది పడేవారు శనగలు తింటూ ఉంటే మలబద్దకం సమస్య సులువుగా తగ్గిపోతుంది. 

రక్తహీనత..

శనగలలో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది.  ఇది రక్తంలో హిమోగ్లోబిన్ ను పెంచడంలో సహాయపడుతుంది.  భారతదేశంలో దాదాపు 80శాతం మంది మహిళలు రక్తహీనత సమస్యతో ఇబ్బంది పడేవారే అనేది చాలా మందికి తెలియని నిజం.  ప్రతి రోజు శనగలు ఆహారంలో తీసుకుంటూ ఉంటే రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు.

గుండె ఆరోగ్యం..

గుండె ఆరోగ్యంగా ఉండటానికి మెగ్నీషియం చాలా ముఖ్యం.  శనగలలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది.  ఇది గుండె ఆరోగ్యం,  కండరాల పనితీరును నియంత్రిస్తుంది.  ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడుతుంది.

మానసిక స్థితి..

శనగలలో విటమిన్-బి6 కూడా ఉంటుంది.  ఇది మెదడు ఎదుగుదలకు, మెదడు ఆరోగ్యానికి సహాయపడుతుంది. మెదడు పనితీరు, దాని స్థితి ఆరోగ్యంగా ఉంటే చాలా వరకు మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది.  అందుకే శనగలు తింటూ ఉంటే మెదడు ఆరోగ్యంగా ఉంటూ మానసికంగా సమతుల్యంగా ఉండవచ్చు.


                         *రూపశ్రీ.


గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

By
en-us Political News

  
ఆరోగ్యకరమైన శరీరానికి జింక్ చాలా అవసరం. జింక్ కణజాలాలను బాగుచేస్తుందని చెబుతారు. జింక్ ఒక యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ, కణాలను దెబ్బతినకుండా కాపాడటానికి సహాయపడుతుంది. చర్మం..
ఇనుప పాత్రలో వంట చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతారు. ఎందుకంటే ఇనుప పాత్రలో వంట చేయడం వల్ల ఆ ఆహారాన్ని ఐరన్ ఖనిజం చేరుతుంది.  దీని వల్ల శరీరానికి ఐరన్ ఎలాంటి సప్లిమెంట్ ..
ఈ రోజుల్లో పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు   ఎక్కువ సమయాన్ని మొబైల్, ల్యాప్‌టాప్ లేదా టాబ్లెట్ స్క్రీన్‌ల ముందు గడుపుతున్నారు. దీని ఫలితంగా, కంటి అలసట , చికాకు సర్వసాధారణమైపోయాయి...
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో సరైన నిద్ర లేకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి...
AI..ప్రపంచం అంతా వాడుతున్న కృత్రిమ మేధస్సు ఇది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ కృత్రిమ మేధస్సు వాడకం చాలా పెరిగింది.  ఏ చిన్న సందేహం వచ్చినా ఏఐ ని వాడటం, దాన్ని సలహాలు, సూచలు అడగడం..
నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మోకాళ్ళ నొప్పులు. జీవనశైలిలో మార్పులు, శారీరక శ్రమ తగ్గడం మరియు సరైన పోషకాహారం..
వేసవి మొదలవ్వగానే తీవ్రమైన ఎండ , పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మన రోజువారీ  కార్యకలాపాలు , ఆరోగ్యంపై ప్రభావం చూపడం మొదలవుతుంది. ఈ రోజుల్లో బయట కొద్దిసేపు ఉన్నా కూడా శరీరం అలసిపోయేంత వేడిగా ఉంటుంది...
పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి.  ముఖ్యంగా వేసవి కాలంలో నీటిశాతం అధికంగా ఉన్న పండ్లను ఎంత తీసుకుంటే అంత మంచిదని చెబుతూ ఉంటారు. కానీ చాలామంది వేసవి కాలంలో పండ్ల జ్యూసులు..
నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరినీ వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య కిడ్నీ వ్యాధులు...
తిండి కలిగితే కండ కలదోయ్ అని అంటుంటారు. అలాగే కొందరు ఎంత కారంగా ఉన్న ఆహారం తింటే.. శరీరం అంత దృఢంగా ఉంటుందని కూడా అంటుంటారు.  ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు బాగా కారంగా...
నేటి కాలంలో మారుతున్న జీవనశైలి, ఒత్తిడి మరియు ఆహారపు అలవాట్ల వల్ల వయసుతో సంబంధం లేకుండా చాలా మంది గుండెపోటు (Heart Attack) బారిన పడుతున్నారు. అయితే, గుండెపోటు అకస్మాత్తుగా వచ్చే ప్రమాదమే అయినప్పటికీ, మన శరీరం కొన్ని రోజుల ముందే కొన్ని లక్షణాల ద్వారా మనల్ని హెచ్చరిస్తుంది. ఆ సంకేతాలను సరైన సమయంలో గుర్తిస్తే ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చు.
భారతీయుల ఆహారంలో పాలు, పాల ఉత్పత్తులకు చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది.  పాలు, పెరుగు, వెన్న, నెయ్యి లేకుండా రోజు అస్సలు గడవదు.  ఇక ఇప్పట్లో చాలా మంది పనీర్ కుడా బాగా వినియోగిస్తున్నారు....
మన వంటింట్లో ఉండే వెల్లుల్లి కేవలం రుచికే కాదు, అద్భుతమైన ఔషధ గుణాలకు కూడా మారుపేరు. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు, అధిక బరువు మరియు మధుమేహంతో బాధపడేవారికి వెల్లుల్లి ఒక వరప్రసాదం లాంటిది. ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఈ వీడియోలో వెల్లుల్లిని ఎలా వాడాలి మరియు దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి సవివరంగా వివరించారు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.