చాణక్యుడు చెప్పిన మాట..  ఇంటి యజమానికి ఈ లక్షణాలుంటే కుటుంబం నాశనమే..!

Publish Date:Jun 11, 2024

Advertisement

 

ప్రపంచంలోని అన్ని దేశాలలోకి భారతదేశానికి, ఇక్కడి కుటుంబ వ్యవస్థకు చాలా ప్రత్యేకత ఉంటుంది.  భారతదేశ కుటుంబంలో తండ్రిని ఇంటి పెద్దగా భావిస్తారు.  ప్రతి కుటుంబానికి ఇంటి పెద్దనే మార్గనిర్థేశనం చేస్తాడు. కుటుంబ సభ్యుల మంచి చెడులు ఇంటి పెద్దనే చూసుకుంటాడు. ఎవరికీ ఏ లోటు రాకుండా ఇంటి పెద్దనే అందరి పట్లా బాధ్యతగా ఉంటాడు. ఇంటి పెద్దలో మంచి గుణాలు, అలవాట్లు,  మంచి నడవడిక ఉన్నప్పుడే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. కానీ ఇంటి పెద్దకు కొన్ని లక్షణాలు ఉంటే మాత్రం ఆ కుటుంబం మొత్తం నాశనం అయిపోతుందట. ఇంతకీ ఇంటి పెద్దకు ఉండకూడని లక్షణాలేంటో తెలుసుకుంటే..


కుటుంబ పెద్ద తన సోదరులతో ఎల్లప్పుడూ మంచి సంబంధాలను కొనసాగించాలట. కుటుంబంలో సోదరభావం ఉంటే కుటుంబం మొత్తం ఒకరికొకరు బలంగా ఉంటారట. ఇది జరగకపోతే, ఇంట్లో ప్రతికూలత ప్రారంభమవుతుంది.  ఆ ఇల్లు ఏ విషయంలోనూ ఐక్య భావంతో ఉండదు. కుటుంబంలో ఎదుగుదల అనేది ఉండదు.


ఇంటి పెద్దలు మొదట నియమాలను పాటించాలి.  ఆ తరువాత కుటుంబ సభ్యులను కూడా నియమాలను పాటించమని చెప్పాలి. అప్పుడే అది కుటుంబ సభ్యులపై ప్రభావం చూపుతుంది. చాలా సార్లు ఇంట్లో పెద్దలు ప్రతి ఒక్కరికీ నియమాలు, నిబంధనల గురించి చెప్తారు కానీ వాటిని స్వయంగా పాటించరు. అలాంటి ఇంట్లో సంతోషం ఎక్కువ కాలం ఉండదు. అందుకే సభ్యులతో పాటు ఇంటి పెద్దలు కూడా  నియమాలను పాటించాలి. కుటుంబ సభ్యులకు  స్ఫూర్తిగా ఉండాలి.


ఇంటి పెద్ద ఆహారం వృధా చేస్తే ఆ ఇంట్లో శుభాలు ఆగిపోతాయి. చాణక్యుడు చెప్పిన దాని  ప్రకారం ఇంట్లోని అన్ని వస్తువుల విలువను ఇంటి పెద్ద   అర్థం చేసుకోవాలి. ఆహారం, నీరు,  డబ్బు వృధా చేయకుండా జాగ్రత్తగా ఉండాలి.  లేకపోతే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది.

కుటుంబంలో విభేదాలు ఉంటే దానిని పరిష్కరించే బాధ్యత ఇంటి యజమానిపై ఉంటుంది. ఇంటి పెద్ద ఎవరి పట్లా వివక్ష చూపకూడదు. కుటుంబంలో కొనసాగుతున్న విభేదాలను చర్చల ద్వారా ముగించాలి. ఇలా చేయకుంటే అందరిలో విభేదాలు వస్తాయి.


ఇంటి పెద్దలు ఎప్పుడూ కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకుని డబ్బు ఖర్చు చేయాలి.  పిల్లల భవిష్యత్తు కోసం కూడా పొదుపు చేయాలి. అనవసరంగా ఖర్చు చేస్తే ఇంట్లో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉంటుంది.

                                                  *రూపశ్రీ.

By
en-us Political News

  
భారతదేశంలో వివాహానికి ముందు జాతకాల పొంతనను చూస్తారు. మరీ ముఖ్యంగా పెద్దలు కుదుర్చే పెళ్లిలో జాతకాల ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది.  జాతకాలు సరిపోతే..  గ్రహాలు , నక్షత్రాల అనుకూలంగా ఉంటే వైవాహిక బంధం ఎంతో బలంగా..
భార్యాభర్తల బంధం ఈ ప్రపంచంలో చాలా విభిన్నమైనది,  ఎంతో విశిష్టమైనది. భార్యాభర్తల బంధం నేటికాలంలో చాలా సున్నితంగా మారిపోయింది. ఏ విషయానికి ఎప్పుడు ఎలా గొడవలు వచ్చి, బంధం విచ్చిన్నమవుతుందో చెప్పలేం..
పెళ్లి ఈ ప్రపంచంలో ఎంతో గొప్ప వేడుక. భారతీయులకు అయితే పెళ్లి అనేది జీవితంలో అతిపెద్ద పండుగ అని చెప్పవచ్చు.  కానీ నేటికాలంలో ఆ వైవాహిక బంధం మసకబారింది. కొత్తగా పెళ్లైనవాళ్లు ఏడాది కూడా గడపకుండానే...
ప్రతి తల్లిదండ్రులు తమ కూతురు జీవితంలో విజయవంతంగా, బలంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని కోరుకుంటారు. దీనికి మంచి విద్య, మంచి విలువలు చాలా అవసరం. ఇవన్నీ ఉన్నా సరే.. కొంతమంది అమ్మాయిలు తమ జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు...
వేసవి కాలం రాగానే, చెమట నీళ్ళు కుమ్మరించినట్టు కారిపోతూ ఉంటుంది.  ఎంతమంచి బట్టలు వేసుకున్నా చెమట కారణంగా పాడైపోతూ ఉంటాయి.పైగా చెమట కారణంగా దుర్వాసన కూడా వస్తుంది. చెమట వాసన చాలా..
పుదీనా ఎంతో సువాసనగా, ఆహ్లాదాన్ని ఇచ్చే మొక్క.  ఎన్నో రకాల కూరల నుండి పచ్చళ్ల తయారీ  వరకు పుదీనాను  ఉపయోగిస్తారు.   ఇక వేసవి కాలంలో అయితే షర్బత్ నుండి నిమ్మరసం, ఆమ్ పన్నా, మసాలా మజ్జిగ ఇలా..
భారతదేశంలో ధనికుల కంటే పేదవారే ఎక్కువ.  పేదవారిలో కూడా చాలా పేదవారు,  ఒక మోస్తరు పేదవారు అని కూడా ఉంటారు. అయితే కాలం ఎంత గడిచినా జీవితాలలో ఏ మాత్రం మార్పు లేకుండా పేదవారిగానే ఉండిపోయే...
పిల్లలు జీవితంలోని ప్రతి దశలో  ఆత్మవిశ్వాసంతో, బాధ్యతాయుతంగా నిలబడాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు. నేటికాలంలో మంచి పేరెంటింగ్ అంటే కేవలం మంచి విద్యను అందించడం లేదా..
వేసవికాలం అనగానే మండే ఎండలు గుర్తుకు వస్తాయి.  ప్రతి ఏడాది ఈ ఎండల ప్రభావం పెరుగుతూనే ఉంటోంది. ఈ కారణంగానే చాలామంది ఇళ్లలో ఏసీలు పెట్టించుకుంటారు.  అయితే ఏసీ పెట్టించుకునే అంత స్తోమత లేనివారు కనీసం కూలర్ అయినా...
వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాలు , రెండు విభిన్న మనస్తత్వాల కలయిక కూడా.  పెళ్లి తర్వాత ప్రతి జంట తమ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది..
నేటి కాలంలో ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా జిమ్ వెళ్లేవారు తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు...
మీ జుట్టు మీ అందానికి ఒక కిరీటం వంటిది. కానీ నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, కాలుష్యం మరియు రసాయనాల వాడకం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటోంది. మీ జుట్టును ఒత్తుగా, పొడవుగా మరియు ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం...
ప్రేమించిన వారిని వదిలి వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నారా? మీ జీవితం మరియు మీ భాగస్వామి భవిష్యత్తు కోసం ఈ విషయాలు తప్పక తెలుసుకోండి...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.