కాంగ్రెస్ నాయకురాలు హిమానీ నర్వాల్ దారుణ హత్య
Publish Date:Mar 1, 2025
Advertisement
కాంగ్రెస్ నాయకురాలు హిమానీ నర్వాల్ దారుణ హత్యకు గురయ్యారు. హర్యానాకు చెందిన హిమానీ నర్వాల్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కీలక పాత్ర పోషించారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని మోడీ సర్కార్ విధానాలను వ్యతిరేకించండంలో క్రియాశీలంగా వ్యవహరిస్తారు. నిశిత విమర్శలతో బీజేపీ సర్కార్ పై విరుచుకుపడుతుంటారు. అటువంటి హిమానీ నర్వాల్ ను గుర్తుతెలియని వ్యక్తులు గొంతు నులిమి దారుణంగా హత్య చేశారు. ఈ హటన రోహతక్ జిల్లాలో జరిగింది. ఆమెను హత్య చేసి ఓ సూట్ కేసులో కుక్కి సప్లా బస్టాండ్ సమీపంలో పడేశారు. హిమానీ నర్వాల్ హత్యకు కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఆమె హత్యపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేసింది. హిమానీ నర్వాల్ హంతకులు ఎంతటివారైనా చట్టం ముందు నిలబెట్ట కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.
http://www.teluguone.com/news/content/haryana-congress-leader-himani-narwal-murdered-39-193697.html





