Publish Date:Jan 17, 2025
లొట్టపీసు కేసు, లైడిటెక్టర్ టెస్ట్ కు సిద్ధం, ఏసీబీ, ఈడీలు ఈ కేసులో నన్నేం పీకలేవు అంటూ పైకి గంభీరంగా చెబుతున్నప్పటికీ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఈ ఫార్ములా రేస్ కేసులో బాగానే ఇరుక్కున్నారు. ఈ కేసులో ఆయన ఏ క్షణంలోనైనా అరెస్టయ్యే అవకాశాలున్నాయన్నది కేవలం పరిశీలకుల విశ్లేషణ మాత్రమే కాదు.. స్వయంగా కేటీఆర్ కూడా అదే భావిస్తున్నారు. తనపై ఏసీబీ నమోదు చేసిన ఈ ఫార్ములా కేసును క్వాష్ చేయాలని ఆయన సుప్రీం కోర్టు వరకూ వెళ్లినా ఫలితం లేకపోయింది. ఆయనకు ఇసుమంతైనా ఊరట లభించలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన అరెస్టు నుంచి తప్పించుకోవడానికి న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నారు.
ఆయనే కాదు.. బీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ గా గుర్తింపు పొందిన మాజీ మంత్రి హరీష్ రావు సైతం ఇదే పనిలో ఉన్నారు. ఆయన ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ ను ఏసీబీ, ఈడీలు వరుస విచారణలతో ఉక్కిరిబిక్కిరి చేసి అంతిమంగా అరెస్టు చేస్తారన్న అనుమానంతోనే హస్తినలో న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు. అయితే పైకి మాత్రం బీఆర్ఎస్ టికెట్ పై విజయం సాధించి, కాంగ్రెస్ లోకి జంప్ చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ సుప్రీం కోర్టులో పార్టీ తరఫున పిటిషన్ దాఖలుకు వెళ్లానని చెబుతున్నారు. ఆ పిటిషన్ల కోసమైతే షరీష్ రావు స్వయంగా వెళ్లాల్సిన అవసరం లేదు. పార్టీ తరఫున న్యాయవాదులు వెడితే సరిపోతుంది. కానీ ఆయన గురువారం (జనవరి 16) హస్తినలో న్యాయనిపుణులతో చర్చిస్తూ బిజీబిజీగా గడిపారు.
అదే సమయంలో ఇక్కడ హైదరాబాద్ లో మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావును ఈడీ విచారిస్తోంది. దాదాపు ఏడు గంటలకు పైగా కేటీఆర్ ను విచారించిన ఈడీ, అవసరమైతే మరోసారి పిలుస్తామంటూ విచారణ ముగించి పంపించింది. ఒక వైపు కేటీఆర్ ను విచారిస్తూనే ఏస్ నెక్ట్స్ జెన్ అనే కంపెనీకి నోటీసులు జారీ చేసింది. ఈ కంపెనీ ఫార్ములా ఈ రేసు కు మొదటి సీజన్ కు స్పాన్సర్ గా వ్యవహరించి ఆ తరువాత వైదొలగింది.ఆ కంపెనీ వైదొలగడం వల్లనే అందుకే ప్రభుత్వం స్పాన్సర్ షిప్ సొమ్ము చెల్లించాల్సి వచ్చిందని కేటీఆర్ చెబుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఏ2, ఏ3 అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలను విచారించిన ఈడీ వారిచ్చిన వాంగ్మూలాల ఆధారంగా కేటీఆర్ ను ప్రశ్నిస్తుండటమే కాకుండా, గ్రీన్ కో అనుబంధ ఏస్ నెక్స్ట జెన్ లావాదేవీలపై కూడా ఆరా తీస్తోంది. ఇప్పటికే ఏ2, ఏ3లు తమ వాంగ్మూలాలలో మొత్తం వ్యవహారాలన్నీ కేటీఆర్ కనుసన్నల్లోనే జరిగాయని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ అరెస్టు అనివార్యం అన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. బీఆర్ఎస్ లో కూడా అదే ఆందోళన వ్యక్తం అవుతోంది.
దీంతో అరెస్టు నుంచి కేటీఆర్ బయట పడేందుకు ఉన్న మార్గాలపై న్యాయనిపుణులతో చర్చించేందుకే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కోరుతూ సుప్రీంలో పిటిషన్ సాకుతో హరీష్ రావు హస్తిన వెళ్లారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పొలిటికల్ సర్కిల్స్ లో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/harishrao-in-delhi-for-ktr-39-191390.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.