ఇక బీజేపీకి దబిడి దిబిడే!

Publish Date:Aug 12, 2022

Advertisement

బీహార్ లో ఎన్డీయే ప్రభుత్వం కుప్ప కూలి మహాఘట్ బంధన్ సర్కార్ కొలువు తీరిన అనంతరం జాతీయ స్థాయిలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. బీహార్ లో బీజేపీయేతర శక్తులన్నీ ఏకమైన విధంగానే జాతీయ స్థాయిలో బీజేపీయేతర కూటమి ఏర్పాటుకు మార్గం సుగమమైందని పరిశీలకులు అంటున్నారు.

గతంలోలా కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారన్న పోటీ తీవ్రత గణనీయంగా తగ్గిందంటున్నారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో బీజేపీయేతర కూటమి ఏర్పాటుకు జేడీయూ అధినేత నితీష్ కుమార్, ఆర్జేడీ నాయకులు తేజస్వి యాదవ్ లు చొరవ తీసుకుంటారని చెబుతున్నారు. వారి వెనుక ర్యాలీ కావడానికి జాతీయ స్థాయిలో బీజేపీయేతర పార్టీలకు ఎటువంటి అభ్యంతరం ఉండక పోవచ్చునని అంచనా వేస్తున్నారు. బీజేపీ కూటమి ఏర్పాటు సన్నాహాలలో భాగంగానే తేజస్వి యాదవ్ ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అదినేత్రితో బేటీ అయ్యారని అంటున్నారు.

సోనియాతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ చెప్పిన విషయాలను ప్రస్తావిస్తూ ఇప్పుడు ఇక దేశ వ్యాప్తంగా బీహార్ పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలే మెండుగా ఉన్నాయని అంటున్నారు. బిహార్‌లో బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు ఒక్కటైన విధంగానే,  దేశ వ్యాప్తంగా కూడా రాజకీయ బీజేపీయేతర రాజకీయ పార్టీలు విభేదాలు విస్మరించి ఏకతాటిపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తేజస్వి యాదవ్ చెప్పారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, మతపర ఘర్షణలతో   ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, దీంతో ప్రజాభీష్టం మేరకు 2024 ఎన్నికలలో బీజేపీని ఓడించడమే ఇప్పుడు దేశంలోని అన్ని బీజేపీయేతర పార్టీల బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.

ఆ బాధ్యతతోనే పార్టీలన్నీ ఏకతాటిపైకి రావడానికి సుముఖంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. బీహార్ లో అదే జరిగిందనీ, దేశ వ్యాప్తంగా ఇదే రిపీట్ అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీహార్ పరిణామాలు   బీజేపీకి చెంపపెట్టు వంటివని అన్నారు.  ప్రాంతీయ పార్టీలను నాశనం చేయాలని బీజేపీ భావిస్తోందని అన్నారు. అయితే దేశంలో ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేయడం అసాధ్యమన్న తేజస్వి యాదవ్..బీజేపీకి ముందున్నది గడ్డుకాలమేనని పేర్కొన్నారు. కాగా తన హస్తిన పర్యటనలో సోనియాగాంధీతో పాటు  పలువురు విపక్ష నేతలతోనూ తేజస్వి ప్రసాద్ భేటీ అయ్యారు. 

By
en-us Political News

  
గడిచిన దశాబ్ద కాలంలో కేంద్రంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీ, ప్రస్తుతం కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జగన్ పర్యటనలలో జరిగిన పలు సంఘటనలకు సంబంధించిన వీడియో ఆధారాలను వంగలపూడి అనిత ఈ సందర్భంగా ప్రదర్శించారు. సాధారణంగా ఎవరైనా పరామర్శకు వెళ్తే బాధితులను ఓదార్చడం, వారికి అండగా నిలవడం ఆనవాయితీ అనీ, కానీ జగన్ మాత్రం నిజమైన బాధితులను వదిలేసి నిందితులను పరామర్శించడానికి వెడుతున్నారనీ మండిపడ్డారు.
యూపీలో భారీ వర్షాలు, శాంతిభద్రతల పరిస్థితి, కోర్టు ఆదేశాలు కారణంగా చూపుతూ కాయస్థ పాఠశాల ట్రస్ట్ అనుమతిని ఉపసంహరించుకుంది. అయితే ఈ వివరణ సంతృప్తికరంగా లేదని కాంగ్రెస్ చెబుతోంది. అధికార యంత్రాంగం, బీజేపీ ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే రాహుల్ సభకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది.
కనీసం తనతో సంప్రదించకుండా ఏకపక్షంగా అంబటి రాంబాబు పాదయాత్ర ప్రకటన చేయడంపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో గత్యంతరం లేక అంబటి పాదయాత్ర విరమించుకున్నారని పార్టీ వర్గాల సమాచారం.
వైసీపీకి కోర్టులు, న్యాయమూర్తులు, చట్టం, న్యాయం వంటి విషయాలలో పెద్దగా పట్టింపు లేదని గతంలో పలుమార్లు రుజువైంది. అలాగే ఇప్పుడు కూడా కోర్టు తీర్పులు కోర్టువే, మా దారి మాదే అన్న చందంగా విజయవాడ వేదికగా వైసీపీ విద్యార్థి, యువజన విభాగాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగాయి. 
ఇప్పటి వరకూ  గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచులను మాత్రమే ప్రజలు నేరుగా ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటున్నారు. అయితే, మండల స్థాయిలో ఎంపీపీలు, జిల్లా స్థాయిలో జడ్పీ ఛైర్మన్లతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఛైర్మన్లు, మేయర్ల ఎంపిక పరోక్ష పద్ధతిలోనే జరుగుతోంది.
నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం త్వరలోనే విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ఏటీఎఫ్)లో కూడా ఇథనాల్‌ను మిశ్రమం చేయడానికి సన్నాహాలు చేస్తోందంటూ ఆయన బాంబు పేల్చారు.
రాహుల్ గాంధీ నీట్ లీకేజీ వ్యవహారం కేవలం కేంద్ర విద్యాశాఖ వైఫల్యం మాత్రమే కాదంటున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల పోరాటానికి లభించిన తొలి విజయమేనంటూ, ఢిల్లీలో గత నెల 20న శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీఛార్జ్, పెల్లెట్ తుపాకుల వినియోగానికి నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
గత కొన్ని నెలలుగా ఇరాన్, ఒమన్ మధ్య ఉన్నత స్థాయి సంప్రదింపుల ఫలితంగా కొత్త రూట్ ప్రతిపాదనపై ఓ ఒప్పందం కుదిరింది. సాంకేతిక, చట్ట, భద్రతా కోణాల్లో సమగ్ర సమీక్షలు జరిపిన అనంతరం, ఈ కొత్త రూట్ కు సంబంధించి ఇరు దేశాలు ఓ అవగాహనకు వచ్చాయి.
వచ్చినది పోగాకు రైతుల కష్టాలు విని, వారికి అండగా ఉన్నానని సంఘీభావం తెలపడం. అయితే ఈ పర్యటనలో జనగ్   రైతులను కలవడం, వారి కనీస హామీ ధర డిమాండ్ల కోసం పోరాడటం కంటే, బల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తన ప్రసంగం కూడా పరమ రొట్టకొట్టుడు పద్ధతిలో సాగింది.
2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనప్పటి నుంచీ తమ్మినేని రాజకీయంగా ఒకింత ఇన్ యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా తమ్మినేనిని ఆముదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలక బాధ్యతలను అప్పగించారు. ఈ నిర్ణయం తమ్మినేనిలో తీవ్ర అసంతృప్తికి కారణమైందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
వైఎస్ జగన్ ఆదేశిస్తే ఏమైనా చేస్తానంటూ సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అలాగే బోరుగడ్డ అనిల్ తన నోటి దురుసు, అనుచిత వ్యాఖ్యల కారణంగా తొమ్మిది నెలలపాటు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.