గుర్మీత్ "దానికి" పనికిరాడట..?
Publish Date:Aug 31, 2017
Advertisement
రేప్ చేసినందుకు గాను శిక్ష అనుభవిస్తూ..దాని నుంచి తప్పించుకోవడానికి తాను అసలు "ఆ" పనికే పనికిరాను అంటూ కేసు నుంచి బయట పడిన దాఖలాలు మనం ఎన్నో సినిమాల్లో చూశాం. ఇప్పుడు అలాంటి దానిని అడ్డు పెట్టుకొని శిక్ష నుంచి బయటపడేందుకు ట్రై చేశాడు డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్ రాం రహీమ్ బాబా. అత్యాచారం, హత్య కేసుల్లో దోషిగా తేలిన డేరా బాబాకు పంచకులలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్షను విధించింది. ప్రస్తుతం రోహ్‌తక్‌లోని కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నాడు గుర్మీత్. అయితే తుదితీర్పు వెలువరించే రోజున న్యాయమూర్తి ముందు డేరా బాబా విచిత్ర వాదన వినిపించాడట. డేరా అత్యాచారం చేశాడు అనడానికి బలమైన ఆధారాలున్నాయి..ఇక ఏటూ తప్పించుకునే అవకాశం లేదు దీంతో ఈ కేసు నుంచి ఎలాగైనా బయటపడేందుకు ఏం చెప్పాడో తెలుసా..? 1990 నుంచి తనకు లైంగిక సామర్థ్యం లేదని..తాను శృంగారం చేయడానికి పనికి రానని జడ్జి ముందు చెప్పుకున్నాడట. నపంసకుడినైన తాను రెండు అత్యాచారాలు ఎలా చేస్తానని తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేశాడు. పైగా విచారణ సందర్భంగా అతనికెప్పుడూ లైంగికపరమైన పరీక్షలు జరపలేదని బాబా తరపు లాయర్లు వాదనలు వినిపించడంతో సీబీఐ ఖంగుతింది. అయితే ఊహించని విధంగా న్యాయమూర్తి జగ్‌దీప్ సింగ్ వేసిన ప్రశ్నకు గుర్మీత్, అతని న్యాయవాదులు అడ్డంగా దొరికిపోయారు. నీకు ఇద్దరు కూతుళ్లు ఉన్నట్లున్నారు కదా..? అని జడ్జిగారు అడిగారు..అందుకు బాబా సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు. ఎందుకంటే ఈ కేసులో గుర్మీత్‌కు అనుకూలంగా సాక్ష్యం చెప్పిన వారిలో ఒక వ్యక్తి స్వామిజీకి ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నట్లు చెప్పాడు. మీరు నపుంసకుడు అయినప్పుడు ఇద్దరు బిడ్డలు ఎలా పుట్టారు..అంటే మీరు చెప్పింది అబద్ధం..ఆధ్యాత్మిక మార్గంలో దారి చూపుతారని నమ్మి వచ్చిన భక్తులతో ఓ క్రూర మృగంలా వ్యవహరించిన మీపై ఎలాంటి సానుభూతి చూపించేది లేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. మరో ఆలోచన లేకుండా 20 ఏళ్ల శిక్షను విధిస్తూ తీర్పు చెప్పారు. ఆ వార్త విన్న వెంటనే గుర్మీత్ కుప్పకూలిపోయాడు. ఇంక చేసేది లేక ఏడుస్తూనే జైలుకి వెళ్లాడు డేరా బాబా.
http://www.teluguone.com/news/content/gurmeet-ram-rahim-45-77481.html





