గన్ మిస్ ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ మృతి
Publish Date:Jun 29, 2023
Advertisement
అప్రమత్తంగా ఉంటే బాగా అలవాటైన పనులు కూడా ప్రాణాంతకంగా పరిణమిస్తాయి. ముఖ్యంగా పోలీసులు తమ విధినిర్వహణలో భాగంగా తమ ఆయుధాలను క్లీన్ చేయడం దాదాపుగా రోజువారీ వ్యవహారం. ఎంతగా అలవాటైన పనైనా సరే అవసరమైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఎంతటి ప్రమాదమో ఈ ఉదంతాన్ని బట్టి మరో సారి తేటతెల్లమైంది. ఇంతకీ ఏం జరిగిందంటే గన్ మిస్ ఫైర్ అయ్యి ఒక కానిస్టేబుల్ మరణించిన ఘటన హైదరాబాద్ లోని ఖైరతాబాద్ మింట్ కాంపౌడ్ లో జరిగింది. తుపాకీ శుభ్రం చేస్తుండగా అది పొరపాటున పేలి హెడ్ కానిస్టేబుల్ రామయ్య మరణించాడు. తుపాకి మిస్ ఫైర్ అవ్వడంతో తీవ్రంగా గాయపడిన హెడ్ కానిస్టేబుల్ రామయ్యను నాంపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూశాడు. రామయ్య స్వస్థలం మంచిర్యాల లక్సెట్టిపేటగా చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/gun-miss-fire-head-conistable-dead-39-157543.html





