Publish Date:Aug 30, 2024
ఈ దిక్కుమాలిన, దరిద్రపు జగన్ మీడియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇంకా నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నట్టు వుంది. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగింది ఒకటయితే, సాక్షి మీడియా దాన్ని రకరకాలుగా టర్న్ చేసి, అదేదో రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పులాగా చిత్రీకరించడానికి శుక్రవారం ఉదయం నుంచి కాలకూట విషాన్ని సమాజంలో చిమ్ముతోంది. కేవలం ఐదుగురు విద్యార్థినీ విద్యార్థుల మధ్య జరిగిన వ్యక్తిగత అంశాన్ని కాలేజీ మొత్తానికి ఆపాదించి, దాన్ని హిడెన్ కెమెరాలు అనే మసిపూసి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం నిస్సిగ్గుగా జరిగింది. వాస్తవానికి ఐదుగురు విద్యార్థుల మధ్య జరిగిన వ్యవహారం హిడెన్ కెమెరాల ప్రచారానికి దారి తీసినట్లు తెలుస్తోంది. ప్రేమలో విఫలమైన ఒక కుర్రాడు చేసిన హిడెన్ కెమెరాల తప్పుడు ప్రచారాన్ని జగన్ మీడియా సొంతం చేసుకుని చాలా ఘోరం జరిగినట్టు మీడియాలో ఊదరగొట్టేసింది. రకరకాల విషపూరిత కథనాలు వండి వడ్డించేసింది. ఇప్పటి వరకూ శవాల కోసమే వెతుకుతున్న రాబందు జగన్ కూడా ఈ విషయం మీద విషం కక్కాడు. తన రాజకీయ ప్రయోజనాల కోసం ఆడపిల్లల జీవితాలను కూడా నాశనం చేయడానికి సిద్ధపడ్డాడు. ఈ విషం కారణంగా గుడ్లవల్లేరు కాలేజీ ఆడపిల్లలు మరింత ఆందోళనకు గురయ్యారు. వందలు, వేలల్లో వీడియోలు వున్నాయని ఈ దుర్మార్గపు మీడియా చేసిన ప్రచారం చూసి ఆడపిల్లలు తల్లడిల్లిపోయారు. ఈ విషయం మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపిన పోలీసులు లేడీస్ హాస్టల్లో ఎలాంటి హిడెన్ కెమెరాలు లేవని తేల్చారు. ఈ ఘటన వెనుక వున్న అసలు విషయం కూడా వెల్లడయింది. దాంతో అప్పటి వరకూ ఆందోళన చేసిన విద్యార్థినులు ఆందోళన విరమించారు. అంతా సర్దుమణిగినప్పటికీ దరిద్రపు జగన్ మీడియా మాత్రం వెనక్కి తగ్గలేదు.. తన విష ప్రచారం ఆపలేదు.
మొత్తమ్మీద ఆలోచిస్తే అర్థమవుతున్న విషయం ఏమిటంటే, ఇప్పుడు ముంబై హీరోయిన్ కాదంబరి ఇష్యూ చాలా సీరియస్‌గా వుంది. ఈ ఇష్యూలో ఐపీఎస్‌లతోపాటు జగన్ కొంప కూడా మునిగేలా వుంది. శుక్రవారం నాడు కాదంబరి విజయవాడ వచ్చింది. ఆమెకు జరిగిన అన్యాయానికి సంబంధించి దర్యాప్తు చాలా వేగంగా జరుగుతోంది. హీరోయిన్ కాదంబరి విషయంలో ఇదంతా జరగడానికి జగన్ ఇచ్చిన ఆదేశాలే కారణమన్న అంశం కూడా బయటకి వస్తోంది. ఈ అంశమే కనుక పూర్తి స్థాయిలో బయటపడిందంటే జగన్ సీన్ సితార్ అయిపోయే ప్రమాదం వుంది. అందుకే హీరోయిన్ కాదంబరి ఇష్యూని డైవర్ట్ చేయడం కోసమే జగన్ మీడియా గుడ్లవల్లేరు హాస్టల్ ఇష్యూని ఇంత పెద్దది చేసి రచ్చరచ్చ చేసిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/gudlavalleru-college-hostel-39-183950.html
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.