పవన్ కళ్యాణ్ అరెస్టుకు రంగం సిద్ధం?!

Publish Date:Jul 21, 2023

Advertisement

ఏపీలో ఇప్పుడు రాజకీయం అంతా వాలంటీర్ వ్యవస్థ చుట్టూ తిరుగుతోంది. ఏపీలో మానవ అక్రమ రవాణాకు వాలంటీర్లు కారణమవుతున్నారని వారాహీ రెండో విడత యాత్రలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 18 వేల మంది మహిళల మిస్సింగ్ కు వాలంటీర్లు కారణమనేలా పవన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మహిళలు, యువతుల  సమాచారాన్ని వాలంటీర్లు సంఘ విద్రోహ శక్తులకు చేరవేయడంతో పాటు వాళ్లను ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. పవన్ వ్యాఖ్యలపై ఏపీ మహిళా వాలంటీర్లు తీవ్రంగా స్పందించగా.. అప్పటి నుండి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఏపీ మహిళా కమిషన్ సైతం పవన్ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని నోటీసులు పంపగా.. ప్రభుత్వం కూడా పథకాల లబ్ది దారులకు వాయిస్ కాల్స్ చేసి వాలంటీర్లకు మద్దతు కూడగడుతున్నది.

 వాలంటీర్లపై వ్యాఖ్యల వ్యవహారంలో పవన్ కళ్యాణ్ అప్పటికీ ఇప్పటికీ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. వాలంటీర్లకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తే.. హైదరాబాద్ నానక్ రామ్ గూడలో వాలంటీర్లు సేకరించే డేటా స్టోర్ చేస్తున్నారనే కొత్త అంశం తెర మీదకి తీసుకొచ్చారు. దాంతో ప్రభుత్వంపై అనుమానాలు మరింతగా పెరిగాయి.  కాగా, ఇప్పుడు ఇదే అంశంపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. వాలంటీర్లను అవమానిస్తూ పవన్ చేసిన వ్యాఖ్యలపై కోర్టుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ పరువుకు పవన్ వ్యాఖ్యలు భంగం కలిగించేలా ఉన్నాయని వాలంటీర్లు భావిస్తున్నారని ప్రభుత్వం చెబుతోంది. అంతేకాదు, వాలంటీర్లపై పవన్ దురుద్దేశ పూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేశారని, వాలంటీర్లలో మహిళలను కించపరిచేలా పవన్ మాట్లాడారని ఆరోపిస్తూ కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది.

ఒకవైపు లీగల్ యాక్షన్ తీసుకోవాలని భావిస్తున్న జగన్ సర్కార్ పవన్ చేసిన వ్యాఖ్యలపై కోర్టుకు వెళ్లాలని భావిస్తూనే.. మరోవైపు పవన్ కళ్యాణ్ అరెస్టుకు కూడా  ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ విషయాన్ని  సాక్షాత్తూ పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఢిల్లీ ఎన్డీఏ సమావేశం ముగిసిన అనంతరం తిరిగి వచ్చిన పవన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో పవన్.. వాలంటీర్లపై వ్యాఖ్యల నేపథ్యంలో తనను ప్రాసిక్యూట్ చేయాలని జగన్ ప్రభుత్వం జీవో ఇచ్చిందని, జనసేన కార్యాలయానికి ఆ జీవో వచ్చిందని, ఇదే ఆ జీవో అంటూ  మీడియా ప్రతినిధులకు పవన్ జీవో కాపీని చూపించారు.  వాలంటీర్లపై వ్యాఖ్యల నేపథ్యంలో పవన్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతిస్తూ జీవో నెం.16ను ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ విడుదల చేసినట్టు తెలుస్తోంది. ఆ జీవో ప్రకారం పవన్ పై సీఆర్పీసీ 199/4 (బి) కింద కేసులు పెట్టేందుకు అవకాశమున్నట్లు తెలుస్తున్నది.

కాగా, జీవో కాపీ మీడియాకి చూపించిన పవన్.. కావాలంటే తనను అరెస్టు చేసుకోవచ్చని, చిత్రవధ కూడా చేసుకోవచ్చని జగన్ కు  సవాల్ విసిరారు. దెబ్బలు తినేందుకైనా సిద్ధమన్నారు. జైలుకు వెళ్లేందుకే కాదు తాను దేనికైనా రెడీ అని పవన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా పవన్.. తన అరెస్ట్ కు రంగం సిద్ధం అయినట్టు అర్థమైందని, ఇదే జగన్ ప్రభుత్వ పతనానికి నాంది అని వ్యాఖ్యానించారు. తాను ఒకసారి మాట అంటే ఎంత రిస్కుకైనా వెనుకాడనని, జగన్… చెబుతున్నాను కదా.. సై అంటే సై.. రెడీగా ఉన్నాను.. రా.. చూసుకుందాం అని  సవాల్ విసిరారు. దీంతో ఈ వ్యవహారంలో నిజంగానే పవన్ కళ్యాణ్ ను అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేస్తే ఏపీలో రాజకీయ పరిణామాలు ఎలా మారనున్నాయి? ఈ అంశంలో కోర్టులు ఎలా స్పందించనున్నాయన్నది హాట్ టాపిక్ గా మారింది.

By
en-us Political News

  
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో   నైతికత, విలువలు పలుచన అయిపోతున్నాయి.   ఏ పార్టీ నుంచి గెలిచామనే అంశంతో సంబంధం లేకుండా, వ్యక్తిగత ప్రయోజనాలు, అధికార కాంక్ష,  రాజకీయ లబ్ధికి మాత్రమే పెద్ద పీట వేస్తున్న నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు
గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఒకింత జోరు తగ్గించిన వంగవీటి రాధా.. ఉన్నట్టుండి జనసేనానిని తో భేటీ అవ్వడం, అదీ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వేడి రగిలిన సమయంలో కలవడం వెనుక పక్కా వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సొంత మేనకోడలు నిశ్చితార్థానికి వైఎస్ జగన్ హాజరుకాకపోవడంపై రాజకీయవర్గాలలోనే కాదు.. సామాన్య జనంలో కూడా చర్చ జరుగుతోంది. గతంలో షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ నిశ్చితార్థానికి జగన్ దంపతులు హాజరైన సంగతిని పలువురు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు.
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.