ఫొటో దిగవా.. నీ సంగతి చూస్తా!

Publish Date:May 26, 2023

Advertisement

చెప్పినట్లు వినకున్నా.. పథకాలు అందలేదన్నా.. రోడ్లను బాగుచేయమని అడిగినా ప్రజలకు వైసీపీ చుక్కలు చూపిస్తోంది. అలా అడిగిన పానానికి ప్రజలకు వైకాపా ఎమ్మెల్యేలు, మంత్రులు ఇస్తున్న షాకులు, కక్ష సాధింపులు మామూలుగా ఉండటం లేదు. కేసులు, పథకాల కోతలతో నిత్య నరకం చూపుతున్నారు. అలాంటి సంఘటన  పునరావృతమైంది.

అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం దర్గాహొన్నూరు గ్రామంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో బ్రోచర్ పట్టుకుని ఫొటో దిగలేదని హోటల్ నిర్వాహకుడు, తెదేపా మైనార్టీ సెల్ నాయకుడు రఫీపై రాయదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో  ఫొటో దిగేందుకు నిరాకరించిన వ్యక్తి కి చెందిన హోటల్ నిర్వహణపై పరిశీలించి, చర్యలు తీసుకోవాలని  కాపు రామచంద్రారెడ్డి అధికారులకు హుకుం జారీ చేశారు.  రఫీ కుటుంబ సభ్యులు గ్రామంలో రోడ్డు పక్కన చిన్న హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రఫీ ఇంటికి వెళ్లారు.

జగన్ మైనార్టీలకు, ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని' చెబుతూ వారికి బ్రోచర్ ఇచ్చారు. ఫొటో దిగాలని కోరగా.. అందుకు రఫీ కుటుంబ సభ్యులు తిరస్కరించారు. తమకు జగన్ ప్రభుత్వం ఎలాంటి సాయం చేయలేదని, తాను తెదేపా మైనార్టీ నాయకుడని రఫీ చెప్పారు. ప్రభుత్వ విప్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆర్ అండ్ బీ రోడ్డు పక్కన హోటల్ నిర్వహిస్తున్నావని, నీ కథ చూస్తానని   బెదిరించారు.  హోటల్లో శుచి, శుభ్రతపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.   వీఆర్వో రామన్న, పంచాయతీ కార్యదర్శి కుళ్లాయిస్వామినాయుడు హోటల్ ను పరిశీలించి వంటనూనె, దోసె రవ్వ, చపాతీ పిండి నమూనాలు తీసుకెళ్లారు. హోటల్ నిర్వహణకు అనుమతి పత్రాలు, ఇంటి పట్టాలు ఇవ్వాలని అధికారులు అడగ్గా, స్థానిక తెదేపా నాయకులు కేశప్ప, వీఎల్ రామాంజనేయులు, నాగరాజులతో పాటు గ్రామస్ధులు అధికారులతో వాగ్వాదానికి దిగారు.

ఆర్అండ్ అధికారులు స్థలాన్ని పరిశీలించి వెళ్లారు. సహాయాన్ని కోరిన వారిపై దాడి చేయడం.. అసభ్య పదప్రయోగం ..లాంటి సంఘటనలు ఇటీవల ఏపీలో అనేకం చోటు చేసుకుంటున్నాయి. ఎలక్షన్ ఇయర్.. ఇలా దౌర్జన్యంగా వ్యవహరిస్తే.. ప్రజల తీర్పు ఎలా ఉంటుందో అనే కనీసం భయం.. జాగురుకత..వైకాపా నాయకులలో మచ్చుకైనా కానరావడం లేదు. ఇలాంటి పరిస్థితులలో.. వచ్చే ఎలక్షన్లలో ఎలా రియాక్ట్ అవ్వాలో.. జనానికి ఒక క్లారిటీ రావడం ఖాయమని రాజకీయ వర్గాలలో ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. 

By
en-us Political News

  
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.