రికార్డు స్థాయిలో బంగారం ధర.. తులం ఎంతంటే?

Publish Date:Apr 21, 2025

Advertisement

 

బంగారం ప్రియులకు ఇది షాకింగ్ న్యూస్. ఇక పసిడి కోనుగోలు చేయాలంటే సామాన్య ప్రజలకు మరింత కష్టతరం అవుతోంది. రోజురోజుకి గోల్డ్ రేటు అకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా బంగారం ధరకి మరోసారి రెక్కలు వచ్చాయి. 10 గ్రాముల బంగారం ధర పన్నులతో కలిసి అక్షరాల లక్ష రూపాయిలను తాకింది. దేశంలో బంగారం ధర ఈ స్థాయిని అందుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. సోమవారం ఉదయం రూ.98,350 ఉన్న24 క్యారెట్ల గోల్డ్ తులం రేటు సాయంత్రం 5.30 గంటల సమయానికి రూ.1,00,016కు చేరింది. శుక్రవారం ముగింపుతో పోలిస్తే దాదాపు రూ.2వేలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు 3,393 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా- చైనాల మధ్య వాణిజ్యం విషయంలో సయోధ్య కుదిరేంతవరకు ఇదే పరిస్థితి కొనసాగొచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 

ఇక పెరిగిన పసిడి ధరను చూసి సామాన్యులు గుండెలు బాదుకుంటున్నారు. ఇప్పట్లో తాము పసిడి కొనుగోలు చేయడం ఇక కలే అని వాపోతున్నారు. శుభకార్యాల సీజన్ ముందుండటంతో అసలు ఏం చేయాలో పాలు పోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  అమెరికా-చైనా సుంకాల యుద్ధం నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడి వైపు చూస్తున్నారు. బలహీనపడుతున్న డాలర్, అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు బంగారం పెరుగుదలకు ప్రధాన కారణాలని విశ్లేషకులు భావిస్తున్నారు. హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 89,469గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,599గా నమోదైంది. విజయవాడలో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 89,475గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,605గా నమోదైంది.దేశ రాజధాని దిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 89,613గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 97,743గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 89,465 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 97,595గా ఉంది. ముంబై, పుణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 89,461గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,591గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 89,455గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 97,585గాను ఉంది.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
భాగ్యనగర ప్రయాణ ముఖచిత్రం మారనుందా? నగరంలో మెట్రో రైలు సేవలను శివారు ప్రాంతాలకు విస్తరించడంతో పాటు విమానాశ్రయానికి మెట్రో కనెక్టివిటీని కల్పించే దిశ
తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపిన వంద కోట్ల రూపాయల ప్రైవేట్ పాఠశాలల అనుమతుల కుంభకోణంలో డీఎంకే సీనియర్ నేత
హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు మేక శవంతో డెత్ డ్రామా.!
దేశ రాజధాని దిల్లీలో ఎన్నికల సంఘం పనితీరును నిరసిస్తూ కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
నా చావుకే రూ.40 కోట్ల విలువనా? లేక నేను బతికి ఉండాలా అనేది ప్రభుత్వమే నిర్ణయించుకోవాలి! అంటూ జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జె. అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు
ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనానికి బానిసైన ఓ యువకుడు తన విలాసవంతమైన జీవితం కోసం ఏకంగా కిడ్నాప్ నాటకానికి తెరలేపాడు.
ఉద్యోగాల ఆశ చూపించి విదేశీ మహిళలను భారత్‌కు రప్పించడం.. ఆపై వారితో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహించడంతో మాదాపూర్‌లో వెలుగుచూసిన ఈ వ్యవహారం కలకలం రేపుతోంది.
సీఎం రేవంత్‌తో దేవేంద్ర ఫడ్నవీస్ భేటీ.. 152 మీటర్ల ఎత్తుపై ముందడుగు.!
ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో రోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి
ప్రస్తుత సాంకేతిక విప్లవంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది.
పెరిగిన నిత్యావసరాలు నిర్మాణ సామగ్రి ధరలతో సామాన్యులకు సొంతింటి కల నెరవేర్చుకోవడం అనేది ఒక కష్టతరమైన సవాలుగా మారుతున్న తరుణంలో
తెలంగాణలో రూ.96 కోట్ల ప్రభుత్వ నిధులకు గండి.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.