Publish Date:Aug 27, 2022
పార్టీనుంచి బయటపడినపుడే అవతలి వ్యక్తి నిజస్వరూపాలు బయటపడటం ఈమధ్య కాంగ్రెస్‌కీ అను భవమవుతోంది. సీనియర్ నేత గులాంనబీ అజాద్ పార్టీ పదవులు, సభ్యత్వాన్ని కాదని బయట పడ్డారు. అయితే దాని వల్ల తమకు నష్టం లేదన్నట్టుగా కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఆజాద్‌కి బీజేపీ వారి పట్ల అనూహ్యరీతిలో ప్రేమ కలగడంలో పెద్ద ఆశ్చర్యపడనవసరం లేదని కాంగ్రెస్ వర్గాలు అంటున్నా యి. జీఎన్ ఏ (గునాంనబీ ఆజాద్) డీఎన్ఏ మోడీ ఫై అయిందని పంచ్‌లు విసురుతు న్నారు. పార్టీ నాయ కత్వం పట్ల ద్రోహానికి పాల్పడి.. తన నిజ స్వరూ పాన్ని బయటపెట్టారని దుయ్య బట్టారు.
ఆజాద్ రిమోట్ కంట్రోల్ ప్రధాని మోదీ చేతిలో ఉందని, ఈ విషయం రాజ్యసభ పదవీ కాలం ముగిసిన సమయంలోనే బయటపడిందని విమర్శించారు. ఆజాద్, మోదీల మధ్య ప్రేమ పార్లమెంటులోనే కని పించిందని వ్యాఖ్యానించారు. తొలుత మోదీ కన్నీళ్లు పెట్టుకున్నారు. తర్వాత పద్మవిభూషణ్ ఇచ్చారు. అనంతరం నివాస సదుపాయాన్ని పొడిగించారు.
ఇవేమీ యాదృచ్చికంగా జరిగినవికాదు. వ్యూహాత్మకంగా, సహకార పద్ధతిలో జరిగినవేనని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, కమ్యూనికేషన్ ఇన్‌చార్జి జైరాం రమేశ్ దుయ్యబట్టారు. తన రాజీనామా లేఖలో అగ్ర నేత రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత దూషణలకు దిగడాన్ని రమేశ్ తప్పుబట్టారు.
పార్టీని బలహీన పరుస్తున్నవారే.. పార్టీ బలహీనపడిందని ఎదురు దాడి చేస్తున్నారని మీడియా విభాగం ఇన్‌చార్జి పవన్ ఖేరా నిప్పులు చెరిగారు. ఆజాద్ రాజీనామా జీ-23 నేతలను కూడా విస్మయానికి గురి చేసిం ది. తాము కోరుకున్నది ఇది కాదని వారిలో ఒకరైన మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్ అన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/gna-dna-is-modi-congress-punch-to-azad-39-142757.html
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.