Publish Date:Aug 30, 2024
ఏది ఏమైనప్పటికీ మన దేశం చాలా గొప్పది. తమ పిల్లలు అల్లరి చేస్తుంటే తల్లిదండ్రులు నాలుగు పీకితే చప్పుడు చేయకుండా కూర్చుంటారు. కొంతమంది తల్లిదండ్రులు తమకు సంబంధించిన వేరే టెన్షన్లని పిల్లల్ని చావగొట్టి తగ్గించుకుంటారు.. ఈ రకంగా పిల్లల్ని తల్లిదండ్రులు ఎంత చావబాదినా మన దేశంలో నేరం కాదు. అయితే, జర్మనీలో మాత్రం ఇది చాలా పెద్ద నేరం. పిల్లల్ని చావగొట్టే సంగతి అలా వుంచండి, వాళ్ళని కొట్టే ఉద్దేశంతో అలా ముట్టుకున్నా సరే అది పెద్ద నేరమై కూర్చుంటుంది. నన్ను మా పేరెంట్స్ కొట్టారు అని ఆ పిల్లలు పోలీసులకు చెప్పినా, ఎవరైనా చూసి పోలీసులకు చెప్పినా ఇక ఆ పేరెంట్స్ పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగాల్సిందే. ఇలాంటి పరిస్థితి మన ఇండియా నుంచి వెళ్ళిన పేరెంట్స్.కి జర్మనీలో ఎదురైంది. థానే ప్రాంతానికి చెందిన జంట జర్మనీలో నివసిస్తోంది. ఓసారి వాళ్ళ కూతురు ఏదో అల్లరి చేస్తే, నా కూతురే కదా అని ఏదో కొద్దిగా చెయ్యి చేసుకున్నారు. అంతే, ఈ ఘోరాన్ని ఇరుగుపొరుగు వాళ్ళు చూశారు.. పోలీసులకు మోసేశారు. దాంతో పోలీసులు రెచ్చిపోయారు. ఆ తల్లిదండ్రుల మీద కేసు పెట్టారు. వాళ్ళ కూతుర్ని పిల్లల సంరక్షణ కేంద్రానికి తరలించేశారు. ఈ సంఘటన జరిగి ఇప్పటికి మూడేళ్ళయింది. ఇక్కడ పిల్ల, అక్కడ తల్లిదండ్రులు లబోదిబో అంటున్నారు. కోర్టుని తల్లిదండ్రులు మా కూతుర్ని మాకు ఇచ్చేయండి కుయ్యో అంటే, లేదు, మీ కూతుర్ని మీరు కొట్టి చంపేస్తారు అందువల్ల మీ కూతుర్ని మీకు ఇచ్చేదే లేదు అని కోర్టు తేల్చి చెబుతోంది. సంరక్షణ కేంద్రంలో వున్న కూతురు నేను నా పేరెంట్స్ దగ్గరకి వెళ్ళిపోతాను మొర్రో అంటే, నో, మీ పేరెంట్స్ నిన్ను కొట్టి చంపేస్తారు అని రిజెక్ట్ చేస్తోంది. ఈ విషయాన్ని థానె పార్లమెంట్ సభ్యుడు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ దృష్టికి తీసుకెళ్ళారు. వీలైనంత త్వరగా ఆ కూతుర్ని, తల్లిదండ్రులను కలిపి, ఇండియాకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని జై శంకర్ హామీ ఇచ్చారు. ఇక ఏం జరుగుతుందో చూడాలి.
పిల్లలను కొట్టడం లేదా శారీరకంగా శిక్షించడం జర్మనీలో నేరంగా పరిగణించబడుతుంది. జర్మనీ 2000లో పిల్లలపై శారీరక దండనను నిషేధించింది, అలా చేసిన మొదటి దేశాలలో ఒకటిగా నిలిచింది. పిల్లలు శారీరక హింస లేకుండా పెరిగే హక్కును కలిగి ఉంటారని చట్టం పేర్కొంది. వారి పిల్లలపై శారీరక బలాన్ని ఉపయోగించే తల్లిదండ్రులు లేదా సంరక్షకులు జరిమానాలు లేదా నేరారోపణలను సదరు చట్టం ద్వారా ఎదుర్కోవాల్సి వుంటుంది. జర్మన్ సివిల్ కోడ్ సెక్షన్ 1631 ప్రకారం, "పిల్లలకు శారీరక లేదా మానసిక హింస లేకుండా పెరిగే హక్కు ఉంది." జర్మన్ క్రిమినల్ కోడ్ సెక్షన్ 223 పిల్లలకు శారీరక హాని కలిగించడాన్ని క్రిమినల్ నేరంగా పరిగణిస్తుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/germany-corporal-punishment-of-children-39-183935.html
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.