కేసీఆర్ కేటీఆర్ ఎడముఖం పెడముఖం.. తెలంగాణ అసెంబ్లీ నిర్వహణ అస్తవ్యస్తం

Publish Date:Sep 14, 2022

Advertisement

అంతా నా ఇష్టం అంతా నా ఇష్టం ఎడా పెడా ఏమి చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం చెడ మడ చేలరేగినా చెప్పేదెవడ్రా నా ఇష్టంఅన్నట్లుగా ఉంది తెరాస ప్రభుత్వం తీరు. విలువలు, నిబంధనల ఊసే లేకుండా ఇష్టాను సారంగా సభా వ్యవహారాలను సాగించేస్తున్నదన్న విపక్షాల విమర్శలకు బలం చేకూర్చేదిగానే ప్రభుత్వం తీరు ఉంది. ఏదైనా ఒక బిల్లు సభలో ప్రవేశపెట్టిన తరువాత దానిపై చర్చ జరుగుతుంది.

సభ్యులు తమ అభ్యంతరాలను తెలియజేస్తారు. ప్రభుత్వం వాటిని పరిగణనలోనికి తీసుకుంటే మళ్లీ సవరణలు చేస్తారు. ఆ తరువాత సదరు బిల్లు పాస్ అవుతుంది. అసెంబ్లీ ఆమోదం పొందిన తరువాతనే దానిని గెజిట్ లో ప్రచురిస్తారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన ప్రొసీజర్ ఇది కాగా,   కాగా తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ విధానాలన్నిటికీ తిలోదకాలిచ్చేసింది. అధికారం చేతిలో ఉంది, సభలో ప్రశ్నించే విపక్షాలకు సంఖ్యా బలం లేదు. ఏ విషయాన్నైనా బుల్ డోజ్ చేసేందుకు అవసరమైన మంద బలం ఉందన్న ధీమాతో తెరాస సర్కార్ అసెంబ్లీ నిబంధనలను తుంగలోకి తొక్కేస్తోందనడానికి నిదర్శనమే మంగళవారం సభలో ప్రవేశ పెట్టిన బిల్లులకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ను సోమవారం తేదీతో ముద్రించి దానినే సభ్యులకు మీడియాకు సర్క్యులేట్ చేయడం.

అలాగే సభలో మంగళవారం (సెప్టెంబర్ 13న) ప్రవేశపెట్టిన బిల్లులను 12నే ప్రవేశపెట్టినట్లుగా పేర్కొంటూ అదే 12వ తేదీతో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం. తెలంగాణ శాసనసభ సమావేశాలు మూడో రోజు  మంగళవారం (సెప్టెంబర్ 13) ప్రభుత్వం పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు, జీహెచ్ఎంసీ, పురపాలక చట్ట సవరణ బిల్లు, కావేరి వ్యవసాయ, గురునానక్, శ్రీనిధి, ఎంఎన్‌ఆర్‌, నిక్ మార్ ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు అనుమతిస్తూ తీసుకొచ్చిన చట్ట సవరణ బిల్లులకు సభ ఆమోదముద్ర వేసింది. అలాగే కొత్త ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో 25 శాతం తెలంగాణ విద్యార్థులకు రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకొచ్చిన బిల్లును శాసనసభ ఆమోదించింది. రేపు సభలో ఏం జరగాలో ఈ రోజే నిర్ణయించేసి, అందుకు అనుగుణంగా పేపర్లు రూపొందించేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న చందంగా తెలంగాణ సర్కార్ వ్యవహరిస్తున్నది.

చట్ట సభల ప్రతిష్టను మసకబార్చే విధంగా తెరాస సర్కార్ వ్యవహరిస్తున్న తీరు పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చట్ట సభలలో ఈ స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన ప్రభుత్వమేదీ గతంలో లేదని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. ఈ తీరు అధికార దుర్వినియోగానికి పరాకాష్టగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. కాగా ముందు రోజు తేదీతో గెజిట్ విడుదల  కావడానికీ, బిల్లుల ఆమోదానికి ముందే గెజిట్ నోటిఫికేషన్ విడుదల కావడానికి  ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్ మథ్య  పెరిగిన దూరమే కారణమంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇరువురూ ఒకరికి ఒకరు ఎదురు పడటానికి కూడా ఇష్ట పడనంతగా వారి మధ్య  దూరం పెరగడమే కారణమని ఆ వర్గాలు అంటున్నాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం అసెంబ్లీలో మంగళవారం (సెప్టెంబర్ 13)ప్రవేశ పెట్టిన బిల్లులన్నీ సోమవారం(సెప్టెంబర్ 12)  ప్రవేశపెట్టాల్సి ఉందనీ, అయితే తండ్రీ కొడుకుల మధ్య ఒకరికొకరు ఎదురు పడటానికి ఇష్టపడనంతగా ఎడం పెరిగిన నేపథ్యంలో సోమవారం కేటీఆర్ సభకు వచ్చి కొద్ది సేపటికే వెళ్లిపోవడం, ఆ తరువాత కేసీఆర్ తన ప్రసంగం సోమవారమే పూర్తి చేసి మంగళవారం సభకు గైర్హాజరు కావడం ఇందుకు తార్కాణంగా పరిశీలకులు చెబుతున్నారు.

ఆ కారణంగానే సోమవారం సభలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు ఎటూ ఆమోదం పొందుతాయన్న విశ్వాసంతో  సోమవారం తేదీతోనే గెజిట్ నోటిఫికేషన్ తయారు చేసేశారనీ,  అయితే అనూహ్యంగా సోమవారం కేసీఆర్ ప్రసంగానికే సభ పరిమితం కావడం.. బిల్లులను  మంగళవారం సభలో ప్రవేశపెట్టడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటున్నారు. మొత్తం మీద సభా నియమాలకూ, నిబంధనలకు తిలోదకాలిచ్చి తెరాస ప్రభుత్వం శాసన  సభ నిర్వహణను ఒక ప్రహసనంగా మార్చేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

By
en-us Political News

  
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.