వల్లభనేని వంశీ అరెస్టు

Publish Date:Feb 12, 2025

Advertisement

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ లో వల్లభనేని వంశీని అరెస్టు చేసిన పోలీసులు ఆయనను విజయవాడ తరలిస్తున్నారు. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో నిందితుడైన వల్లభనేని వంశీని ఆ కేసులో కాకుండా సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి బెదరించిన కేసులో అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ, ఆయన అనుచరులు తనను కులం పేరుతో దూషించి, కార్యాలయంపై దాడి చేశారంటూ ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ ఆ తరువాత ఈ కేసుకూ తనకూ ఎటువంటి సంబంధం లేదనీ చెప్పారు. సత్యవర్ధన్ తెలుగుదేశం కార్యాలయంలో డీటీపీ ఆపరేటర్ గా పని చేసిన సత్యవర్ధన్ ఈ కేసుతో తనకు సంబంధం లేదంటూ కోర్టులో అఫడవిట్ కూడా దాఖలు చేయడంతో ఈ కేసు వీగిపోయినట్లేనని అంతా భావించారు.

అయితే పోలీసులు సత్యవర్ధన్ ను విచారించి..వల్లభనేని వంశీ ఆయనను కిడ్నాప్ చేసి బెదరించినట్లు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదరించిన కేసులో పోలీసులు వల్లభనేని వంశీని అరెస్టు చేశారు. హైదరాబాద్ లో అరెస్టు చేసిన పోలీసులు ఆయనను విజయవాడ తరలిస్తున్నారు. వల్లభనేని వంశీని గన్నవరం పోలీసు స్టేషన్ కు తీసుకువచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. గన్నవరం పోలీసు స్టేషన్ పై దాడి కేసులో వల్లభనేని వంశీ ముందస్తు బెయిలు పిటిషన్ పై ఈ నెల 20న తీర్పు వెలువడనుంది. అయితే ఇప్పుడు వంశీని ఆ కేసులో కాకుండా కిడ్నాప్ కేసులో అరెస్టు చేశారు.  

By
en-us Political News

  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఇప్పటికీ లాంగ్ కొవిడ్ తీవ్ర దుష్ప్రభావాలతో సతమతమవుతున్నారు.
సంతానం కలగలేదన్న కారణంతో భార్యను తప్పుబడుతూ విడాకులు కోరలేరని మద్రాసు హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
శారీరక వైకల్యాన్ని జయించి..అమెజాన్‌లో కొలువు కొట్టిన నిట్ గ్రాడ్యుయేట్.!
వాతావరణ మార్పుల ఎఫెక్ట్: కిడ్నీ ఆరోగ్యంపై షాకింగ్ రిపోర్ట్.!
బతుకమ్మ సంబరాల నుంచి ఇంటికి వెళ్తుండగా విషాదం.!
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం తెలుగు రాష్ట్రాల్లో ఒక కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది.
భారత యువ క్రికెటర్ పృథ్వీ షా, నటి ఆకృతి అగర్వాల్ వ్యక్తిగత జీవితంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్‌మెంట్స్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది.
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరో అవినీతి బాగోతాన్ని వెలుగులోకి తెచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.