పాకిస్థాన్ లాహోర్‌లో విదేశీ మహిళలపై సామూహిక అత్యాచారం కేసులో ఆ దేశ ఉప ప్రధాని సమీప బంధువు అరెస్టు కావడం సంచలనంగా మారింది. వ్యాపార పెట్టుబడుల పేరుతో నమ్మించి, విదేశాల నుంచి మహిళలను రప్పించి, వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఉదంతం ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ అమానుష కాండలో పాకిస్థాన్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి అయిన ఇషాక్ దార్ సమీప బంధువు ప్రధాన నిందితుడిగా ఉండటం పాక్ రాజకీయాల్లో దుమారం రేపుతోంది.
బాధితుల్లో ఒకరు నెదర్లాండ్స్‌కు చెందిన మహిళ కాగా, మరొకరు వెనిజువేలా జాతీయురాలు. గత ఏడాది అక్టోబర్‌లో సింగపూర్‌లో వీరికి ప్రధాన నిందితుడైన మహ్మద్ రజా దార్‌తో పరిచయం ఏర్పడింది. వీరంతా క్రిప్టోకరెన్సీ వ్యాపార రంగంలో భాగస్వాములుగా మారారు. ఈ వ్యాపారాన్ని మరింత విస్తరింపజేద్దామనే నెపంతో రజా దార్ వారిని పాకిస్థాన్‌కు ఆహ్వానించాడు. కేవలం మాటలతోనే సరిపెట్టకుండా.. నమ్మకం కుదిరేలా వారికి అధికారికంగా బిజినెస్ వీసాలు కూడా స్వయంగా ఏర్పాటు చేశాడు. దీంతో అతడిని నమ్మిన ఆ ఇద్దరు మహిళలు జూన్ 29న లాహోర్ విమానాశ్రయం చేరుకున్నారు.అయితే.. వారు లాహోర్ లో అడుగుపెట్టిన తరువాతయ రజా దార్ తన నిజ స్వరూపాన్ని బయటపెట్టాడు. తన స్నేహితులతో కలిసి విమానాశ్రయం వెలుపల నుంచే ఆ ఇద్దరు మహిళలను కిడ్నాప్ చేసి.. వారిని లాహోర్‌లోని ఒక రహస్య గృహంలో బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రాణాలతో విడుదల కావాలంటే భారీ మొత్తంలో డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బ్లాక్‌మెయిల్‌కు దిగారు. బాధితులు తీవ్రమైన భయాందోళనల మధ్య నరకయాతనను అనుభవించారు.ఈ భయంకరమైన నేరం వెలుగులోకి రావడానికి ఒక అంతర్జాతీయ ఫోన్ కాల్ కారణమైంది. బందీలుగా ఉన్న మహిళల్లో ఒకరు చాకచక్యంగా తన తండ్రికి సమాచారం అందించగా.. ఆయన వెంటనే స్పెయిన్ నుండి లాహోర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన లాహోర్ పోలీసులు రంగంలోకి దిగి, ఆ రహస్య స్థావరంపై దాడి చేసి మహిళలను రక్షించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన పాక్ ఉప ప్రధాని బంధువు మహ్మద్ రజా దార్‌తో పాటు అతని ముఠా సభ్యులు హసన్ రజా, సికందర్ ఖాన్, సాజిద్ అలీలను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఐదుగురు నిందితుల్లో నలుగురిని అరెస్ట్ చేసి లాహోర్ కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి ఐదు రోజుల రిమాండ్ విధించింది. కోర్టు విచారణ సమయంలో బాధితులు ప్రధాన నిందితుడు రజా దార్‌ను స్పష్టంగా గుర్తించారు. పరారీలో ఉన్న ఐదో నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Teluguone, Pakistan gang rape case, Lahore foreign women layout, Deputy PM Ishaq Dar relative arrested,
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/gang-rape-on-foreign-women-in-lahore-36-225008.html
తమిళనాడుకు చెందిన నవనీతమ్మ తిరుపతిలోనే నివసిస్తున్నారు. శనివారం జులై 4)ఆమె కాలినడకన తిరుమల శ్రీవారి కొండను అధిరోహిస్తున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఆమె అచంచల భక్తి విశ్వాసాలకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడు ఫిదా అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పారిశ్రామిక హబ్ శ్రీసిటీ లో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యుల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నందుకు షోలమ్ గ్రూప్ యాజమాన్యానికి ధ్యాంక్స్ చెప్పిన లోకేష్.. ఈ ప్లాంట్‌కు సంబంధించిన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తిని ప్రారంభించాలని కోరారు.
రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. 16 వేల350 కోట్లరూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ఉక్కు కర్మాగారంతో పాటు దానికి అనుబంధంగా రాబోయే గ్రీన్ ఎనర్జీ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులను కూడా ఆయన ప్రారంభించారు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ నాట్ బ్రంట్ అసాధారణ పోరాట పటిమను కనబరిచి.. కేవలం 53 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఫ్రేయా కెంప్ కూడా 28 బంతుల్లోనే 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.
బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్దం చేసుకున్న తారిఖ్.. దుండగుడిని గట్టిగా ప్రతిఘటించాడు. దీంతో ఆ దుండగుడు తుపాకీతో తాఱీఖ్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తారిఖ్ అక్కడికక్కడే మరణించాడు.
ఆందోళనకారులపై పోలీసులు, రేంజర్లు.. టియర్ గ్యాస్ షెల్లింగ్, కాల్పులకు తెగబడ్డారు. అన్బ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మహ్మద్ యాకూబ్ అనే సామాన్య పౌరుడు మరణించాడు. మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
క్షణ విషయంలో నాటో సభ్య దేశాలు అమెరికాపై అతిగా ఆధారపడే విధానానికి స్వస్తి పలకడం కోసమే ట్రంప్ ఈమాండ్ తెరపైకి తీసుకువచ్చారని శ్వేత సౌధ సీనియర్ అధికారులు చెబుతున్నారు. ==
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఒక మండుతున్న అగ్నిపర్వతంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28 అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
యుద్ధనౌకకు సంబంధించిన ప్రధాన నావికాదళ ఫిరంగులు, ఆటోమేటిక్ గన్నులు, రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్‌ల పనితీరును కూడా కిమ్ స్వయంగా పరిశీలించి ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్‌తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.