కళకళ లాడుతున్న గాంధీ భవన్!

Publish Date:Jun 29, 2023

Advertisement

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి హైదరాబాద్ లోని గాంధీ భవన్ కళకళలాడుతూ కనిపిస్తోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏపీలో నామరూపాల్లేకుండా పోయిన కాంగ్రెస్  తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించి కూడా తెలంగాణలో తీవ్రంగా దెబ్బతిన్నది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు తోడు కేసీఆర్ మార్క్ రాజకీయాలతో కాంగ్రెస్ పార్టీ నుండి నేతలు వలసెళ్లిపోయారు. తనకు రాష్ట్రంలో పోటీనే లేకుండా చేసుకొనే క్రమంలో కేసీఆర్ కాంగ్రెస్ ను దెబ్బతీశారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వ లోపం కూడా తోడై తెలంగాణలో పార్టీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణ ఆవిర్భావం తర్వాత వచ్చిన రెండు అసెంబ్లీ, రెండు పార్లమెంటు ఎన్నికల్లోనూ పేలవమైన ఫలితాలతో కాంగ్రెస్ చతికిల పడింది. ఆ పార్టీ నేతలు కూడా చప్పబడ్డారు.

అదే సమయంలో రాష్ట్రంలో బీజేపీ ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రయత్నించింది. అందులో కొంతమేర సక్సెసై పార్టీ క్యాడర్ తో పాటు నేతలను పెంచుకుంది. అయితే, ఇప్పుడు కర్ణాటక ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది. కాంగ్రెస్ నేతలలో కూడా మునుపెన్నడూ లేని విధంగా హుషారు కనిపిస్తున్నది. హైకమాండ్ కూడా అందుకు తగ్గట్లే తెలంగాణ రాష్ట్రంపై స్పెషల్ ఫోకస్ పెట్టడంతో నేతల చేరికలు మొదలయ్యాయి. మరోవైపు హైదరాబాద్ టూ ఢిల్లీ కాంగ్రెస్ నేతల రాకపోకలూ పెరిగిపోయాయి. అదే సమయంలో వచ్చే నేతలు, పోయే నేతలు, సమావేశాలు, సంప్రదింపులతో హైదరాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ బిజీబిజీగా కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్నది తెలియదు కానీ ఇప్పుడైతే గాంధీ భవన్ కళకళలాడుతూ కనిపిస్తుంది. 

కర్ణాటక ఫలితాలను అడ్వాంటేజ్ గా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టి ఇతర పార్టీల నుండి వచ్చే వారికి రెడ్ కార్పెట్ పరిచింది. ఇతర పార్టీల నేతలను ఆకర్షించటమే కాకుండా కాంగ్రెస్ నుండి వెళ్ళిపోయిన నేతలను తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఘర్ వాపసీ పిలుపునిచ్చారు. మరోవైపు ఢిల్లీలో రాహుల్ గాంధి సమక్షంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చేరటంతో పార్టీకి ఊపొచ్చినట్లయ్యింది. ఇదే ఊపులో మరికొందరిని పార్టీలోకి లాగేందుకు పార్టీ పెద్దలు వ్యూహాలు ప్రతివ్యూహాలు పన్నుతున్నారు. జరుగుతున్న ప్రచారం నిజమే అయితే తొందరలోనే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, ఈటల, విజయశాంతి, కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి ప్రముఖ నేతలు కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. 

దీంతో ఎటు తిరిగీ ఉదయం నుండి సాయంత్రం వరకు నేతల రాకతో గాంధీ భవన్ సందడి సందడిగా కనిపిస్తున్నది. కారణం ఏదైనా కానీ ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో నమ్మకం పెరిగింది. కర్ణాటకలో హిందూత్వ అజెండా అందుకున్న బీజేపీ ఓటమిని ఇక్కడ కూడా హైలెట్ చేయడం, అదే సమయంలో హామీల అమల్లో విఫలమైన కేసీఆర్ అనే అంశాలతో ఈసారి కాంగ్రెస్ నేతలు ప్రజల మధ్యకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తంగా చూస్తే.. తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త ఊపు.. గాంధీ భవన్ కు కొత్త కళ వచ్చాయని అంటున్నారు పరిశీలకులు. అయితే, ఇదే టెంపోను రాష్ట్ర పార్టీ ఎన్నికల వరకు కొనసాగించగలరా? నేతల మధ్య ఆధిపత్య పోరు ఆగిపోతుందా? పాత నేతలు, కొత్త నేతల మధ్య సంఖ్యత కుదురుతుందా అన్నది చూడాల్సి ఉంది.

By
en-us Political News

  
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.