జగన్ లో పీక్స్ కి చేరిన ఫ్రస్ట్రేషన్.. పదవుల నుంచి తొలగిస్తానంటూ మంత్రులకు వార్నింగ్

Publish Date:Sep 7, 2022

Advertisement

సొంత పార్టీలోనే తనకు మద్దతు కరవైందని జగన్ భావిస్తున్నారా? అంటే ఆయన మాటలను బట్టి చూస్తే ఔననే అనాల్సి వస్తున్నది. బుధవారం ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. కేబినెట్ లో ఏం చర్చించారు. ఏం నిర్ణయాలు తీసుకున్నారు అన్నది పక్కన పెడితే.. కేబినెట్ భేటీ తరువాత జగన్ తన మంత్రి వర్గ సహచరులతో మాట్లాడిన మాటలు ఆయన ఎంత ఫస్ట్రేషన్ లో ఉన్నారన్నది తేటతెల్లం చేసింది.

కేబినెట్ సహచరులు, ఎమ్మెల్యేలు ఎవరూ తనకు మద్దతుగా నిలవడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో తన సతీమణి భారతిపై తెలుగుదేశం నాయకులు ఆరోపణలు చేస్తున్నా మంత్రులు, ఎమ్మెల్యేలూ ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయన అసహనం, ఆవేదన వ్యక్తం చేశారు. తన సతీమణిపై విపక్ష నేతల ఆరోపణలను ఎవరూ దీటుగా ఖండించలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విపక్ష విమర్శలకు ఎప్పటికప్పుడు దీటుగా బదులివ్వాలని విస్పష్ట ఆదేశాలిచ్చారు. అలా చేయని మంత్రులను మార్చేస్తాను, ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ ఇవ్వనని హెచ్చరించారు. కేబినెట్ సమావేశం తరువాత మంత్రులతో మాట్లాడిన జగన్ ప్రధానంగా తన సతీమణి భారతిపై లిక్కర్ స్కాం విషయంలో విపక్షాలు చేసిన ఆరోపణలనే ప్రధానంగా ప్రస్తావించారు.

తెలుగుదేశం విమర్శలను, ఆరోపణలను తిప్పి కొట్టే విషయంలో ఎవరూ సరిగా స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షంతో తానొక్కడినే పోరాడుతున్నాననీ, ఎవరూ పట్టించుకోవడం లేదనీ నిష్టూరమాడారు. ఇక ముందు ఇలా జరిగితే సహించనని వార్నింగ్ కూడా ఇచ్చారు. మంత్రులను మార్చేయడానికి కూడా వెనుకాడనని విస్పష్ట హెచ్చరిక చేశారు. ఒక్క విపక్షంపైనే కాదు.. వైసీపీ ప్రభుత్వానికీ, పార్టీకి వ్యతిరేకంగా వార్తలు ప్రచురించే మీడియా మీద కూడా ఎదురుదాడికి దిగాలని స్వయంగా జగన్ తన కేబినెట్ సహచరులకు పిలుపు నిచ్చారు.

జగన్ మంత్రులకు తీసుకున్న క్లాస్ ప్రభావమో ఏమో కానీ ముఖ్యమంత్రి సతీమణిపై విమర్శలేమిటంటూ బొత్స మీడియా ముందు విపక్షాలపై విమర్శలు చేశారు. అయినా జగన్ క్లాస్ తీసుకున్నారని కాదు కానీ ఇటీవలి కాలంలో వైసీపీ నేతలు చాలా వరకూ సైలెంటైపోయారని పరిశీలకులు సైతం అంటున్నారు. ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉండటం,  ఆఖరికి జగన్ సభలకు కూడా జనం హాజరు తక్కువైపోవడం ఆ వచ్చిన వారిలో కూడా చాలా మంది జగన్ ప్రసంగం మధ్యలోనే లేచి వెళ్లిపోవడం వంటి సంఘటనలతో వైసీపీ నేతలు చాలా వరకూ సైలంట్ అయిపోయారు.

మరీ ముఖ్యంగా గడపగడపకూ మన ప్రభుత్వంలో ఎదురైన నిరసన సెగలకు మంత్రులు కూడా చాలా వరకూ విపక్షంపై విమర్శల జోలికి వెళ్లకుండా జాగ్రత్తపడుతున్న పరిస్థితి. అదీ కాక జగన్ దృష్టిలో పడాలంటే మామూలుగా విపక్ష నేతలను విమర్శిస్తే సరిపోదు. విమర్శల తీవ్రత బూతుల స్థాయిలో ఉండాలి. అందుకు ప్రస్తుత పరిస్థితుల్లో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ సిద్ధంగా లేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే జగన్ మంత్రి వర్గ సహచరులతో భేటీలో అసహనం వ్యక్తం  చేశారు. వాస్తవానికి పోతుల సునీత లాంటి వాళ్లు.. చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులను బండబూతులు తిడుతూ ప్రెస్ మీట్లు పెట్టినా వాటిని ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు.ఇక మహిళా మంత్రులు  రోజా, అనిత, విడదల రజనీ లాంటి వాళ్లు జగన్ సతీమణి భారతిపై విపక్షం విమర్శలపై పెద్దగా స్పందించలేదు. ద్దగా స్పందించలేదు. మంత్రోరులు జా, అనిత విదేశీ టూర్‌లో ఉన్నారు. వారిరువురిలో రోజా అయితే కేబినెట్ మీటింగ్ సమయానికి వచ్చారు. విడదల రజనీ విషయానికి వస్తే   సోషల్ మీడియాలో తన గురించి ప్రచారం చేసుకోవడం మినహా   టీడీపీపై విమర్శలు చేయడానికి అస్సలు ముందుకు రారని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.

By
en-us Political News

  
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.