మూడు రాజధానుల రాజకీయం ఎత్తిపోయిందా? ఉత్తరాంధ్ర మంత్రుల్లో ఫ్రస్టేషన్ కు అదే కారణమా?

Publish Date:Oct 7, 2022

Advertisement

ప్రజాభీష్టాన్ని కాదని ముందుకు వెళితే ఏం జరుగుతుందో ఇప్పుడు వైసీపీ పరిస్థితి చూస్తే అర్ధమౌతుంది. గత ఎన్నికలకు ముందు అమరావతే ఏపీ రాజధాని అని అసెంబ్లీ సాక్షిగా మద్దతు పలికిన వైసీసీ ఇప్పుడు మూడు రాజధానులంటూ మాట మార్చడాన్ని రాష్ట్రం మొత్తం వ్యతిరేకిస్తోంది. అమరావతే ఏపీ ఏకైక రాజధాని అని నినదిస్తూ మహాపాదయాత్ర చేస్తున్న రైతులకు అన్ని ప్రాంతాల నుంచీ వెల్లువెత్తుతున్న మద్దతుతో వైసీపీ అధినేత మైండ్ బ్లాక్ అయినట్లు కనిపిస్తోంది. ఎలాగైనా యాత్రను అడ్డుకోండంటూ ఆయన మంత్రులు, పార్టీ శ్రేణులకు ఆదేశాలిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. దీంతో సీనియర్ మంత్రులు కూడా సంయమనం కోల్పోయి మాట్లాడుతున్నారు.

మూడు రాజధానుల రాజకీయం ఎత్తిపోయిందా? రైతుల మహాపాదయాత్ర వైసీపీ నేతల్లో గుబులు రేపుతోందా? రైతుల మహాపాదయాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా లభిస్తున్న ఆదరణ జగన్  , ఆయన కేబినెట్ సహచరులను గాభరా పెడుతోందా? అన్న ప్రశ్నలకు పరిశీలకుల నుంచి ఔననే సమాధానం వస్తోంది. రైతుల మహాపాదయాత్ర సాగుతున్న కొద్దీ.. మూడు రాజధానులకు వ్యతిరేకంగా జనం గళమెత్తుతున్నారు. గతంలో కంటే బలంగా వారు తమ వాణిని వినిపిస్తున్నారు.

యాత్రకు వ్యతిరేకంగా  వైసీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లను ఎవరూ పట్టించుకోవడం లేదు. దీనికి తోడు వాడవాడలా మహాపాదయాత్రకు లభిస్తున్న స్పందన వైసీపీ వర్గాల్లో ఫ్రస్ట్రేషన్ కు కారణమౌతోంది. దాంతో వైసీపీలో ఎంతో కొంత అనుభవం ఉన్న మంత్రులు కూడా సంయమనం కోల్పోయి మాట్లాడుతున్నారు. మంత్రులు బొత్స, అమర్నాథ్ లు అయితే కొడాలి నాని భాషను అరువు తెచ్చుకుని మరీ మాట్లాడుతున్నారు. వారి ఈ వైఖరే మూడు రాజధానుల పట్ల ప్రజలలో వ్యక్తమౌతున్న వ్యతిరేకతను ఎత్తి చూపుతోంది. రాష్ట్రం మొత్తం అమరావతే ఏకైక రాజధాని అని ముక్తకంఠంతో నినదిస్తున్నదన్న విషయం రైతుల మహాపాదయాత్ర సాగుతున్న కొద్దీ ప్రస్ఫుటమౌతోంది.

దీంతో దిక్కు తోచని స్థితిలో పడ్డ వైసీపీ అధీష్టానం పార్టీకి చెందిన ఉత్తరాంధ్ర నేతలపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తోంది. దాని పర్యవశానమే బొత్స రైతులను దోపిడీ దారులు అనడం అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రైతుల మహాపాదయాత్రను బొత్స దోపిడీ దారుల మహాయాత్రగా అభివర్ణించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమౌతోంది. పాదయాత్ర ఉత్తరాంధ్రకు చేరువ అవుతున్న కొద్దీ.. దానిని ఎలాగైనా అడ్డుకోవాలన్న తపన, తాపత్రేయం వైసీపీలో ఎక్కువ అవుతోంది.

రెచ్చగొట్టి ఏదో ఒకటి చేసి రైతుల మహాపాద్రయాత్రను నిలిపివేయాలన్న తహతహ కనిపిస్తోంది. అందుకే విశాఖ వస్తే రైతుల కాళ్లు విరగ్గొడతాం, తరిమి కొడతాం అంటూ ప్రేలాపనలకు దిగడానికి కూడా వైసీపీ మంత్రులు, నేతలు వెనుకాడటం లేదు. మహాపాదయాత్రకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న  రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులను పట్టించుకునే నాథుడే కనిపించడం లేదు. మూడు రాజధానులంటూ అధికారంలోకి వచ్చిన కొత్తలో వైసీపీ ప్రకటించినప్పుడు కొద్దొ గొప్పో ఉత్తరాంధ్రలో సానుకూలత కనిపించింది. కానీ ఇప్పుడు ఆ సానుకూలత అంతా ఆవిరైపోయిందని అంటున్నారు. ప్రశాంతంగా ఉండే విశాఖలో నేరాలు పెరిగిపోవడం, భూ కబ్జాలు, దౌర్జన్యాలూ పెచ్చరిల్లడంతో విశాఖ వాసులు కూడా అమరావతికే జై కొడుతున్న పరిస్థితి ప్రస్ఫులంగా కనిపిస్తోంది.

అందుకే వైసీపీ నుంచి రెచ్చగొట్టే విధంగా ఎన్ని ప్రకటనలు వచ్చినా ఎవరూ స్పందించడం లేదంటున్నారు.  ఇక వైసీపీ నేతలు మూడు రాజధానులపై చర్చ కోసం చేస్తున్న ప్రయత్నాలన్నీ ప్రహసనాలుగా మారిపోతున్నాయి.  ఇక వైసీపీలోకి కింది స్థాయి క్యాడర్ కూడా మూడు రాజధానుల అంశాన్ని సీరియస్ గా తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. అక్కడక్కడ అమరావతి రైతుల మహాపాదయాత్రకు వ్యతిరేకంగా పోస్టర్లు, ఫ్లెక్సీలూ ఏర్పాటు చేయడం వినా మూడు రాజధానులకు మద్దతుగా వారి నుంచి ఎటువంటి ప్రయత్నం, కార్యక్రమాలు ఉండటం లేదు. హై కమాండ్ హుంకరిస్తేనే ఇక తప్పదన్నట్లు స్థానిక రైతులు అమరావతికి వ్యతిరేకంగా నినాదాలు చేసి మహాయాత్రలో ఉద్రిక్తతలు సృష్టించేందుకు అరకొర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ తరువాత కామ్ అయిపోతున్నారు.

ప్రజా నిర్ణయానికి వ్యతిరేకంగా నిలబడితే రాజకీయ భవిష్యత్ ఉండదన్న భయం వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. అదే సమయంలో  అమరావతి రైతులు   అందరి మద్దతుతో  ముందుకు సాగుతున్నారు. అమరావతి రైతులకు ఈ స్థాయి మద్దతు వస్తుందని వైసీపీ నేతలు మహాపాదయాత్రకు ముందు ఊహించలేదు. రైతులకు టీడీపీ, జనసేన సహా అన్ని పార్టీలు  ప్రజాసంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఒక్క వైసీపీ మాత్రమే వ్యతిరేకిస్తోంది. అయితే  ఒకప్పుడు అమరావతికి మద్దతు పలికి… ఇప్పుడు మడమ తిప్పిన వైసీపీ వ్యతిరేకతను జనం ఇసుమంతైనా లెక్క చేయని పరిస్థితే రాష్ట్రమంతటా కనిపిస్తోంది.   వైసీపీ తీరుపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. ఆ వ్యతిరేకతకు దడిసే మహాపాదయాత్ర మార్గంలో వైసీపీ శ్రేణులు అడ్డకోవడానికి ప్రయత్నించే సాహసం చేయడం లేదు. వైసీపీ అధిష్ఠానం మెప్పు కోసం ఏదో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే చేసేమన్నట్లుగా చేసి మమ అనిపిస్తున్నారు.   

By
en-us Political News

  
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.