జగన్ ను భయం వెంటాడుతోందా?

Publish Date:Oct 25, 2024

Advertisement

జగన్ ను భయం వెంటాడుతోందా? ఓ పక్క కేసుల భయం, మరో పక్క అరెస్టు భయంతో జగన్ వణికిపోతున్నారా?  అంటే జగన్ చేష్టలూ, మాటలను బట్టి ఔననే అనుకోవలసి వస్తోందని పరిశీలకులు అంటున్నారు. ముఖ్యంగా సోదరి షర్మిలతో ఓ వైపు రాయబేరాలు నెరపుతూనే మరో పక్క ఆమెపై నేషనల్ లా ట్రైబ్యునల్ లో పిటిషన్ వేయడం ద్వారా తన మానసిక స్థితి సరిగా లేదని ఆయనకు ఆయనే చెప్పుకుంటున్నారని అంటున్నారు.

ఇక ఈ నేపథ్యంలోనే షర్మిలతో రాయబారాలకు ప్రయత్నిస్తూనే, ఆమెకు ఆమె వాటా ఆస్తులు ఇచ్చేస్తామంటూనే ఆమె తనగురించి, తన భార్య గురించి మాట్లాడడం మానేయాలని షరతు విధించారు. ఆ షరతు వరకూ అయితే పెద్దగా ఎవరికీ, ఆఖరికి షర్మిలకు కూడా అభ్యంతరం ఉండకపోవచ్చు కానీ, దానితో పాటుగా ఆయన పెట్టిన మరో కండీషనే జగన్ రెడ్డిలోని భయాన్ని ఎత్తి చూపిందంటున్నారు.   షర్మిల అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా కూడా ఎటువంటి వ్యాఖ్యలూ చేయకూడదన్నదే ఆ మరో కండీషన్. 

గత నెలలో జగన్ రెడ్డి తన తల్లి సోదరి, చెల్లి షర్మిలతో సయోధ్య కోసం చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఓ లేఖ రాశారు. ఆ లేఖలో సయోధ్య కుదరాలంటే తనపైనా, తన భార్య భారతిపైనా ఎటువంటి విమర్శలూ చేయకూడదన్న షరతు విధించారు. అక్కడితో ఆగకుండా  షర్మిల వైఎస్ అవినాష్ రెడ్డిపై కూడా ఎటువంటి విమర్శలూ చేయకూడదన్న షరతు కూడా పెట్టారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న, కీలక నిందితులలో ఒకడిగా ఉన్న అవినాష్ రెడ్డిపై షర్మిల విమర్శించకూడదంటూ జగన్ విధించిన షరతును షర్మిల అంగీకరించలేదని అంటున్నారు. దాంతోనే షర్మిల, తల్లి విజయమ్మలపై నేషనల్ ట్రైబ్యునల్ లో పిటిషన్ వేశారని అంటున్నారు.

అయినా జగన్ సొంత తల్లి, చెల్లి కంటే సవతి సోదరుడు అవినాష్ రెడ్డికి అంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారు. సోంత బాబాయ్ హత్య కేసులో నిందితుడిగా ఉండి ప్రస్తుతం బెయిలుపై ఉన్న అవినాష్ రెడ్డి పట్ల జగన్ కు అంత అక్కర ఎందుకు అన్న ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నమౌతాయి.  ఇప్పటికే  వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డికి వత్తాసు పలుకుతున్న జగన్ రెడ్డి ప్రతిష్ఠ సొంత ఇలాకాలోనే మసకబారింది.  జనం వివేకా హత్య కేసు సూత్రధారి అవినాష్ రెడ్డే అని నమ్ముతున్నారు. అయితే జగన్, భారతి మాత్రం ఈ కేసులో  సీబీఐ దర్యాప్తు అవినాష్ తో ఆగదనీ, తమ వరకూ వస్తుందన్న ఆందోళనలో ఉన్నారు. అందుకే ఎలాగైనా అవినాష్ ను కాపాడాలని చూస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
జగన్‌లో మార్పు వుంటుందా, వుండదా అన్న అయోమయంలో వైసీపీ నేతలు.. ఆయనలో మార్పు వుండదన్న నిశ్చయానికి వచ్చేస్తున్నారు.
రాజకీయాల్లో విజయం అనేది కేవలం నాయకుల ఉపన్యాసాల వల్ల మాత్రమే సాధ్యం కాదు. అధికారం, రాజకీయ వేధింపులు, ఆంక్షలు ఎన్ని ఎదురైనా వెరవక
అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పరిధిలో దాదాపు రూ. 7.5 కోట్ల విరాళాల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలపై పార్లమెంట్‌ ద్వారం వద్ద స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ కాషాయ వస్త్రాలు ధరించి, పూజారి వేషంలో ఒక పెద్ద హుండీతో కూర్చుని సేకరించిన విరాళాలను జేబులో వేసుకుంటూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.
నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే విశాఖను గ్లోబల్ ఐటీ, ఇండస్ట్రియల్ హబ్‌గా మార్చాలనే ఆలోచనతో ఈ భోగాపురం ప్రాజెక్టుకు చంద్రబాబు బీజం వేశారనీ, అయితే.. కాలక్రమంలో ప్రభుత్వాలు మారాయి, ప్రాజెక్టు ప్రతిపాదనలు మడతపడ్డాయన్నారు.
సిదిరి అప్పలరాజు కుమారుడు బైక్ నిర్లక్ష్యంగా నడిపి ఒకరి మృతికి కారణమయ్యారన్న కేసు దర్యాప్తులో వెలుగు చూసిన అంశాల మేరకు ఇందులో ఎలాంటి రాజకీయ కుట్రలు లేవు. సీదిరి అప్పలరాజు చేసిన అతే.. ఆయనను చట్టపరంగా ఇబ్బందుల్లోకి నెట్టింది.
ఎప్పుడో ఓ సారి జైల్లో ఉన్న నేతకు పరామర్శ పేరుతో బయటకు వచ్చే సందర్భాలలో కూడా సదరు నేతను పరామర్శించడం కంటే.. బల ప్రదర్శనకు, తనకు జనం మద్దతు ఉందని నిరూపించుకునే ప్రదర్శనలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన అలా బయటకు వచ్చిన ప్రతి సారీ అభాసుపాలౌతూనే ఉన్నారు.
ఢిల్లీ వీధుల్లో రగిలిన ఆగ్రహ జ్వాలలు, పోలీసుల లాఠీఛార్జీలు, కన్నీటి ధారలు, నిర్బంధాలను సైతం లెక్కచేయక హక్కుల కోసం వీధిపోరాటానికి దిగిన యువత ఆక్రందనలు
రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ అమూల్యమైన భూములను ఇవ్వద్దు, భోగాపురం విమానాశ్రయాన్ని అందరం కలిసి అడ్డుకుందాం" అంటూ జగన్ ఇచ్చిన పిలుపుల ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతూ భోగాపురం విషయంలో జగన్ ద్వంద్వ వైఖరిని ఎండగడుతున్నాయి.
తెలుగుదేశం కూమిటికి ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. చంద్రబాబు నాయకత్వంలో కూటమి సర్కార్ సంక్షేమ, అభివృద్ధిని సమాంతరంగా పరుగులు పెట్టిస్తున్నప్పటికీ ఆ స్థాయిలో ప్రజాదరణ పెరగడం అటుంచి.. క్షేత్రస్థాయిలో కూటమి పాలన పట్ల ఒకింత అసంతృప్తి పె రిగిందని సర్వే స్పష్టం చేయడమే.
మొత్తంగా విద్యార్థులు, యువతఉద్యమం.. ఒక స్పష్టమైన సందేశాన్ని అయితేనిస్సందేహంగా ఇచ్చింది. అన్యాయాన్ని ప్రశ్నించడంలో, హక్కుల కోసం పోరాడటంలో , న్యాయం కోసం నినదించడంలో వెనకడుగు వేసే ప్రశ్నేలేదని చాటింది.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కర్నూలు జిల్లా ఆదోని పట్టణ, మండల టీడీపీ నేతలు పని చేయాలని
నీట్ పేపర్ లీక్ ఆందోళనలతో దిల్లీ వీధులను ఊపేసిన బొద్దింకలు ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద రైతు నాయకుడు రాకేష్ తికాయత్‌ను కలిసి సంఘీభావం ప్రకటించాయి.
మాజీ మంత్రి జోగి రమేష్ తనపై చేస్తున్న ఆరోపణలనుఖండించిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్.. జోగి రమేష్ కు ఎటువంటి క్రెడిబులిటీ లేదనీ, అతను ఏదోదో మాట్లాడతారనీ, అవన్నీ పట్టించుకోవలసిన అవసరం లేదని చెప్పారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.