Publish Date:Oct 24, 2024
ఆంధ్రప్రదేశ్ లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి, అలాగే ప్రధాన నగరాలతో కనెక్టివిటీ పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నాలుగు గ్రీన్ ఫీల్డ్ హైవేలు నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. దాదాాపు 45 వేల 300 కోట్ల వ్యయంతో వీటి నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రధాన నగరాల మధ్య కనెక్టివిటీ లక్ష్యంగా వీటి నిర్మాణం ఉంటుందన్నారు. ముందుగా హైదరాబాద్ మచిలీపట్నంను కనెక్ట్ చేసేలా 18 వేల కోట్లతో గ్రీన్ ఫీల్డ్ హైవేను నిర్మిస్తామన్నారు.
జగన్ అరాచకపాలనలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలూ అధ్వానంగా మారాయన్నారు. రోడ్డు, రవాణా వ్యవస్థ కూడా నాశనమైందన్నారు. ఇక జగన్ నిర్వాకం వల్ల రాష్ట్రంలో 15 ప్రాజెక్టులు నిలిచిపోయాయని.. 70 ప్రాజెక్టులకు భూసేకరణ సమస్యలు, 21 ప్రాజెక్టులకు అటవీ భూముల సమస్యలు, 3 ప్రాజెక్టులకు టోల్‌ప్లాజా సమస్యలు ఉన్నాయని వివరించారు. మరో ఆరు ప్రాజెక్టులు బిడ్డింగ్ దశలో ఉన్నాయని చెప్పిన ఆయన వీటన్నిటినీ మూడు నెలల వ్యవధిలో సరిచేస్తామని చెప్పారు.
అదే విధంగా లాజిస్టిక్ హబ్ గా ఏపీ మారనుందన్న ఆయన ఏపీకి మరో మూడు పోర్టులు రానున్నాయన్నారు. అక్వా, హార్టీ కల్చర్ ఎగుమతులు గణనీయంగా పెరుగుతాయని అన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మరింత మెరుగ్గా, ఎఫెక్టివ్ గా ఉండాలని చంద్రబాబు చెప్పారు. అధికారులు ఆ దిశగా మరింత వేగంగా చురుకుగా పని చేయాలని దిశానిర్దేశం చేశారు. జగన్ హయాంలో విధ్వంసానికి కేరాఫ్ అడ్రస్ గా మారిన ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ గా మారుస్తున్నామన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/four-greenfielf-highways-to-andhrapradesh-25-187360.html
ఉత్తర్ ప్రదేశ్ రాజకీయం మళ్లీ ఒక్కసారిగా తీవ్రస్థాయిలో వేడెక్కింది.
2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా కేవలం 11 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంలో తాజాగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాంబాబు ఆ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైనా 40 శాతం ఓటు షేర్ దక్కించుకుందని చెప్పారు.
దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులను పక్కనపెట్టి, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై తమ్ముళ్లలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఈ పరిణామాలు నారా లోకేష్ నాయకత్వ తీరుపై, కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమౌతోంది.
ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు హైకోర్టులో ఏకంగా 300 కోర్టు కేసులు వేయించారని, అయితే ధర్మాసనం వారికి తీవ్రంగా మొట్టికాయలు వేసి బుద్ధి చెప్పిందని గుర్తుచేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమే వైకాపా నైజమని మండిపడ్డారు.
మ్మెల్సీ రామసుబ్బారెడ్డి తన సతీమణి ఇందిరమ్మతో కలిసి దీక్షా శిబిరానికి చేరుకున్నారు. అయితే పోలీసులు అనుమతి లేదంటూ వారిని అడ్డుకున్నారు. ఈ దశలో వైపీపీ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో పోలీసులు ఎమ్మెల్సీ దంపతులను, పలువురు కార్యకర్తలను అదుపులోనికి తీసుకుని అక్కడ నుంచి తరలించారు.
విజయ్ రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు స్పందించలేదు. తన భార్యపై గానీ, కోర్టులో ఉన్న విడాకుల ప్రక్రియపై గానీ విజయ్ పన్నెత్తు మాట మాట్లాడలేదు. వ్యక్తిగత విషయాలకూ, రాజకీయాలకూ సంబంధం లేదని ఒక్క ముక్కలో తేల్చేశారు.
తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీకి ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు. జనసేన పార్టీతో తమకు ఉన్న మిత్రబంధం కేవలం కేంద్ర స్థాయికి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమని, తెలంగాణలో ఆ పొత్తును పొడిగించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు.
వైసీపీ అధినేత జగన్ మాత్రం బాధితుల వేదనను, కష్టాలను ఇసుమంతైనా పట్టించుకోకుండా, అక్రమాలకు పాల్పడిన నిందితుల వద్దకు వెళ్లి వారిని పరామర్శిస్తూ, ఓదార్చడం వింతగా విడ్డూరంగా ఉందన్నారు. అక్రమాలకు పాల్పడండి అండగా ఉంటానంటూ జగన్ నిందితులకు భరోసా ఇస్తున్నట్లుగా ఆయన తీరు ఉందన్నారు.
దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్న సీనియర్ నేత చలసానికి సొంత పార్టీ నుంచే ఈ స్థాయి ఒత్తిడి రావడం వెనుక కృష్ణా జిల్లా పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలే కారణమని పరిశీలకులు అంటున్నారు. ఎన్టీఆర్ తెచ్చిన మాక్స్ చట్టం కింద స్వతంత్రంగా నడుస్తున్న ఈ డెయిరీలో ప్రభుత్వ జోక్యానికి తావు లేకపోయినా. . చలసానిపై ఈ స్థాయిలో రాజీనామాకు ఒత్తడి రావడం పట్ల పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీలోని కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని మీడియా ముందుకొచ్చి బోండా ఉమా మద్దతుగా గళమెత్తారు. అయితే.. తాజాగా వైసీపీ నిరసనలను ప్రశ్నిస్తూ ఆ పార్టీ నేతలను బోండా ఉమా గట్టిగా నిలదీయడంతో వైసీపీ ఆశలు నీరుగారిపోయాయి.
న్నికల ఖర్చుల విషయానికి వస్తే వైసీపీ దేశంలోనే అత్యధికంగా వ్యయం చేసిన ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఆ ఆర్థిక సంవత్సరంలో వైసీపీ ఆదాయం 140.4 కోట్ల రూపాయలు కాగా, చేసిన వ్యయం 340.2 కోట్ల రూపాయలు. తమ వార్షిక రాబడి కంటే 142 శాతం అదనంగా, అంటే దాదాపు 199.8 కోట్ల మేర ఎక్కువ వ్యయం చేసింది.
దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను వేధిస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం, యువత భవిష్యత్తుపై రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ సదస్సు ఈనెల 8న. ప్రయాగ్‌రాజ్‌లోని ప్రసిద్ధ కేపీ కాలేజీ మైదానంలో నిర్వహించేందుకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది.
పరామర్శల పేరిట పోలీసుల ఆంక్షలను ఉల్లంఘిస్తూ, శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యేలా సాగుతున్న ఆయన పర్యటనల తీరు నేపథ్యంలో జగన్ భద్రత అంశం మరోసారి చర్చకు వచ్చింది. అంతటితో ఆగకుండా, జగన్‌కు రక్షణ తగ్గించారంటూ వైసీపీ ఎంపీల బృందం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వడంతో జగన్ భద్రత అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.