కేటీఆర్ పాస్ పోర్టు సీజ్: కారణమేంటో తెలుసా?

Publish Date:Sep 29, 2026

Advertisement

హైదరాబాద్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన ఫార్ములా-ఈ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు  పాస్ పోర్టును ఏసీబీ కోర్టు సీజ్ చేసింది.

ఈ కేసులో  కేటీఆర్ తో పాటు మరో ముగ్గురు నిందితుల పాస్ పోర్టులను సీజ్ చేయాలని కోరుతూ ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఏసీబీ ఏసీబీ కోర్టులో పటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ విచారించిన ఏసీబీ ప్రత్యేక కోర్టు.. కేసీఆర్, మరో ముగ్గురి పాస్ పోర్టులను తాతా్కలికంగా సీజ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.   నిందితుల ప్రయాణాలపై ఆంక్షలు విధించే దిశగా తగిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌లోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయాన్ని ఆదేశించింది. 

గతంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో  ఫార్ములా-ఈ రేసు నిర్వహణలో  నిధుల కేటాయింపుల్లో  అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై   సమగ్ర విచారణ జరిపించాలని ప్రస్తుత ప్రభుత్వం ఆదేశించడంతో, ఏసీబీ రంగంలోకి దిగి   దర్యాప్తు చేపట్టిన సంగతి విదితమే.  

ఈ విచారణలో భాగంగా దర్యాప్తు అధికారులు సేకరించిన ప్రాథమిక సాక్ష్యాధారాల ఆధారంగా 2024 డిసెంబరులో పలువురిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌తో పాటు, అప్పట్లో పురపాలక పరిపాలనా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించిన సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి, స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు,  ఫార్ములా-ఈ ఆపరేషన్స్ ప్రతినిధి అల్బెర్టో లోంగోలను నిందితులుగా చేర్చారు.

కేసుకు సంబంధించి ఇప్పటికే ఏసీబీ అధికారులు నిందితులను విచారించి వారి వాంగ్మూలాలు రికార్డు చేశారు. , న్యాయస్థానంలో  ఛార్జిషీట్లను కూడా దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు విచారణ దశలో కొనసాగుతోంది. అయితే..  ఆర్థిక నేర ఆరోపణలు, అవినీతి అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తులు విచారణను ఎదుర్కొనేందుకు అందుబాటులో లేకుండా విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని పేర్కొంటూ..  వారి పాస్‌పోర్ట్‌లను నిలిపివేయాలని ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు ఏసీబీ పిటిషన్ ను పరిశీలించి వారి పాస్ పోర్టులను తాత్కాలికంగా జప్పు చేసింది.    


[Formula E Race Case, KTR Passport Seized, ACB Court Hyderabad, BRS KTR News, Telangana Politics, Telugu One]

By
en-us Political News

  
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ సంక్షేమ కానుకను అందించేందుకు సిద్ధమైంది.
women cricketer Nandini suicide,BCCI Under 19 cricket, Vikarabad crickete, rFemale cricketer suicide
బీసీ రాజ్యాధికార పాదయాత్రలో తన వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు.
అక్రమ రవాణా ముఠాలకు సింహస్వప్నం.. వేలాది మంది బాధితులకు విముక్తి.. 2 వేల మందికి పైగా సివిల్ సర్వెంట్లకు మార్గదర్శకత్వం.
రాష్ట్రంలో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే అంశాలపై ప్రముఖులు స్పందిస్తుండడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
తెలంగాణ విద్యా వ్యవస్థలో కీలక సంస్కరణలు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ఇటీవలి కాలంలో ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో తగిన భద్రతా ప్రమాణాలు పాటించకుండా నిర్వహించిన దాండియా వేడుకలో దురదృష్టవశాత్తు ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. అలాగే ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా సినిమా ప్రమోషన్ ఈవెంట్  నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.  
కూల్‌డ్రింక్‌లో విషం కలిపి 10వ తరగతి విద్యార్థి హత్య.!
అత్యవసర అవసరాల నిమిత్తం శ్రీను ఒక మొబైల్ లోన్ అప్లికేషన్ ద్వారా  40 వేల రూపాయలు రుణం తీసుకున్నాడు. అయితే అనుకోని ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ మొత్తాన్ని సకాలంలో తిరిగి చెల్లించలేకపోయాడు. దీంతో లోన్ యాప్ రికవరీ ఏజెంట్ల నుంచి శ్రీనుకు   వేధింపులు ప్రారంభమయ్యాయి.
275 మంది నిపుణులకు ఉద్యోగ అవకాశాలు...మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్‌లోని చారిత్రాత్మక చార్మినార్ ప్రాంతంలో సోమవారం నాడు అసాధారణ వాతావరణం నెలకొంది.
తెలంగాణలో ధరణి, భూభారతి భూ రికార్డుల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
కొడంగల్ నివాసంలో సీఎంను కలిసి శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.