బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేపై సీఐడీ కేసు

Publish Date:Apr 22, 2025

Advertisement

 

వేములవాడ బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌పై సీఐడీ కేసు నమోదు చేసింది. భారత పౌరసత్వం లేకపోయినా తప్పుడు పత్రాలు సమర్పించిన ఎన్నికల్లో పోటీ చేశారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. చెన్నమనేని రమేష్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఫిర్యాదుతో చెన్నమనేనిపై తెలంగాణ సీఐడీ అధికారులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను అందించాలని పిలుపునిచ్చింది. బుధవారం కేసు వివరాల్ని అందించేందుకు ఆది శ్రీనివాస్‌ సీఐడీ ఎదుట హాజరుకానున్నారు. మాజీ ఎమ్మెల్యే చెన్నమనేనిపై  పౌరసత్వంపై ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నారు. తాజాగా,ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ హైకోర్టులో చెన్నమనేని పౌరసత్వంపై పలు దఫాలుగా విచారణ చేపట్టింది. విచారణలో గతేడాది డిసెంబర్‌ నెలలో చెన్నమనేని రమేష్‌ జర్మనీ పౌరుడేనని హైకోర్టు తేల్చిచెప్పింది.

భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ 2019లో జారీ చేసిన నోటిఫికేషన్‌ను సమర్థించింది. తప్పుడు పత్రాలతో గత 15 ఏళ్లుగా న్యాయస్థానాన్ని, అధికారులను తప్పుదోవ పట్టించారని ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జర్మనీ పౌరుడినని తెలిసినా పలు పిటిషన్లు దాఖలు చేసి కోర్టు సమయాన్ని వృథా చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. 2009లో తొలిసారి వేములవాడ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించింది  చెన్నమనేని రమేష్‌ మొదలు చెన్నమనేని భారతీయ పౌరుడా కాదా అనే వివాదం కొనసాగుతోంది. పౌరసత్వ వివాదంలో హైకోర్టు ఆదేశాల మేరకు ఆది శ్రీనివాస్‌కు రూ.25 లక్షలను సోమవారం మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ హైకోర్టు ద్వారా అందజేశారు. తన పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ హైకోర్టులో సవాల్‌ చేయగా.. ఆయన పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి కొట్టివేసింది. అంతేగాకుండా పౌరసత్వంపై ఫిర్యాదు చేసిన ఆది శ్రీనివాస్‌కు రూ.25 లక్షలు, లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీకి రూ.5 లక్షలను నెల రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించారు. మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ తీసుకున్న ప్రభుత్వ జీతమంతా  తిరిగి ఇచ్చేయాలని సీపీఐ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. ఆయన న్యాయ వ్యవస్థలను,కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేశారని విమర్శించారు. ఇండియన్ సిటిజన్ కాకపోయినా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి ప్రభుత్వ జీతం తీసుకున్నాడని..అంతటితో ఆగకుండా ఎమ్మెల్యే పదవిని అడ్డుపెట్టుకొని అనేక వ్యాపారాలు చేసుకుని లబ్ధి పొందాడన్నారు. అందుకే ఆయన తీసుకున్న ఎమ్మెల్యే పదవికాలంలో తీసుకున్న మొత్తం  జీతం అంతా తిరిగి ఇచ్చేయాలని..దీనిపై అవసరమైతే తాను కోర్టును కూడా ఆశ్రయిస్తామని  నారాయణ స్పష్టంచేశారు. 


 

By
en-us Political News

  
వైయస్ జగన్ ఇలాకాలో టీడీపీ 40 ఏళ్ళ చరిత్రను తిరగాసింది.
స్థానిక ఎన్నికలను అడ్డుకోవడానికి వైసీపీ 62 పిటిషన్లు వేసింది.!
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పరిధిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను ‘అర్నాబ్’ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలపై ప్రభావం చూపుతోంది.
దేశవ్యాప్తంగా రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారిన ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల అంశంలో వైఎస్సార్‌సీపీకి దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.
ప్రేమలో పడితే చాలా మంది పిచ్చి పనుల చేస్తుంటారు. నా కోసం ఏం చేస్తావని ప్రియురాలు అడిగితే.. ప్రాణమైనా ఇస్తానని లేదా ఆకాశంలోని చుక్కలైనా తెచ్చిస్తానని సినిమా డైలాగులు చెబుతుంటారు.
చిన్న రీఫండ్ కోసం ప్రయత్నించింది.. చివరకు భారీ మొత్తాన్ని పోగొట్టుకుంది.!
ఫ్రీ బస్సులో భార్య.. నవ్వులు పూయిస్తున్న భర్త ఆవేదన. !
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, ప్రముఖ నటి రష్మిక మందన్నలకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై వారి అధికారిక బృందం కఠిన చర్యలకు ఉపక్రమించింది.
ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
భాగ్యనగర ప్రయాణ ముఖచిత్రం మారనుందా? నగరంలో మెట్రో రైలు సేవలను శివారు ప్రాంతాలకు విస్తరించడంతో పాటు విమానాశ్రయానికి మెట్రో కనెక్టివిటీని కల్పించే దిశ
తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపిన వంద కోట్ల రూపాయల ప్రైవేట్ పాఠశాలల అనుమతుల కుంభకోణంలో డీఎంకే సీనియర్ నేత
హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు మేక శవంతో డెత్ డ్రామా.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.