కరీంనగర్ జిల్లాలో రాజకీయ హీట్ పీక్స్ కు చేరింది. గత కొన్ని రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ శనివారం ( మే9) కరీంనగర్ బంద్ కు పిలుపు నిచ్చింది. ఈ క్రమంలో ముందస్తు చర్యగా పోలీసులు మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అటు బీఆర్ఎస్ శ్రేణులు, ఇటు పోలీసులు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
అసలు వివాదం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కేంద్రంగా మొదలైంది. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న సమయంలో బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడటం తీవ్ర చర్చనీ యాంశమైంది. ఈ ఘటన వెనుక కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రోద్బలం ఉందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తుండగా.. అది తమపై చేస్తున్న కుట్ర అని బీజేపీ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. కాగా బంద్ నేపథ్యంలో కరీంనగర్ లో వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు పాక్షికంగా మూతపడ్డాయి. నగరంలోని ప్రధాన వీధులన్నీ దాదాపు నిర్మానుష్యంగా మారాయి. పోలీసులు ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం జిల్లా వ్యాప్తంగా అదనపు బలగాలను రంగంలోకి దించినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఒకవైపు బీఆర్ఎస్ శ్రేణులు బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతుండగా.. మరోవైపు బీజేపీ నాయకులు దీనిని తీవ్రంగా వ్యతిరే కిస్తున్నారు.
కరీంనగర్లో బంద్ పాటించాల్సిన అవసరం లేదని బీజేపీ నేతలు అంటున్నారు. ప్రజలు, వ్యాపారులు యధావిధిగా తమ కార్యకలాపాలు నిర్వహించుకోవాలని బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. వాణిజ్య సంస్థలు యధావిధిగా తెరిచి ఉంచాలని కోరుతున్నారు. రాజకీయ ప్రత్యర్థుల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో కరీంనగర్ జిల్లా రాజకీయం ప్రస్తుతం అట్టుడుకుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/former-minister-gangula-house-arrest-39-219279.html
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్ఎస్ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్‌కు, మీమ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో.. ఇద్దరు బద్ద రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఒ ముఖాముఖి ఎదురైతే.. అసలా ఊహే ఎవరికీ రాదు అన్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా రఘురామకృష్ఫం రాజు, అంబటి రాంబాబు ఓ వివాహ వేడుకలో ఎదురు పడ్డారు.
రాజధాని వంటి అత్యంత కీలకమైన, సున్నితమైన విషయంలో జగన్ పదే పదే తన స్టాండ్ మార్చుకోవడం పరిశీలకులను సైతం విస్మయానికి గురి చేస్తున్నది. స్థిరత్వం లేని జగన్ తీరు వెనుక ఎవరి సలహాలు ఉన్నాయన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
పాత చరితను పునరావృతం చేస్తున్న డిప్యూటీ స్పీకర్!