మాజీ ఎంపీ కొత్త‌ప‌ల్లి గీతకు ఐదేళ్లు జైలు

Publish Date:Sep 14, 2022

Advertisement

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను మోసం చేసిన కేసులో మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా విధిస్తూ నాంపల్లి సీబీఐ కోర్టు  తీర్పు ఇచ్చింది. గీతతోపాటు ఆమె భర్త రామ కోటేశ్వరరావు కు కూడా ఇదే శిక్ష విధించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు మోసం చేసిన కేసులో 2015లో చార్జిషీటు ఫైల్ చేశారు. దీని ఆధారంగా కోర్టు తీర్పు వెల్లడించింది. బ్యాంక్ అధికారులు బీకే జయప్రకాషన్, కేకే అరవిందాక్షన్‌కు  ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవైట్ లిమిటెడ్ కంపెనీకు రూ.2 లక్షల జరిమానా విధిస్తూ సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కొత్తపల్లి గీత సహా మిగిలిన నింది తులను అరెస్టుచేసి వైద్యపరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు.

కాగా కొత్తపల్లి గీత తరఫున హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలైంది. దీనికి సంబంధించి కోర్టు విచారిస్తుం దా? లేక వాయిదా వేస్తుందా? అన్నది తెలియాల్సి ఉంది. 2015లో కేసు రిజిష్టర్ అయిన తర్వాత సుదీ ర్ఘంగా వారికి నోటీసులు జారీ చేసిన సీబీఐ.. విచారించి చార్జిషీటును దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన సీబీఐ కోర్టు ఈ మేరకు వారికి జైలు శిక్ష విధించింది.

విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పేరుతో రుణం తీసుకున్న గీత దంపతులు.. బ్యాంకుకు ఎగనామం పెట్టారు. ఈ స్కామ్‌కు సహకరించిన బ్యాంకు అధికారులు బీకే జయప్రకాషన్, కేకే అరవిందాక్షన్ కూ ఐదేళ్ల శిక్ష విధించింది న్యాయస్థానం. విశ్వశ్వర ఇన్ ఫ్రా ప్రై.లి.కు రూ.2లక్షల జరిమానా విధించిన సీబీఐ కోర్టు. మంగళవారం ఈ కేసులో తీర్పు రావడంతో కొత్తపల్లి గీత సహా నిందితులను సీబీఐ అదుపులోకి తీసుకుంది . గీత భర్త, బ్యాంకు అధికారులను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున 2014లో ఎంపీగా ఎన్నికైన కొత్తపల్లి గీత ఆ తర్వాత ఆ పార్టీతో దూరం జరిగారు. బీజేపీకి దగ్గరయ్యారు. అయితే గత ఎన్నికల సమయంలో ఏ పార్టీలోనూ చేరలేదు. ఎక్కడా పోటీ చేయలేదు. ఇటీవల అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు ఆయనను కలిసిన వారిలో కొత్తపల్లి గీత కూడా ఉన్నారు. ఆమె బీజేపీలో చేరుతుందన్న ప్రచారం జరిగింది.  అయితే చేరలేదు. ఈ లోపే ఆమె బ్యాంక్ ఫ్రాడ్ కేసులో జైలు శిక్షకు గురయింది. తనకు  బెయిల్ ఇవ్వాలని ఆమె తెలంగాణ  హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరగాల్సి ఉంది. 

మొదట బ్యాంక్ఉద్యోగిగా పనిచేసి తర్వతా గ్రూప్ 1 పరీక్షల్లో విజయం సాధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. 1999వ సంవత్సరం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ్ సబ్-కలెక్టర్‌ గా వివిధహోదాల్లో పనిచేసింది. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (ల్యాండ్ ప్రొటెక్షన్), రెవెన్యూ డివిజనల్ ఆఫీ సర్, ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, సర్వేలో ల్యాండ్ రికార్డులు స్పెషల్ ఆఫీసర్ మొదలైన పదవులలో పనిచేశారు. హైదరాబాద్‌లో పని చేస్తున్న సమయంలో ఆమె భూముల అవకతవ కలకు పాల్పడినట్లుగా ఆరోపణలు వచ్చాయి. 2010లో  ఉద్యోగం మానేసి  భర్తతో కలిసి వ్యాపా రం ప్రారంభించారు తర్వాత వైఎస్ఆర్‌సీపీ తరపున రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా ఎన్నికయ్యారు. కానీ ఇప్పుడు బ్యాంక్ రుణాల ఎగవేత కేసులో జైలు పాలవ్వాల్సి వచ్చింది. 

By
en-us Political News

  
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.