Publish Date:Nov 15, 2024
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి మంత్రి పయ్యావుల కేశవ్ ఆర్థిక ఉగ్రవాదిగా అభివర్ణించారు. శాసనసభలో బడ్జెట్‌పై ప్రసంగించిన ఆయన ఆర్థిక ఉగ్రవాది గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించారన్నారు. రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు నానా కష్టాలు పడుతున్నామన్న పయ్యావుల అసలు గత ప్రభుత్వం చేసిన అప్పులను ఎలా పిలవాలో కూడా అర్ధం కాని పరిస్థితి ఉందన్నారు. దేనికీ లెక్కాపత్రం లేదన్నారు.
అంకెల గారడీతో జగన్ సర్కార్ అన్ని వ్యవస్థలనూ అస్తవ్యస్తం చేసేసిందని విమర్శించారు. జగన్ హయాంలో రాష్ట్రంలో ఈ ఐదేళ్లలో ప్రతి శాఖలోనూ అరాచకం జరిగిందని పేర్కొన్నారు. చట్ట సభల అనుమతి లేకుండా రూ. 634 కోట్లు ఖర్చు చేసినట్టు కాగ్ చెప్పిందని పయ్యావుల కేశవ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. వైసీపీ హయాంలో పారిశ్రామికవేత్తలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయారని తెలిపారు. ఆర్థిక ఉగ్రవాది జగన్ సృష్టించిన ఆర్థిక విధ్వంసంతో రాష్ట్రం అన్ని రంగాలలో కుదేలైందని, కూటమి ప్రభుత్వంలో మళ్లీ రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని పయ్యావుల కేశవ్ అన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/financial-terrorist-jagan-25-188412.html
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.