అధికార పార్టీలో బెరుకు బెదురు!?

Publish Date:Jul 30, 2023

Advertisement

వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి   జగన్ సొంత చిన్నాన్న  వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో ఇటీవల చోటు చేసుకొంటున్న వరుస  పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీలోని అత్యంత కీలక నేతల్లో నిద్రకరవైందనే   చర్చ ఆ పార్టీలోని ఓ వర్గంలో హల్‌చల్ చేస్తున్నది. 

తన తండ్రి  వివేకా హత్య జరిగిన కొద్ది రోజులకు.. తన సోదరుడు, సీఎం  జగన్ భార్య వైఎస్ భారతి, వైఎస్ విజయమ్మ, సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులంతా ఒకే సారి తన ఇంటికి వచ్చారని.. ఆ సమయంలో   భారతీ ఆందోళన చెందుతూ కనిపించారని.. అలాగే ఏదైనా ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డితో మాట్లాడాలంటూ   భారతి.. తనకు సూచించారని డాక్టర్  సునీత పేర్కొన్నట్లు పలు కథనాలు జులై 22, 23వ తేదీల్లో.. అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయినాయి. 

ఆ వెంటనే అంటే.. ఆ రెండు రోజులకే జులై 25న ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్వయంగా ప్రెస్‌మీట్ పెట్టి... ఆ కథనాలపై క్లారిటీ ఇవ్వడమే కాకుండా... వివేకా హత్య జరిగిన కొద్ది రోజుల తర్వాత.. తాను, తన ఫ్యామిలీ   సునీత నివాసానికి వెళ్లి పరామర్శించి వచ్చామని స్పష్టం చేశారు. అంతేకానీ  భారతి,   విజయమ్మ, తాను కలిసి   సునీత ఇంటికీ వెళ్ల లేదని చెప్పారు. 

అయితే ఆ రెండు రోజుల తర్వాత.. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ  అవినాష్‌రెడ్డి నేరుగా తాడేపల్లి చేరుకొని..  సోదరుడు, ముఖ్యమంత్రి  జగన్‌తోపాటు ప్రభుత్వ ముఖ్య సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డితో భేటీ అయి పలు కీలక అంశాలపై   సుదీర్ఘంగా చర్చించినట్లు ఓ చర్చ పార్టీ శ్రేణుల్లోనే జరుగుతోంది.   


ఇది జరిగిన   రెండు రోజులకే సీఎం జగన్ ప్రధాన సలహాదారు అజేయ్ కల్లం... తెలంగాణ హైకోర్టు మెట్లు ఎక్కారు. వివేకా హత్య కేసులో ఇంతకు ముందు సీబీఐకి తాను ఇచ్చిన వాంగ్మూలాన్ని తప్పుగా నమోదు చేసుకుందని.. దీంతో వివేకా హత్య కేసు ఛార్జీషిట్ నుంచి తన వాంగ్మూలాన్ని తొలగించాలని   పిటిషన్ దాఖలు చేశారు.  

ఇలా వరుసగా ప్రతీ రెండు రోజులకు ఒకరు.. ఇలా బుల్లి తెర తెలుగు సీరియల్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా వివేకా హత్య కేసు ముందుకు సాగకుండా అడుగడుగునా అడ్డుపడే ప్రయత్నాలు చేస్తున్నారు.  అలాగే ఇప్పటి వరకు ఈ హత్య వెనుక ఉన్న సూత్రధారులు ఎవరో.. ఈ హత్యకు స్కెచ్ చేసిందెవరో... అన్ని ప్రజలకు క్లియర్‌ కట్‌గా అర్థమైనా.. 

ఈ హత్య కేసులో   సజ్జల , అవినాష్ లు జగన్ తో భేటీ కావడం,   అనంతరం అజేయ్ కల్లం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం చూస్తుంటే వివేకాహత్య కేసు విషయంలో అధికార పార్టీలో ఏదో బెరుకు, బెదురు కనిపిస్తున్నదని తేటతెల్లం అవుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈ కేసుకు సంబంధించి సీబీఐకి వాంగ్మూలం ఇచ్చిన వారిలో మరొకరు ఎవరో బయటకొచ్చి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. ఇంకోవైపు ఆగస్టు 14వ తేదీ కోర్టుకు హాజరుకావాలంటూ.. కడప ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. అలాంటి వేళ ఈ అంశం  వైసీపీలోని అత్యంత కీలక నేతల్లో గుబులు రేపుతోందని, అందుకే సజ్జల, అవినాష్, జగన్ ల భేటీ, అజేయ్ కల్లాం పిటిషన్ అని అంటున్నారు. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.