వర్షాభావ పరిస్థితికి దేవేంద్రుడే కారణమంటూ తాశిల్దార్ కు రైతు ఫిర్యాదు

Publish Date:Jul 19, 2022

Advertisement

ఎవరైనా నగలు పోయాయనో, మొగుడు కొట్టాడనో, ఆస్తిగొడవలనో ఫిర్యాదులు ఇవ్వడం సహజం. కానీ ఉత్తరప్రదేశ్ లో ఓ రైతు ఏకంగా ఇంద్రుడి మీదే ఫిర్యాదు చేశాడు. వర్షాలు సరిగా పడక పోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామనీ వర్షాభావ పరిస్థితికి దేవతల దేవుడైన ఇంద్రుడే కారణమనీ, అతగాడిపై చర్యలు తీసుకోవాలనీ కొరుతూ ఏకంగా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశాడు.

ఉత్తరప్రదేశ్ రెవెన్యూ అధికారులు సంపూర్ణ సమాధాన్‌ దివస్ కార్యక్రమంలో భాగంగా ప్రజల సమస్యలను తెలుసుకుంటారు. ఇది ఎప్పుడూ జరిగేదే. మూడు రోజుల క్రితం అంటే శనివారం గోండా జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా కల్నల్‌గంజ్ తహసిల్దార్‌ నరసింహ నారాయణ్ వర్మకు ఝాల గ్రామానికి చెందిన సుమిత్ కుమార్ యాదవ్ అనే రైతు ఇంద్రుడిపై ఫిర్యాదు చేశాడు.

అయ్యా, కొన్ని నెలలుగా మా జిల్లాలో వానలు కురవడం లేదు. కరువు తాండవించడం వల్ల ప్రజలు, ముఖ్యంగా మహిళలు, పిల్లలు, జంతువులు, రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. నెలల పాటు వానలు కురిపించని ఇంద్ర దేవుడిపై తగిన చర్య తీసుకోవాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను అని సుమిత్  ఫిర్యాదు అందుకున్న తహసిల్దార్‌ దానిని చదవకుండానే తగిన చర్యలు తీసుకోవాలంటూ  ఓ ముద్ర వేసి జిల్లా మెజిస్ట్రేట్‌కి పంపించేశారు. ఈ విషయం కాస్త బయటికి పొక్కడంతో పాలక యంత్రాంగం కనీసం ఫిర్యాదు కూడా చదవకుండా ఈ స్థాయిలో నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించడం సిగ్గుచేటు అని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.

ఈ ఫిర్యాదు ఏంటి? ఇందులో ఏం రాశారు? ఇది ఏ విభాగానికి పంపించాలని? అనే విషయాలను కూడా తెలుసుకోకుండా తహసిల్దార్‌ ప్రవర్తించడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. ఈ కంప్లైంట్‌కు సంబంధించిన ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ కంప్లైంట్‌లో తహశీల్దార్‌ సంతకం, స్టాంపు కూడా ఉన్నాయి.ఈ వ్యవహారం మొత్తం స్థానికంగా ప్రభుత్వ అధికారులను నవ్వుల పాలు చేసింది. దీంతో ఆగ్రహించిన కలెక్టర్ డా.ఉజ్వల్ కుమార్ తహసిల్దార్‌పై విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా పరిగణిస్తున్నామని కలెక్టర్ అన్నారు. కేసు విచారణ నిమిత్తం చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ జయ యాదవ్‌కు అప్పగించినట్లు తెలిపారు. విచారణ కోసం యాదవ్ కల్నల్‌గంజ్ చేరుకోనున్నారు.అయితే సదరు తహసిల్దార్‌ ఈ ఫిర్యాదు గురించి స్పందించారు.

ఈ కంప్లైంట్ చూసి నేను షాక్ అయ్యా. ఇది ఫోర్జరీ చేశారు. అసలు అలాంటి ఫిర్యాదు నా వద్దకు రానే లేదు. ఆ ఫిర్యాదుపై కనిపించే ముద్ర నకిలీది. సంపూర్ణ సమాధాన్ దివస్‌లో వచ్చిన ఫిర్యాదులు సంబంధిత విభాగాలకు నామినేట్ చేస్తాం. ఈ ఫిర్యాదులు ఏ ఇతర కార్యాలయాలకు పంపించం.ఇదంతా ఎవరో కావాలనే పుట్టించారు. దీనిపై విచారణ జరుగుతోంది అని చాలా సింపుల్ గా సమాధానం ఇచ్చారు. చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ ఎంక్వయిరీ చేసి ఏం రిపోర్ట్ ఇస్తారో చూడాలి.

By
en-us Political News

  
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.