ఫేక్ వార్తల ప్రచారం, వీడియోల ప్రసార విషయాలలో బీజేపీ ఇంత కాలం తాను పవిత్రంగా ఉన్నానంటూ చేసుకుంటున్న ప్రచారంలో ఇసుమంతైనా వాస్తవం లేదని తేలిపోయింది. విపక్షాలపై దుష్ప్రాచారానికి వీడియో టేప్‌లను విడుదల చేయడమనే దుష్ట సాంప్రదాయం అంటని సచ్ఛీలత మాది అంటున్న బీజేపీ బండారం బయటపడిపోయింది. పేక్ వార్తలు, వీడియోల విషయంలో బీజేపీకి మినహాయింపు ఏమీ లేదని తేటతెల్లమై పోయింది. రాహుల్ గాంధీకి వ్యతి రేకంగా ఫేక్ వీడియో విడుదల చేసినందుకు ఇద్దరు బీజేపీ ఎంపీలపై ఛత్తీస్ గడ్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది.
ఛత్తీస్‌గఢ్‌లో రాహుల్‌గాంధీకి సంబంధించి విడుదలైన వీడియో మత సామరస్యానికి భంగం కలిగించే దిలా వుందని దాఖలైన ఫిర్యాదుపై బీజేపీ ఎంపీలు రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, సుబ్రత్ పాఠక్‌లపై ఎఫ్ఐ ఆర్ నమోదు అయ్యింది. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో ఎంపీలతో పాటు మరో ముగ్గురిపై ఎఫ్‌ఐఆర్ నమోదైందని ఆ పార్టీ మీడియా పబ్లిసిటీ టీమ్ చీఫ్ పవన్ ఖేరా తెలిపారు. ఢిల్లీ, జార్ఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ వారిపై ఫిర్యాదులు చేసిందని, ఖేరా, ఆ పార్టీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ సుప్రియా శ్రీనాటే విలేకరులతో అన్నారు.
రాహుల్ పై ఫేక్ వీడియోలు విడుదల చేసి బీజేపీ ఎంపీలిద్దరూ దేశద్రోహానికి పాల్పడ్డారని ఆయన దేశంలో మత సామరస్యానికి భంగం కలిగించే ఉద్దేశంతో కేంద్ర మాజీ మంత్రి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తే, అది దేశద్రోహమేనని ఆమె ఆరోపిం చారు. అబద్ధ వార్తలు ప్రచారంచేసేవారికి బీజేపీలో ప్రమోషన్లు వస్తున్నాయన్నారు. హైదరాబాద్‌లో ప్రధాని దాదాపు అరగంట సేపు మాట్లాడారని, అయితే శాంతి, మత సామరస్యం కోసం కోసం ఒక్క విజ్ఞప్తి కూడా చేయలేదని ఆమె అన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/fake-video-on-rahul-fir-on-two-bjp-mps-in-chattisghar-39-139127.html
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.