Publish Date:Feb 18, 2026
హైదరాబాద్‌లో నకిలీ పోలీసుల ముఠా మరోసారి బీభత్సం సృష్టించింది. పోలీసు వాహనం, పోలీసు యూనిఫామ్, లాఠీలు, హ్యాండ్‌కఫ్స్‌తో సినీ ఫిక్కీ తరహాలో ఓ కంపెనీ ఎండి కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన ఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. నెలరోజుల పాటు సాగిన ఈ కిడ్నాప్ హైడ్రామాతో బాధిత కుటుంబం ప్రాణభయంతో వణుకుతూ దాదాపు నెలరోజుల పాటు బందీ జీవితం గడిపింది. చిట్టచివరకు పోలీసులను ఆశ్రయించింది.
కూకట్‌పల్లికి చెందిన రామచందర్‌రాజు శ్రీనివాస్ సివిల్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఎండిగా ఉన్నారు. అదే సంస్థలో ప్రకాష్ అనే వ్యక్తి దాదాపు 26 ఏళ్లుగా ఫైనాన్స్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గతంలో ఆ సంస్థకు కాంట్రాక్ట్ పనులు చేసిన అల్లూరి వెంకట సత్యనారాయణ రాజు, శివరామరాజులతో రామచందర్‌రాజుకు ఆర్థిక లావాదేవీల విషయంలో వివాదాలు తలెత్తాయి. అప్పట్లో పరస్పరం సెటిల్‌మెంట్ జరిగినప్పటికీ, మళ్లీ భారీ మొత్తాన్ని వసూలు చేయాలనే ఉద్దేశంతో కుట్ర పన్నాడు రూ.7 కోట్లు వసూలు చేసేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసిన నిందితులు, గతంలో నకిలీ ఐపీఎస్ అధికారిగా చలామణి అవుతూ అరెస్టయిన నాగరాజు అలియాస్ కార్తీక్‌ను సంప్రదించారు. అతడు మరో ముగ్గురితో కలిసి నకిలీ పోలీస్ బృందాన్ని తయారు చేసి ఆపరేషన్‌కు తెరలేపాడు.
ప్లాన్ ప్రకారం ఈ ఏడాది జనవరి 9న ముందుగా ఫైనాన్స్ మేనేజర్ ప్రకాష్‌ను కిడ్నాప్ చేశారు. అనంతరం ఎండి రామచందర్‌రాజు కుటుంబాన్ని కూడా అదుపులోకి తీసుకుని వివిధ ప్రాంతాలకు తరలిస్తూ బందీగా ఉంచారు. జనవరి 9 నుంచి ఫిబ్రవరి 10 వరకు దాదాపు నెలరోజుల పాటు బాధితులను ఏపీలోని ధవలేశ్వరం, హైదరాబాద్ సమీపంలోని మొయినా బాద్ ప్రాంతంలో ఉన్న ఓ ఫామ్‌హౌస్‌లలో నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశారు.
ఇప్పటికే బాధితుల నుంచి రూ.20 లక్షలు వసూలు చేసిన నిందితులు, ఇంకా రూ.4 కోట్లు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడ్డారు. డబ్బు ఇవ్వకపోతే కుటుంబ సభ్యులను హతమారుస్తా మని హెచ్చరించడంతో బాధితులు తీవ్ర భయాందో ళనలకు గురయ్యారు. చివరకు ప్రాణభయంతో కేపీహెచ్‌బీ పోలీసులను ఆశ్రయించారు.ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో శివరామరాజుతో పాటు నకిలీ పోలీసులుగా వ్యవ హరించిన కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రధాన సూత్ర ధారులుగా భావిస్తున్న అల్లూరి వెంకట సత్యనా రాయణ రాజు, నాగరాజు అలియాస్ కార్తీక్‌తో పాటు మరో ఇద్దరు పరారీలో ఉండగా, వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/fake-police-kidnapped-family-39-214273.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.