పింఛన్ సొమ్ముకు దొంగనోట్లా.. ఎన్ఐఏ చేత విచారణకు ఆర్ఆర్ఆర్ డిమాండ్

Publish Date:Jan 3, 2023

Advertisement

పింఛన్ లబ్ధిదారులకు దొంగనోట్ల పంపిణీపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఐ) చేత విచారణ జరిపించాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు డిమాండ్ చేశారు. వృద్ధాప్య పింఛనుదారులు పంపిణీ చేసిన దొంగ నోట్ల వ్యవహారంతో ప్రభుత్వ పెద్దలకు నిజంగానే సంబంధం లేకపోతే ముఖ్యమంత్రి రవ్వంత చొరవ తీసుకొని ఎన్ఐఏ విచారణ కోసం లేఖ రాయాలన్నారు.

సోమవారం(జనవరి 2)  రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. దొంగ నోట్ల పంపిణీతో పింఛన్ ప్రపంచం నిర్గాంత పోయింది. తమకిచ్చిన డబ్బులలో ఏమైనా దొంగ నోట్లు ఉన్నాయా? అని వృద్ధులు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవలసిన అనివార్య పరిస్థితి నెలకొందన్నారు. పింఛన్ సొమ్ముగా దొంగనోట్ల పంపిణీపై ఎన్ఐఏ దర్యాప్తు కోరుతూ తన వంతుగా లేఖ రాయనున్నట్లు చెప్పారు. వాలంటీర్లు దొంగ నోట్లు ఇస్తున్నారా?, లేకపోతే వారితో ఎవరైనా ఇప్పిస్తున్నారా? అన్న అనుమానం వ్యక్తం చేశారు. వృద్ధాప్య పింఛన్ లబ్ధిదారులకు ఇచ్చే నగదులో దొంగ నోట్లు ఎవరు కలిపారన్నది నిగ్గు తేలాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన తర్వాత మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.

అసలు దొంగ నోట్లు పంపిణీ చేసింది ఎవరు?, దీని వెనక ఏదైనా ముఠా ప్రమేయం ఉందా??, నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డుల ప్రకారం… దొంగ నోట్ల పంపిణీలో మన రాష్ట్రం మూడవ స్థానంలో ఉన్నట్టు తేలిందన్నారు. అసలు పింఛన్ లబ్ధిదారులకు బ్యాంకు అకౌంట్ ద్వారా డబ్బులను పంపిణీ చేయకుండా, నేరుగా నగదు పంపిణీ చేయడం వెనుక జగన్మోహన్ రెడ్డికి రాజకీయ దురుద్దేశం ఉందని రఘు రామకృష్ణంరాజు అన్నారు. ప్రతి నెల 1800 కోట్ల రూపాయల నగదును బ్యాంకు నుంచి డ్రా చేసి వాలంటీర్ల ద్వారా రాష్ట్రంలోని పింఛన్ లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. ఇందులో ఐదు శాతం దొంగ నోట్లు కలిపి పంపిణీ చేసిన 80 కోట్ల రూపాయల దొంగ నోట్లు మార్కెట్ చలామణిలోకి వెళ్తాయన్నారు.

తెలంగాణలో పింఛన్ లబ్ధిదారులకు పోస్ట్ ఆఫీస్ ల ద్వారా నగదు పంపిణీ చేస్తున్నారు. బాధ్యతాయుతమైన ప్రభుత్వ అధికారి, లబ్ధిదారుల వద్ద వేలి ముద్రలు తీసుకొని, నగదును అందజేస్తున్నారు. దీనితో దొంగ నోట్ల పంపిణీకి అసలు ఆస్కారమే లేదు. కానీ రాష్ట్రంలో ఇంటింటికి ఉదయాన్నే వెళ్లి, వాలంటీర్లు పింఛన్ డబ్బులను పంపిణీ చేస్తున్నారు. ఉదయాన్నే పంపిణీ చేయడం వల్ల , వాలంటీర్లు ఇచ్చే నోట్లను లబ్ధిదారులు సరిగ్గా పరిశీలించే అవకాశం లేదు. పింఛన్ లబ్ధిదారులకు నగదు పంపిణీ వెనుక రాజకీయ స్వలాభంతోపాటు, దొంగ నోట్ల చలామణి కోసం వాలంటీర్లు ఈ విధానాన్ని అణువుగా మలుచుకునే అవకాశం ఉంది. దొంగ నోట్లు చలామణి కావద్దని ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పెద్ద నోట్లను రద్దు చేశారు. ప్రధానమంత్రి సదుద్దేశంతో తీసుకున్న ఈ నిర్ణయానికి తూట్లు పొడిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని రఘురామకృష్ణం రాజు అన్నారు.

అసలు మొదటి నుంచీ ఆంధ్రప్రదేశ్ లో వలంటీర్ల వ్యవహారం ఎప్పుడూ వివాదా స్పదంగానే ఉంది. ఎ తాజాగా ఓ వాలంటీర్.. తన పరిధిలో ఉన్న వారికి పించన్లను పంపిణీ చేశాడు. కానీ అవి దొంగ నోట్లుగా తేలవడం సంచలనం సృష్టిస్తోంది.    ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం నర్సయపాలెం ఎస్సి పాలెంలో వాలంటీర్ ఉదయమే వచ్చి పెన్షన్లు ఇచ్చాడు. ఆ నగదును కొంత మంది తమ బంధువులకు పంపేందుకు కమిషన్ తీసుకుని డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసే దుకాణం వద్దకు వెళ్లి.. ఆ నోట్లు ఇచ్చారు. అయితే వాటిని నకిలీ నోట్లుగా దుకాణం యజమాని గుర్తించారు. దీంతో పింఛన్‌ దారులు అవాక్కయ్యారు.

వెంటనే వాలంటీర్‌ని నిలదీయడంతో అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు అక్కడికి చేరుకొని ఆ నగదును వెనిక్కి తీసుకొని విచారిస్తున్నారు. మొత్తం రూ.19 వేలు దొంగ నోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.   వాలంటీర్ల చేతికి  ప్రభుత్వ ధనం పంపిణీకి ఇవ్వడమే చట్ట విరుద్ధం. అయినప్పటికీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం చట్ట విరుద్ధ విధానాలను యథేచ్ఛగా కొనసాగిస్తోంది.  మొత్తానికి పింఛన్లలో దొంగనోట్ల వ్యవహారం  సంచలనం రేపుతోంది.అసలు దోషులను పట్టుకోవాలంటే ఎన్ఐఏ విచారణ ఒక్కటే మార్గమని రఘురామ కృష్ణంరాజు వంటి వారు డిమాండ్ చేస్తున్నారు. 

By
en-us Political News

  
 పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ  అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ  దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు.    ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4-0తో ఎన్డీఏ క్లీన్ స్వీప్.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.